హోండా నుండి సిఆర్-వి స్పెషల్ ఎడిషన్ మోడల్; కేవలం 45 కార్లు మాత్రమే!

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'సిఆర్-వి'లో కంపెనీ ఓ కొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న దాని కంటే భిన్నంగా ఉండనుంది మరియు దీని లభ్యతను కేవలం 45 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయనున్నట్లు సమాచారం.

హోండా నుండి సిఆర్-వి స్పెషల్ ఎడిషన్ మోడల్; కేవలం 45 కార్లు మాత్రమే!

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భారత మార్కెట్లో విడుదల కానున్న ఈ లిమిటెడ్ ఎడిషన్ హోండా సిఆర్-వి మోడల్, కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న మోడల్ మాదిరిగా ఉంటుందని సమాచారం. హోండా ఇప్పటికే అంతర్జాతీ మార్కెట్లలో తమ సరికొత్త సిఆర్-వి ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది.

హోండా నుండి సిఆర్-వి స్పెషల్ ఎడిషన్ మోడల్; కేవలం 45 కార్లు మాత్రమే!

ఈ నేపథ్యంలో, భారత్‌లో విడుదలయ్యే కొత్త లిమిటెడ్ ఎడిషన్ హోండా సిఆర్-వి కూడా ఇంటర్నేషనల్ మోడల్ డిజైన్, ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఫలితంగా, మార్కెట్లో దీని ధర కూడా ప్రస్తుత హోండా సిఆర్-వి కన్నా అధికంగా ఉండనున్నట్లు సమాచారం.

MOST READ:కొత్త రైడింగ్ జాకెట్స్ లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్, వీటి రేటెంతో తెలుసా ?

హోండా నుండి సిఆర్-వి స్పెషల్ ఎడిషన్ మోడల్; కేవలం 45 కార్లు మాత్రమే!

కొత్త లిమిటెడ్ ఎడిషన్ హోండా సిఆర్-వి ధర ప్రారంభ ధర రూ.29.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండొచ్చని అంచనా. ఇది ప్రస్తుత హోండా సిఆర్-వి కంటే రూ.1.23 లక్షలు అధికం. కొత్త లిమిటెడ్ ఎడిషన్ హోండా సిఆర్-వి కూడా కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే, అది కూడా 45 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

హోండా నుండి సిఆర్-వి స్పెషల్ ఎడిషన్ మోడల్; కేవలం 45 కార్లు మాత్రమే!

హోండా గడచిన సంవత్సరంలోనే అంతర్జాతీయ మార్కెట్లలో ఫేస్‌లిఫ్టెడ్ సిఆర్-వి ఎస్‌యూవీని విడుదల చేసింది. మునుపటి తరం మోడల్‌తో పోల్చుకుంటే, ఇందులో అనేక కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఈ కొత్త ఎస్‌యూవీలో ఇప్పుడు మరింత అగ్రెసివ్‌గా కనిపించే ఫ్రంట్ బంపర్, రీడిజైన్ చేయబడిన రియర్ బంపర్, ముందు వైపున తక్కువ మొత్తంలో క్రోమ్ గార్నిష్, రివైజ్డ్ హెడ్‌ల్యాంప్స్‌ వంటి అంశాలు ఉన్నాయి.

MOST READ:ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టిస్తున్న యమహా ఎమ్‌టి-09 బైక్ టీజర్ వీడియో

హోండా నుండి సిఆర్-వి స్పెషల్ ఎడిషన్ మోడల్; కేవలం 45 కార్లు మాత్రమే!

క్యాబిన్ లోపల ఇంటీరియర్స్‌లో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. అయితే, యాంత్రికంగా మాత్రం కంపెనీ ఈ ఎస్‌యూవీలో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుత మోడల్‌లో ఉపయోగిస్తున్న 2.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్‌నే కొత్త కారులోనూ ఉపయోగించనున్నారు.

హోండా నుండి సిఆర్-వి స్పెషల్ ఎడిషన్ మోడల్; కేవలం 45 కార్లు మాత్రమే!

