బ్రేకింగ్ న్యూస్: భారత్‌లో కొత్త హోండా డబ్ల్యూఆర్-వి విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ భారత మార్కెట్లో తమ సరికొత్త 2020 'హోండా డబ్ల్యూఆర్-వి' ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌లో అప్‌డేట్ చేయబడిన బిఎస్6 ఇంజన్ ఆప్షన్లతో పాటుగా కొత్త ఎక్స్టీరియర్ స్టైలింగ్, ఇంటీరియర్ అప్‌గ్రేడ్స్ కూడా ఉన్నాయి.

బ్రేకింగ్ న్యూస్: భారత్‌లో కొత్త హోండా డబ్ల్యూఆర్-వి విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ కారును మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గకు నకానిషి మాట్లాడుతూ, "హోండా డబ్ల్యుఆర్-వి, ప్రీమియం స్పోర్టీ లైఫ్ స్టైల్ వెహికల్, ఇది బ్రాండ్ యొక్క గ్లోబల్ డిఎన్ఎను కలిగి ఉంటుంది మరియు భారతదేశంలో దాదాపు 1 లక్షల మందికి పైగా వినియోగదారులు ఈ మోడల్‌ను అంగీకరించారు" అని అన్నారు.

బ్రేకింగ్ న్యూస్: భారత్‌లో కొత్త హోండా డబ్ల్యూఆర్-వి విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

"మా కస్టమర్లను ఆకర్షించే ఉత్పత్తులను సృష్టించే దిశగా మేము నిరంతరం కృషి చేస్తాము ఇందులో భాగంగానే సరికొత్త ఫీచర్లతో కూడిన కొత్త డబ్ల్యుఆర్-విను మార్కెట్లో ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉంది. పునరుద్ధరించిన డబ్ల్యుఆర్-వి లైనప్ మా కస్టమర్లచే ప్రశంసించబడుతుందని మేము విశ్వసిస్తున్నాము " అని చెప్పారు.

MOST READ: త్వరలో విడుదల కానున్న హోండా జాజ్ బిఎస్6 - ఫీచర్లు, వివరాలు

బ్రేకింగ్ న్యూస్: భారత్‌లో కొత్త హోండా డబ్ల్యూఆర్-వి విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త హోండా డబ్ల్యుఆర్-విలో కొత్త సాలిడ్ వింగ్ క్రోమ్ లౌవర్ స్టైల్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లు మరియు పొజిషన్ లాంప్స్‌తో కూడిన అధునాతన ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, అడ్వాన్స్‌డ్ ఎల్‌ఇడి ఫాగ్ లాంప్స్ మరియు అడ్వాన్స్‌డ్ ఎల్‌ఇడి రియర్ కాంబినేషన్ లాంప్స్ ఉన్నాయి.

బ్రేకింగ్ న్యూస్: భారత్‌లో కొత్త హోండా డబ్ల్యూఆర్-వి విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ కొత్త హోండా డబ్ల్యుఆర్-వి విశాలమైన మరియు సౌకర్యవంతమైన క్యాబిన్‌ను ఆఫర్ చేస్తుంది. ఇందులో ప్రత్యేకంగా రూపొందించిన ప్రీమియం సీటింగ్ అప్‌హోలెస్ట్రీని ఎంబాస్ మరియు మెష్ డిజైన్‌తో తయారు చేశారు. క్యాబిన్ లోపల ప్రీమియం అనుభూతిని పెంచేలా క్రోమ్ గార్నిష్ కనిపిస్తుంది.

MOST READ: ఒక్కసారిగా 1000 కి పైగా ఫోర్స్ అంబులెన్సులు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

బ్రేకింగ్ న్యూస్: భారత్‌లో కొత్త హోండా డబ్ల్యూఆర్-వి విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

హోండా అందిస్తున్న స్మార్ట్ కనెక్టివిటీ టెక్నాలజీతో తయారు చేసిన అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ డిజిపాడ్ 2.0ను ఈ మోడళ్లలో ఆఫర్ చేస్తున్నారు. ఈ 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లను కూడా సపోర్ట్ చేస్తుంది. చికాకులు లేని స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని అందిస్తుంది మరియు అంతర్నిర్మిత ఉపగ్రహ-లింక్డ్ టర్న్-బై-టర్న్ నావిగేషన్, లైవ్ ట్రాఫిక్ సపోర్ట్, వాయిస్ కమాండ్స్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు వైర్‌లెస్ ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ ఫీచర్లను కూడా సపోర్ట్ చేస్తుంది.

బ్రేకింగ్ న్యూస్: భారత్‌లో కొత్త హోండా డబ్ల్యూఆర్-వి విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇంకా ఇందులో వన్-టచ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, ఎకో అసిస్ట్ యాంబియంట్ రింగ్స్‌తో కూడిన మల్టీ ఇన్ఫర్మేషన్ కాంబిమీటర్, మౌంటెడ్ ఆడియో, వాయిస్, హ్యాండ్స్‌ఫ్రీ మరియు క్రూయిజ్ కంట్రోల్ స్విచ్‌లతో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ: దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్రపతి అంబులెన్స్

బ్రేకింగ్ న్యూస్: భారత్‌లో కొత్త హోండా డబ్ల్యూఆర్-వి విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ మోడళ్లలో సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్ ఫంక్షన్, హోండా యొక్క స్మార్ట్ కీ సిస్టమ్ మరియు కీలెస్ రిమోట్ కూడా ఉన్నాయి. కొత్త డబ్ల్యుఆర్-విలో స్టోరేజ్ స్పేసెస్ పుష్కలంగా ఉన్నాయి మరియు విశాలమైన కార్గో ఏరియాను కలిగి ఉంది. ఇందులో 12-వోల్ట్ పవర్ అవుట్‌లెట్, యుఎస్‌బి ఛార్జింగ్ పోర్టు సదుపాయాలు కూడా ఉన్నాయి.

