హోండా అమేజ్ స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

జపనీస్ కార్ బ్రాండ్, హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ దేశీయ విపణిలో విక్రయిస్తున్న తమ పాపులర్ కాంపాక్ట్ సెడాన్ అమేజ్‌లో కంపెనీ ఓ కొత్త 'స్పెషల్ ఎడిషన్' వేరియంట్‌ను విడుదల చేసింది. మార్కెట్లో కొత్త హోండా అమేజ్ 'స్పెషల్ ఎడిషన్' వేరియంట్ ధర రూ.7 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. స్టాండర్డ్ అమేజ్‌తో పోల్చుకుంటే ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ అమేజ్‌లో కొద్దిపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి.

హోండా అమేజ్ స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త హోండా అమేజ్ ‘స్పెషల్ ఎడిషన్' వేరియంట్‌ను ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మిడ్-స్పెడ్ హోండా అమేజ్ ‘ఎస్' వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. స్టాండర్డ్ ఎస్ వేరియంట్ కన్నా ఈ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌లో అధనపు ఫీచర్లు, పరికరాలు లభిస్తాయి.

హోండా అమేజ్ ‘స్పెషల్ ఎడిషన్' వెర్షన్‌లోని కొన్ని కొత్త ఫీచర్లను గమనిస్తే, ఇందులో ప్రత్యేకమైన స్పెషల్ ఎడిషన్ లోగో, సొగసైన మరియు అద్భుతమైన బాడీ గ్రాఫిక్స్, స్టైలిష్‌గా డిజైన్ చేసిన సీట్ కవర్లు, స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్ మరియు 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

హోండా అమేజ్ స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త స్పెషల్ ఎడిషన్ హోండా అమేజ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. మార్కెట్లో స్పెషల్ ఎడిషన్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.7 లక్షలు కాగా, కొత్త మోడల్ టాప్-ఎండ్ ‘డీజిల్-సివిటి' వేరియంట్ ధర రూ.9.10 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

పైన పేర్కొన్న ప్రత్యేక ఫీచర్లు మినహా స్పెషల్ ఎడిషన్ వేరియంట్ హోండా అమేజ్‌లో వేరే ఏ ఇతర మార్పులు ఉండవు. స్టాండర్డ్ అమేజ్‌లోని ఇంజన్ ఆప్షన్లే ఇందులోనూ ఉంటాయి. ఇవి కూడా అదే విధమైన పవర్, టార్క్ గణాంకాలను ఉత్పత్తి చేస్తాయి.

MOST READ:జరభద్రం గురూ.. కారులో ఇలా చేసారంటే ప్రాణాలే పోవచ్చు.. కావాలంటే ఇది చూడండి

హోండా అమేజ్ స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఇందులోని 1.2-లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 89 బిహెచ్‌పి పవర్‌ను మరియు 110 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌‍బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

ఇకపోతే, ఇందులోని 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ రెండు విభిన్న ట్యూనింగ్‌లలో లభిస్తుంది. ఇందులో మొదటిది 99 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసేది, ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇక రెండవది 79 బిహెచ్‌పి పవర్ మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఇంజన్, ఇది సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్ వేరియంట్లు రెండు ట్యూన్‌లో అందుబాటులో ఉంటాయి.

హోండా అమేజ్ స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఈ విషయంపై హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు డైరెక్టర్, రాజేష్ గోయెల్ మాట్లాడుతూ, "పండుగ సీజన్‌కు ముందే అమేజ్ యొక్క స్పెషల్ ఎడిషన్‌ను అందించడం మాకు చాలా ఆనందంగా ఉంది. హోండా అమేజ్ లైనప్‌లో ఎస్ వేరియంట్ అత్యధికంగా అమ్ముడైన వాటిలో ఒకటి"

"ఎస్ గ్రేడ్ ఆధారంగా తయారు చేసిన ఈ కొత్త స్పెషల్ ఎడిషన్‌లో కొత్త స్మార్ట్ ఫీచర్లను చేర్చడంతో పాటుగా చాలా ఆకర్షణీయమైన ధరతో అందుబాటులో ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్ మా వినియోగదారులకు అందించే మెరుగైన విలువకు మంచి ఆదరణ లభిస్తుందని మేము విశ్వసిస్తున్నాము" అని అన్నారు.

MOST READ:ఫెస్టివల్ సీజన్లో హోండా సూపర్ 6 ఫెస్టివల్ ఆఫర్స్.. చూసారా

హోండా అమేజ్ స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

హోండా అమేజ్ స్పెషల్ ఎడిషన్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హోండా కార్స్ ఇండియా ప్రస్తుత పండుగ సీజన్లో వినియోగదారులను ఆకర్షించేందుకు మరియు ఈ ఫెస్టివల్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు కొత్త అమేజ్ స్పెషల్ ఎడిషన్ వెర్షన్ ప్రవేశపెట్టింది. ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి డిజైర్ మరియు టాటా టిగోర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda Cars India has launched a new 'Special Edition' version of their Amaze compact-sedan in the Indian market. The new Honda Amaze 'Special Edition' is offered with a price tag starting at Rs 7 lakh, ex-showroom (Delhi) and features a number of subtle cosmetic updates over the standard model. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X