ఈ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 154 హెచ్‌పి పవర్‌ను మరియు 189 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు. ప్రస్తుత సిఆర్-వి ఫ్రంట్-వీల్-డ్రైవ్ మరియు ఆల్-వీల్-డ్రైవ్ కాన్ఫిగరేషన్లలో డీజిల్ ఇంజన్ లభించేంది. అయితే, బిఎస్6 నిబంధనలు కఠినతరం కావడంతో కంపెనీ ఈ వేరియంట్లు తమ ప్రోడక్ట్ లైనప్ నుండి తొలగించింది.

MOST READ:యుబిసిఓ టూవీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ బైక్స్ - డీటేల్స్

హోండా నుండి సిఆర్-వి స్పెషల్ ఎడిషన్ మోడల్; కేవలం 45 కార్లు మాత్రమే!

కాగా, హోండా నుండి రానున్న ఈ లిమిటెడ్ ఎడిషన్ సిఆర్-వి మోడల్‌లో అదనపు పరికరాలు, ఫీచర్లు లభ్యం కానున్నాయి. ఇందులో హ్యాండ్స్ ఫ్రీ టెయిల్‌గేట్, పవర్డ్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్, యాక్టివ్ కార్నరింగ్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు మరియు ఆటో ఫోల్డ్ వింగ్ మిర్రర్స్ వంటి ఫీచర్లు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

హోండా నుండి సిఆర్-వి స్పెషల్ ఎడిషన్ మోడల్; కేవలం 45 కార్లు మాత్రమే!

అంతేకాకుండా, ఇందులో రన్నింగ్ బోర్డులు మరియు ప్రకాశించే డోర్ సిల్స్ వంటి కాస్మెటిక్ యాక్ససరీస్ కూడా ఉండొచ్చని సమాచారం.

హోండా సిఆర్-వి స్పెషల్ ఎడిషన్ కూడా పరిమిత సంఖ్యలో లభిస్తుందని భావిస్తున్నారు, మా మూలాలు ఈ సంఖ్యను 45 యూనిట్ల చుట్టూ ఉంచుతాయి.

MOST READ:హ్యుందాయ్ ట్యుసాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ ; ఫీచర్స్ & ఇతర వివరాలు

హోండా నుండి సిఆర్-వి స్పెషల్ ఎడిషన్ మోడల్; కేవలం 45 కార్లు మాత్రమే!

హోండా బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తాజాగా తమ "అమేజ్" కాంపాక్ట్ సెడాన్‌లో ఓ కొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో కొత్త హోండా అమేజ్ 'స్పెషల్ ఎడిషన్' వేరియంట్ ధర రూ.7 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. స్టాండర్డ్ అమేజ్‌తో పోల్చుకుంటే ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ అమేజ్‌లో కొద్దిపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి.

హోండా నుండి సిఆర్-వి స్పెషల్ ఎడిషన్ మోడల్; కేవలం 45 కార్లు మాత్రమే!

కొత్త హోండా అమేజ్ ‘స్పెషల్ ఎడిషన్' వేరియంట్‌ను ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మిడ్-స్పెడ్ హోండా అమేజ్ ‘ఎస్' వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. స్టాండర్డ్ ఎస్ వేరియంట్ కన్నా ఈ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌లో అధనపు ఫీచర్లు, పరికరాలు లభిస్తాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

హోండా నుండి సిఆర్-వి స్పెషల్ ఎడిషన్ మోడల్; కేవలం 45 కార్లు మాత్రమే!

హోండా సిఆర్-వి స్పెషల్ ఎడిషన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హోండా నుండి లభిస్తున్న ఫ్లాగ్‌షిప్ మోడల్ సిఆర్-వి అంతర్జాతీయంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీలలో ఒకటి. పైన పేర్కొన్నట్లుగా, ఒకవేళ భారత్‌లో విడుదల కాబోయే లిమిటెడ్ ఎడిషన్ హోండా సిఆర్-విని ఇంటర్నేషనల్ మోడల్ ఆధారంగా డిజైన్ చేసినట్లయితే, మార్కెట్లో దీనికి మంచి గిరాకీ ఏర్పడే అవకాశం ఉంది.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda Cars India Limited is planning to launch CR-V Special Edition in the market very soon. Read in Telugu to find more information. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X