బ్రేకింగ్ న్యూస్: భారత్‌లో కొత్త హోండా డబ్ల్యూఆర్-వి విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇంజన్స్ విషయానికి వస్తే, హోండా డబ్ల్యుఆర్-వి పెట్రోల్ మోడళ్లలో బిఎస్6 కంప్లైంట్ 1.2-లీటర్ ఐ-విటిఇసి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 90 బిహెచ్‌పి శక్తిని మరియు 110 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. టెస్ట్ డేటా ప్రకారం పెట్రోల్ వెర్షన్ లీటరుకు 16.5 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ తెలిపింది.

MOST READ: కరోనా నివారణలో భాగంగా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన మహీంద్రా

బ్రేకింగ్ న్యూస్: భారత్‌లో కొత్త హోండా డబ్ల్యూఆర్-వి విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

హోండా డబ్ల్యుఆర్-వి డీజిల్ మోడళ్లలో బిఎస్6 కంప్లైంట్ 1.5-లీటర్ ఐ-డిటిఇసి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 100 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. హోండా పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 23.7 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

బ్రేకింగ్ న్యూస్: భారత్‌లో కొత్త హోండా డబ్ల్యూఆర్-వి విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

హోండా డబ్ల్యుఆర్-వి ఎస్‌యూవీలోని భద్రతా ఫీచర్లను గమనిస్తే, ఇందులో డ్యూయెల్ ఎస్ఆర్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, గైడ్‌లైన్స్‌తో కూడిన మల్టీ యాంగిల్ రియర్ వ్యూ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, వెనుక విండ్‌షీల్డ్ డీఫాగ్గర్, ఈసియూ ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ భద్రతా ఫీచర్లలో కొత్తగా ప్రమాద తీవ్రతను తగ్గించే ఫ్రంట్ హెడ్ రెస్ట్స్ మరియు పాదచారుల గాయాలను తగ్గించే సాంకేతికత కూడా ఉంది. ఇవన్నీ కూడా కొత్త డబ్ల్యుఆర్-విలో ప్రామాణికంగా అందించబడతాయి.

MOST READ: చైనా నుండి దిగుమతి చేసుకున్న విడిభాగాల మాన్యువల్ తనిఖీ వలన ఉత్పత్తిలో జాప్యం: సియాం

బ్రేకింగ్ న్యూస్: భారత్‌లో కొత్త హోండా డబ్ల్యూఆర్-వి విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త హోండా డబ్ల్యుఆర్-వి రెండు ఫీచర్ ప్యాక్ వేరియంట్లలో లభిస్తుంది - అందులో ఒకటి ఎస్‌వి, మరియు విఎక్స్. ఇవి రెండూ పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభిస్తాయి.

ప్రీమియం అంబర్ మెటాలిక్, లూనార్ సిల్వర్ మెటాలిక్, మోడరన్ స్టీల్ మెటాలిక్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, రేడియంట్ రెడ్ మెటాలిక్ మరియు ప్లాటినం వైట్ పెర్ల్ అనే ఆరు కలర్ ఆప్షన్లలో హోండా డబ్ల్యూఆర్-వి అందుబాటులో ఉంటుంది.

బ్రేకింగ్ న్యూస్: భారత్‌లో కొత్త హోండా డబ్ల్యూఆర్-వి విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

హోండా తమ కొత్త డబ్ల్యుఆర్-వి మోడల్‌పై మూడేళ్లు లేదా అపరిమిత కిలోమీటర్ల స్టాండర్డ్ వారంటీని ఆఫర్ చేస్తుంది. అనదపు వారంటీని కావాలనుకునే కస్టమర్లు ఆప్షనల్‌గా మరో రెండేళ్ల పాటు పరిమిత లేదా అపరిమిత కిలోమీటర్ల ఆప్షన్లను ఎంచుకోవచ్చు. భారత మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.8,49,900, ఎక్స్‌-షోరూమ్‌గా ఉంది.

బ్రేకింగ్ న్యూస్: భారత్‌లో కొత్త హోండా డబ్ల్యూఆర్-వి విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త 2020 హోండా డబ్ల్యూఆర్-వి బిఎస్6 విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మునపటి మోడళ్లతో పోల్చుకుండే హోండా తమ కొత్త 2020 డబ్ల్యుఆర్-వి మోడల్‌ను ఫీచర్ ప్యాక్డ్ మోడల్‌గా మార్చింది. అంతేకాకుండా, ఈ సెగ్మెంట్లో అత్యంత పోటీతత్వ ధరతో (కేవలం రూ.8.50 లక్షల ప్రారంభ ధరతో) ఈ మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ మోడల్ ఖచ్చితంగా హోండాకు మంచి అమ్మకాలను తెచ్చిపెట్టగలదని మేము విశ్వసిస్తున్నాము.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda Cars India Limited has launched the New Honda WR-V in India starting at Rs 8,49,900, ex-showroom. The new models feature updated exterior styling, rich interiors and BS6 compliant petrol and diesel engines. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X