జిడబ్ల్యుఎం హవల్ ఎఫ్ 5 ఎస్‌యువి : స్పైడ్ టెస్టింగ్, ఇతర వివరాలు

గ్రేట్ వాల్ మోటార్స్ భారత మార్కెట్లో వివిధ విభాగాలలో అనేక ఎస్‌యువిలను ప్రవేశపెట్టింది. ఇప్పుడు గ్రేట్ వల్ల మోటార్స్ హవల్ ఎఫ్ 5 ప్రీమియం ఎస్‌యువిని మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. అయితే హవల్ ఎస్‌యువిని ప్రవేశపెట్టకముందే స్పై టెస్ట్ నిర్వహించింది.

జిడబ్ల్యుఎం హవల్ ఎఫ్ 5 ఎస్‌యువి : స్పైడ్ టెస్టింగ్, ఇతర వివరాలు

గాడివాడి నుంచి వచ్చిన సమాచారం ప్రకారం హవల్ ఎఫ్ 5 ఆరంజ్ కలర్ ప్లాట్- బెడ్ ట్రక్ పై తీసుకెళ్తున్నట్లు గుర్తించింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే 2020 ఆటోఎక్స్పోలో ప్రదర్శించిన మోడల్ ఇదే కావచ్చు. గ్రేట్ వాల్ మోటార్స్ వీటిని పూణేలో తయారు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇది సంవత్సరానికి 2 లక్షల వాహనాలను తయారు చేయగలదు.

జిడబ్ల్యుఎం హవల్ ఎఫ్ 5 ఎస్‌యువి : స్పైడ్ టెస్టింగ్, ఇతర వివరాలు

జిడబ్ల్యుఎం హవల్ ఎఫ్ 5 యొక్క కొలతలను గమనించినట్లయితే దీని పొడవు 4,470 మిమీ, వెడల్పు 1,857 మిమీ, ఎత్తు 1,638 మిమీ మరియు 2,680 మిమీ పొడవు గల వీల్‌బేస్ కలిగి ఉంది. జీప్ కంపాస్‌తో పోల్చితే హవల్ ఎఫ్ 5 75 మి.మీ పొడవు మరియు 44 మి.మీ పొడవు గల వీల్‌బేస్ కలిగి ఉంది.

జిడబ్ల్యుఎం హవల్ ఎఫ్ 5 ఎస్‌యువి : స్పైడ్ టెస్టింగ్, ఇతర వివరాలు

హవల్ ఎఫ్ 5 యొక్క వెలుపలి భాగం మంచి డిజైన్ అంశాలతో స్పోర్టిగా కనిపిస్తుంది. ఎఫ్ 5 లో క్రోమ్-యాసెంట్ ఫ్రంట్ గ్రిల్, సొగసైన ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్, స్పోర్టి మరియు బోల్డ్ షోల్డర్ లైన్స్, రెండు చివర్లలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్, అడ్డంగా ఉంచిన ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్, ఫాక్స్ ఎయిర్ డ్యామ్‌లు, క్రోమ్-టిప్డ్ ఎగ్జాస్ట్స్, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.

జిడబ్ల్యుఎం హవల్ ఎఫ్ 5 ఎస్‌యువి : స్పైడ్ టెస్టింగ్, ఇతర వివరాలు

హవల్ ఎఫ్ 5 యొక్క స్పోర్టింగ్ లుక్ క్యాబిన్లో కొనసాగుతుంది. ఇందులో డ్యూయల్ టోన్ ఎరుపు మరియు నలుపు అప్హోల్స్టరీ ఉన్నాయి. ఇందులో తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లెదర్ సీట్లు, 12.3-అంగుళాల పుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు మొదలైనవి కూడా ఇందులో ఉన్నాయి.

జిడబ్ల్యుఎం హవల్ ఎఫ్ 5 ఎస్‌యువి : స్పైడ్ టెస్టింగ్, ఇతర వివరాలు

జిడబ్ల్యుఎం హవల్ ఎఫ్ 5 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 166 బిహెచ్‌పి మరియు 285 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా ఏడు-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్‌తో జతచేయబడి ఉంటుంది.

జిడబ్ల్యుఎం హవల్ ఎఫ్ 5 ఎస్‌యువి : స్పైడ్ టెస్టింగ్, ఇతర వివరాలు

ఎఫ్ 5 మిడ్-సైజ్ ఎస్‌యువి యొక్క భద్రతా లక్షణాలలో ఆరు ఎయిర్‌బ్యాగులు, లేన్ డిపార్చర్ వార్ణింగ్, లేన్ కీప్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు ఉంటాయి. జిడబ్ల్యుఎం తన మొదటి ఉత్పత్తిని వచ్చే ఏడాదిలోపు భారతదేశంలో విడుదల చేయనుంది.

జిడబ్ల్యుఎం హవల్ ఎఫ్ 5 ఎస్‌యువి : స్పైడ్ టెస్టింగ్, ఇతర వివరాలు

హవల్ ఎఫ్ 5 ఇండియన్ మార్కెట్లో ప్రారంభించిన తర్వాత జీప్ కంపాస్, కియా సెల్టోస్, వోక్స్వ్యాగన్ టి-రోక్, ఎంజి హెక్టర్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. గ్రేట్ వాల్ మోటార్స్ హవల్ ఎఫ్ 5 ను మిడ్-సైజ్ ఎస్‌యువిలో చాలా పోటీ విభాగంలో ఉంచుతోంది.

జిడబ్ల్యుఎం హవల్ ఎఫ్ 5 ఎస్‌యువి : స్పైడ్ టెస్టింగ్, ఇతర వివరాలు

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం.. !

హవల్ ఎఫ్ 5 ను ప్రీమియం ఎస్‌యువిగా పరిగణిస్తారు. ఏదేమైనా ఇది ఇండియన్ మార్కెట్లో విడుదలైన తరువాత చాలా ప్రత్యర్థులను ఎదర్కోవలసి వస్తుంది. ఇది కూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటం వల్ల చాలా మంది వినియోగదారులను ఆకర్షించే అవకాశం వుంది. ప్రస్తుతానికి హవల్ ఎఫ్ 5 బాగా రూపకల్పన చేసి దాని ప్రత్యర్థులను మంచి పోటీ ఇచ్చే విధంగా తయారుచేయబడింది.

Most Read Articles

English summary
GWM Haval F5 SUV Spied Testing Ahead Of India Launch: Spy Pics & Details. Read in Telugu.
Story first published: Monday, March 23, 2020, 16:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X