త్వరలో విడుదల కానున్న హోండా జాజ్ బిఎస్6 - ఫీచర్లు, వివరాలు

జపనీస్ కార్ బ్రాండ్ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ దేశీయ విపణిలో విక్రయించిన జాజ్ హ్యాచ్‌బ్యాక్, బిఎస్6 నిబంధనల కారణంగా మార్కెట్ నుంచి అదృశ్యమైన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, బిఎస్6 నిబంధనలకు లోబడి అప్‌గ్రేడ్ చేయబడిన సరికొత్త 2020 హోండా జాజ్ మోడల్‌ను కంపెనీ త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. జూలై నెలాఖరులోగా ఈ కారు మార్కెట్లో విడుదలవుతుందని అంచనా.

త్వరలో విడుదల కానున్న హోండా జాజ్ బిఎస్6 - ఫీచర్లు, వివరాలు

కొత్త 2020 హోండా జాజ్ బిఎస్‌6 మోడల్‌లో ఇంజన్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా కొన్ని కాస్మోటిక్ మార్పులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడి డిఆర్‌ఎల్స్‌తో కూడిన హెడ్‌లైట్లతో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, కొత్త ఫాగ్ లాంప్స్ మరియు రీడిజైన్ చేసిన బంపర్, అన్ని వైపులా ఎల్ఈడి లైట్స్ వంటి ఫాచర్లు ఉండనున్నాయి. ఈ కొత్త మార్పులతో హోండా జాజ్ మరింత షార్ప్ లుక్‌తో కనిపించే అవకాశం ఉంది.

త్వరలో విడుదల కానున్న హోండా జాజ్ బిఎస్6 - ఫీచర్లు, వివరాలు

ఈ మార్పులు మినహా మిగిలిన ఓవరాల్ జాజ్ హ్యాచ్‌బ్యాక్ లుక్ ఇదివరకటి మాదిరిగానే ఉండనుంది. వెనుక వైపు కూడా ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, రీడిజైన్ చేసిన రియర్ బంపర్ మార్పులను మనం ఇందులో గమనించవచ్చు.

MOST READ: దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్రపతి అంబులెన్స్

త్వరలో విడుదల కానున్న హోండా జాజ్ బిఎస్6 - ఫీచర్లు, వివరాలు

కొత్త హోండా జాజ్ ఇంటీరియర్స్ గురించి హోండా ఎటువంటి సమాచారం వెల్లడించలేదు, కానీ ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు అనేక ఇతర కనెక్టివిటీ ఫీచర్లతో వస్తుందని అంచనా.

త్వరలో విడుదల కానున్న హోండా జాజ్ బిఎస్6 - ఫీచర్లు, వివరాలు

ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో బిఎస్6 కంప్లైంట్ 1.2-లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పి శక్తిని మరియు 110 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజన్‌ను హోండా అమేజ్ సిరీస్ కార్లలో కూడా ఉపయోగిస్తున్నారు. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో పాటుగా ఆప్షనల్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా అందుబాటులో ఉండనుంది.

MOST READ: చైనా నుండి దిగుమతి చేసుకున్న విడిభాగాల మాన్యువల్ తనిఖీ వలన ఉత్పత్తిలో జాప్యం: సియాం

త్వరలో విడుదల కానున్న హోండా జాజ్ బిఎస్6 - ఫీచర్లు, వివరాలు

హోండా జాజ్ డీజిల్ ఇంజన్‌తో కూడా వచ్చే అవకాశం ఉంది. ఇందులోని బిఎస్6 కంప్లైంట్ 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉండనుంది.

త్వరలో విడుదల కానున్న హోండా జాజ్ బిఎస్6 - ఫీచర్లు, వివరాలు

ఇప్పటి వరకూ మార్కెట్లో లభ్యమైన కరెంట్ వెర్షన్ హోండా జాజ్ మోడళ్ల ధర రూ .7.45 లక్షల నుంచి రూ .9.40 లక్షల మధ్యలో ఉండేవి. కొత్త మోడల్‌లో చేర్చిన మార్పులు చేర్పులు కారణంగా దీని ధరలు కాస్తం ప్రీమియంగా ఉండే అవకాశం ఉంది.

MOST READ: విధి నిర్వహణలో ఉన్న పోలీసును తన్నిన మాజీ MP, ఎవరో తెలుసా ?

త్వరలో విడుదల కానున్న హోండా జాజ్ బిఎస్6 - ఫీచర్లు, వివరాలు

హోండా సంబంధిత ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ ఇప్పటికే తమ ఐదవ తరం హోండా సిటీ సెడాన్‌ను భారత మార్కెట్లో విడుదల చేయటానికి ముందే డీలర్‌షిప్ కేంద్రాలకు పంపిణీ చేస్తోంది. ఈ కొత్త మోడల్ మోడల్ సరికొత్త డిజైన్‌ను కలిగి ఉంది మరియు అనేక ఫీచర్లతో వస్తుంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

త్వరలో విడుదల కానున్న హోండా జాజ్ బిఎస్6 - ఫీచర్లు, వివరాలు

హోండా జాజ్ బిఎస్6 విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త మోడళ్లు విడుదల కావటం పరిశ్రమకు నిజంగా మంచి వార్తనే చెప్పాలి. ఈ పరిణామాలు మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌ను, పరిశ్రమ వృద్ధిని సూచిస్తున్నాయి. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో రానున్న కొత్త హోండా జాజ్ బిఎస్6 వినియోగదారులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని మేము ఆశిస్తున్నాము.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Japanese auto manufacturer, Honda, has announced that it is close to launch the all new Honda Jazz soon. Industry expectations are that the car will be launched before the end of July. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X