Just In
- 1 hr ago
భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..
- 1 hr ago
కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి
- 2 hrs ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
- 3 hrs ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
Don't Miss
- Finance
కరోనా టైంలో ముఖేష్ అంబానీ ప్రతి గంట సంపాదన రూ.90 కోట్లు, వారి సంపద రూ.3వేలే!
- Lifestyle
రాత్రి ఫోన్ వాడకుండా జాగ్రత్త వహించండి .. డేంజర్ !!
- News
పెళ్లికి పెద్దల ‘నో’: జగిత్యాలలో యువతి, దుబాయ్‌లో యువకుడు బలవన్మరణం
- Sports
విమాన ప్రమాదంలో నలుగురు ఆటగాళ్లు మృతి!!
- Movies
30 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ అన్నయ్యలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హోండా అమేజ్ మరియు హోండా డబ్ల్యూఆర్-వి స్పెషల్ ఎడిషన్స్ విడుదల - ధరలు
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ సెడాన్ అమేజ్ మరియు ఎస్‌యూవీ డబ్ల్యుఆర్-వి మోడళ్లలో కంపెనీ కొత్త స్పెషల్ ఎడిషన్ వేరియంట్లను ప్రవేశపెట్టింది. హోండా 'ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్' పేర్లతో మార్కెట్లో విడుదలైన ఈ మోడళ్ల ధరలు వరుసగా ర .7.96 లక్షలు (అమేజ్), రూ.9.70 లక్షలు (డబ్ల్యుఆర్-వి)గా ఉన్నాయి అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ).

హోండా అమేజ్ మరియు హోండా డబ్ల్యుఆర్-వి ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ మోడళ్లను వాటి టాప్-ఎండ్ వేరియంట్లయిన ‘విఎక్స్' మోడళ్లను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. హోండా అమేజ్ మరియు డబ్ల్యుఆర్-వి ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్లను పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందిస్తున్నారు.

ఈ స్పెషల్ ఎడిషన్లలో భాగంగా, హోండా అమేజ్ మరియు హోండా డబ్ల్యుఆర్-వి రెండు మోడళ్లు కూడా కొత్త ప్రీమియం ప్యాకేజీలను మరియు పరికరాలను కలిగి ఉన్నాయి.
MOST READ:భారత మార్కెట్లో డుకాటీ మల్టీస్ట్రాడా 950 ఎస్ బిఎస్ 6 బైక్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

హోండా అమేజ్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌లో, ఈ కాంపాక్ట్-సెడాన్ విండోస్ చుట్టూ క్రోమ్ మోల్డింగ్, ఫాగ్ లాంప్స్ మరియు ట్రంక్‌పై క్రోమ్ గార్నిష్, స్టెప్ ఇల్యూమినేషన్ మరియు ఫ్రంట్ ఫుట్ లైట్, కారు చుట్టూ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ చిహ్నం మరియు ప్రీమియం బ్లాక్ స్వెడ్ సీట్ అప్‌హోలెస్ట్రీ వంటి ఫీచర్లు లభిస్తాయి.
Honda Amaze | MT | CVT |
Exclusive Edition Petrol | ₹7,96,000 | ₹8,79,000 |
Exclusive Edition Diesel | ₹9,26,000 | ₹9,99,000 |

అదేవిధంగా, హోండా డబ్ల్యుఆర్-వి ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌లో ఎస్‌యూవీ చుట్టూ క్రోమ్ గార్నిష్, స్టెప్ ఇల్యూమినేషన్, ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ చిహ్నం మరియు స్వెడ్ సీట్ కవర్లు ఉన్నాయి. అంతే కాకుండా, హోండా డబ్ల్యూఆర్-వి ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ సరికొత్త బాడీ గ్రాఫిక్స్‌తో లభ్యం కానుంది.
MOST READ:హ్యుందాయ్ నుంచి రానున్న బుల్లి ఎలక్ట్రిక్ కార్.. చూసారా ?

Honda WR-V | MT |
Exclusive Edition Petrol | ₹9,69,900 |
Exclusive Edition Diesel | ₹10,99,900 |
ఈనరెండు మోడళ్లలో లభించే ఇంజన్ స్పెక్స్ 1.2-లీటర్ ఐ-విటిఇసి పెట్రోల్ మరియు 1.5-లీటర్ ఐ-డిటిఇసి డీజిల్ రూపంలో లభ్యం కానున్నాయి. పెట్రోల్ ఇంజన్ 89 బిహెచ్‌పి మరియు 110 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, డీజిల్ యూనిట్ 100 బిహెచ్‌పి మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా అమేజ్‌లోని ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ వెర్షన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో దాని పెట్రోల్ మరియు డీజిల్ యూనిట్లతో లభిస్తుంది. అలాగే, హోండా డబ్ల్యూఆర్-వి ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అమర్చిన పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది.
MOST READ:థార్ ఎస్‌యూవీ డెలివరీలు స్టార్ట్ చేసిన మహీంద్రా

పైన పేర్కొన్న కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినహా హోండా అమేజ్ మరియు డబ్ల్యుఆర్-వి ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్లలో ఎలాంటి యాంత్రికపరమైన మార్పులు లేవు. ఈ రెండు మోడళ్లలలో స్టాండర్డ్ విఎక్స్ వేరియంట్‌లో లభించే అన్ని ఫీచర్లు మరియు పరికరాలు లభిస్తాయి.

ఈ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్లను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా, హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వి.పి. మరియు డైరెక్టర్, మార్కెటింగ్ అండ్ సేల్స్ రాజేష్ గోయెల్ మాట్లాడుతూ, "ఈ పండుగ సీజన్లో, మా మోడళ్లను ప్రత్యేకమైన ప్రీమియం ప్యాకేజీతో సుసంపన్నం చేయడం ద్వారా మా విలువైన కస్టమర్లకు మరింత చేరువ కావాలని ప్రయత్నిస్తున్నాం. హోండా అమేజ్ మరియు డబ్ల్యుఆర్-వి యొక్క కొత్త ఎడిషన్లు టాప్-గ్రేడ్ విఎక్స్ ఆధారంగా రూపుదిద్దుకున్నవి మరియు అదనపు ఫీచర్లతో లభ్యం కానున్నవి. మార్కెట్లో కొనసాగుతున్న ఆకర్షణీయమైన పండుగ ప్రమోషన్లు మరియు ఈ కొత్త ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ల ప్రారంభం కారణంగా, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కారు కొనుగోలుదారులకు ఇదొక చక్కటి అవకాశంగా మేము విశ్వసిస్తున్నామని" ఆయన అన్నారు.
MOST READ:భారతదేశపు మొట్టమొదటి సీప్లేన్ సర్వీస్ ప్రారంభించిన నరేంద్ర మోడీ

హోండా అమేజ్, హోండా డబ్ల్యుఆర్-వి ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ మోడళ్ల విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
హోండా అమేజ్ మరియు డబ్ల్యుఆర్-వి వాటి సంబంధిత విభాగాలలో బ్రాండ్ యొక్క ప్రసిద్ధ ఆఫర్లలో ఒకటిగా ఉన్నాయి. ఈ పండుగ సీజన్లో ప్రత్యేకమైన ఎడిషన్ల పరిచయం చేయటం ద్వారా హోండా ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.