హోండా జాజ్ బిఎస్6 బుకింగ్స్ ప్రారంభం; కొత్తగా చేసిన మార్పులు ఇవే..

జపనీస్ కార్ బ్రాండ్ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ నుండి వస్తున్న మరో కొత్త ఉత్పత్తి బిఎస్6 హోండా జాజ్ హ్యాచ్‌బ్యాక్. భారత్‌లో కఠినతరం చేసిన బిఎస్6 నిబంధనల కారణంగా మార్కెట్ నుంచి అదృశ్యమైన హోండా జాజ్ కొత్త బిఎస్6 వెర్షన్‌తో సరికొత్త రూపంలో రాబోతోంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటికే హోండా డీలర్లు కొత్త జాజ్ కోసం బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నారు.

హోండా జాజ్ బిఎస్6 బుకింగ్స్ ప్రారంభం; కొత్తగా చేసిన మార్పులు ఇవే..

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా డీలర్‌షిప్ కేంద్రాలలో రూ.21,000 బుకింగ్ అడ్వాన్స్ చెల్లించి కస్టమర్లు 2020 బిఎస్6 జాజ్ కారును బుక్ చేసుకోవచ్చు. అలా కాకుండా, కస్టమర్లు ఇంటి వద్ద నుంచే హోండా కార్స్ ఇండియా అధీకృత వెబ్‌సైట్‌ను సందర్శించి 'హోండా ఫ్రమ్ హోమ్' ప్లాటఫామ్ ద్వారా రూ.5,000 నామమాత్రపు మొత్తాన్ని చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

హోండా జాజ్ బిఎస్6 బుకింగ్స్ ప్రారంభం; కొత్తగా చేసిన మార్పులు ఇవే..

కొత్త 2020 హోండా జాజ్ బిఎస్‌6 మోడల్‌లో కేవలం ఇంజన్ అప్‌గ్రేడ్స్ మాత్రమే కాకుండా, డిజైన్ పరంగా కొన్ని కాస్మోటిక్ మార్పులు కూడా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. మునపటి తరం హోండా జాజ్ హ్యాచ్‌బ్యాక్‌తో పోల్చుకుంటే కొత్త 2020 హోండా జాజ్ హ్యాచ్‌బ్యాక్ కారులో ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్లలో మార్పులు చేర్పులు ఉన్నాయి.

MOST READ:షారుఖ్ ఖాన్ బిఎండబ్ల్యు స్కోడా ఆక్టేవియా కంటే చీప్ , ఎంతో తెలుసా

హోండా జాజ్ బిఎస్6 బుకింగ్స్ ప్రారంభం; కొత్తగా చేసిన మార్పులు ఇవే..

ఎక్స్‌టీరియర్లలో చేసిన మార్పుల విషయానికి వస్తే, ఇందులో ప్రధానంగా క్రోమ్ యాక్సెంట్స్‌తో గార్నిష్ చేసిన గ్లోసీ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడి డిఆర్‌ఎల్స్‌తో కూడిన హెడ్‌లైట్స్, కొత్త ఫాగ్ లాంప్స్ మరియు రీడిజైన్ చేసిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్, అన్ని వైపులా ఎల్ఈడి లైట్స్, కొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త మార్పులతో రానున్న 2020 హోండా జాజ్ బయటి వైపు నుంచి మరింత షార్ప్ లుక్‌తో కనిపించనుంది.

హోండా జాజ్ బిఎస్6 బుకింగ్స్ ప్రారంభం; కొత్తగా చేసిన మార్పులు ఇవే..

ఇక ఇంటీరియర్స్‌లో చేసిన మార్పుల విషయానికి వస్తే, వన్ టచ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, మాన్యువల్ మరియు సివిటి రెండింటిలోనూ పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. జాజ్ సివిటి మోడల్‌లో సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్‌గా పాడిల్-షిఫ్టర్స్ జోడించారు. మునుపటి ఆర్థిక సంవత్సరంలో హ్యాచ్‌బ్యాక్ సివిటి మోడల్స్ 70 శాతం అమ్మకాలు జరిగాయని కంపెనీ తెలిపింది.

MOST READ:అలర్ట్ : వాహనాలు బయట పార్కింగ్ చేస్తున్నారా.. అయితే ఇది చూడండి

హోండా జాజ్ బిఎస్6 బుకింగ్స్ ప్రారంభం; కొత్తగా చేసిన మార్పులు ఇవే..

కొత్త 2020 జాజ్ బుకింగ్స్ ప్రారంభంపై హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు మార్కెటింగ్ అండ్ సేల్స్ డైరెక్టర్ రాజేష్ గోయెల్ మాట్లాడుతూ, "ఈ నెల చివర్లో ప్రారంభించబోయే కొత్త జాజ్ కోసం బుకింగ్స్ ప్రారంభించడానికి మేము సంతోషిస్తున్నాము. కొత్త జాజ్ దాని స్టైలిష్ స్పోర్టీ లుక్, అత్యుత్తమ ఇంటీరియర్ ప్యాకేజీ మరియు సెగ్మెంట్-యూనిక్ వన్ టచ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లతో ఈ విభాగంలో సంపూర్ణమైన మరియు ఉత్తమమైన హ్యాచ్‌బ్యాక్ కోరుకుంటున్న వినియోగదారులను ఆకర్షిస్తుంది" అని అన్నారు.

హోండా జాజ్ బిఎస్6 బుకింగ్స్ ప్రారంభం; కొత్తగా చేసిన మార్పులు ఇవే..

"పెట్రోల్ ఇంజన్ పట్ల జాజ్ కస్టమర్లు బలమైన ప్రాధాన్యతను ప్రదర్శించడాన్ని మేము గమనించాము. ఈ ధోరణికి ప్రతిస్పందిస్తూ, కొత్త 2020 జాజ్ మాన్యువల్ మరియు సివిటి వేరియంట్లను ప్రత్యేకంగా పెట్రోల్ ఇంజన్‌తోనే అందించాలని నిర్ణయించుకున్నాము. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఈ కొత్త జాజ్ విడుదలతో రానున్న పండుగ సీజన్ మాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంద"ని ఆయన అన్నారు.

MOST READ:ప్రయాణికులు వణికిపోయేలా చేసే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాలు, ఇవే

హోండా జాజ్ బిఎస్6 బుకింగ్స్ ప్రారంభం; కొత్తగా చేసిన మార్పులు ఇవే..

కొత్త 2020 జాజ్‌లో చేయబోయే ఇతర మార్పుల విషయానికి వస్తే, ఇందులో టెంపరేచర్ కంట్రోల్ కోసం భౌతిక బటన్ నియంత్రణ యూనిట్ ఉంటుంది, ఇది పాత మోడల్‌లో కనిపించే టచ్‌ప్యాడ్ వ్యవస్థను రీప్లేస్ చేస్తుంది. ఇంకా ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేసే ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది.

హోండా జాజ్ బిఎస్6 బుకింగ్స్ ప్రారంభం; కొత్తగా చేసిన మార్పులు ఇవే..

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2020 హోండా జాజ్ హ్యాచ్‌బ్యాక్ కారులో బిఎస్4 మోడళ్లలో ఉపయోదించిన అదే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను బిఎస్6 నిబంధనలు అప్‌డేట్ చేసి ఉపయోగించనున్నారు. ఇందులోని బిఎస్4 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 89 బిహెచ్‌పి శక్తిని మరియు 110 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆప్షనల్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది. బిఎస్6 మోడల్‌లో కూడా పవర్, టార్క్ గణాంకాలు ఒకే విధంగా ఉంటాయని అంచనా.

MOST READ:వరద నీటిలో చేపలాగా ఈదుతున్న ఎలక్ట్రిక్ కారు

హోండా జాజ్ బిఎస్6 బుకింగ్స్ ప్రారంభం; కొత్తగా చేసిన మార్పులు ఇవే..

హోండా జాజ్ బిఎస్6 బుకింగ్స్ ప్రారంభంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త హోండా జాజ్ వాస్తవానికి గత నెలలోనే మార్కెట్లోకి విడుదల కావల్సి ఉండగా, కోవిడ్-19 కారణంగా ఆలస్యమైంది. కొత్తగా రానున్న 2020 జాజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఈ విభాగంలో హ్యుందాయ్ ఎలైట్ ఐ20, ఫోక్స‌వ్యాగన్ పోలో, మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా మరియు టాటా ఆల్ట్రోజ్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ప్రస్తుతానికి ఇది కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యం కానుంది.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda Cars India Limited (HCIL), announced the commencement of pre-bookings for the upcoming BS6 Jazz in the Indian market. The premium hatchback is expected to arrive sometime in the coming weeks. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X