Just In
- 5 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 6 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 6 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 8 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
10 సంవత్సరాల తర్వాత మళ్ళీ విఫణిలోకి హమ్మర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
హమ్మర్ అత్యంత ప్రసిద్ధి చెందిన బ్రాండ్ లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా దీనికి మంచి డిమాండ్ ఉంది. కానీ కఠినమైన ఉద్గార నిబంధనల కారణంగా, కొన్ని ఇంధన వినియోగ లోపం వల్ల దీని ఉత్పత్తిని 2010 లో నిలిపివేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు వినియోగదారులకు ఒక శుభవార్త ఏమిటంటే హమ్మర్ మల్లీ మార్కెట్లోకి రానుంది.

హమ్మర్ ని కొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెట్టే దిశలో దీనికి కొన్ని నవీనీకరణలు జరగనున్నాయి. ఇప్పుడు రాబోతున్న హమ్మర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఇది ఒక్క ఎలక్ట్రిక్ వాహనం మాత్రమే కాదు అత్యంత శక్తివంతమైన వాహనం కూడా.

కొత్త ఎలక్ట్రిక్ హమ్మర్ 1000 గుర్రాల శక్తిని కలిగి ఉంటుంది. అంటే కాకుండా 15,000 ఎన్ఎమ్ టార్క్ ని దాని చక్రాలకు అందించగలదని జిఎం పేర్కొంది. ఇది అమెరికా ప్రమాణాల పరంగా చూసినట్లయితే ఇది 15,574 ఎన్ఎమ్ టార్క్ లేదా 11,500 పౌండ్ల టార్క్ ని ఉత్పత్తి చేస్తుందని తెలుస్తుంది.

దీని ఆన్-రోడ్ పనితీరు కూడా ఇతర వాహనాలకంటే మెరుగైనదిగా ఉంటుంది. ఇది 3 సెకన్ల కాలంలో 0-100 కిలోమీటర్ల పరిధిని చేరుకోగలదు.

2009 లో కొన్ని పరిస్థితుల వల్ల తక్కువ అమ్మకాలను చేపట్టడమే కాకుండా, 2010 కల్లా హమ్మర్ యొక్క ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు 10 సంవత్సరాల తరువాత జిఎం ఇప్పుడు ఆల్-ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ లైనప్‌తో బ్రాండ్‌ను తిరిగి ప్రారంభిస్తోంది. అయితే ఇప్పుడు సాంప్రదాయిక ఐసి ఇంజిన్‌లతో నడిచే హమ్మర్లను తీసుకురావడం లేదని జిఎం ధృవీకరించింది. రాబోయే కాలానికి అనుగుణంగా దీనిని ఎలక్ట్రిక్ వాహనంగా తయారు చేస్తోంది.
ఎలక్ట్రిక్ హమ్మర్ కి సంబంధించిన ఒక వీడియో మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ వీడియో ప్రకారం రానున్న హమ్మర్ ఎలక్ట్రిక్ వాహనమే అని స్పష్టమవుతోంది. అంతే కాకుండా చాల కాలంగా పతనంతో ఉన్న ఈ వాహనాలు 2021 కి మార్కెట్లోకి రానున్నాయి.

ఈ ఎలక్ట్రిక్ హమ్మర్ గురించి మనకు అన్ని వివరాలు ఇంకా తెలియరాలేదు. కానీ ధర మరియు ఇతర వివరాలు ఉత్పత్తి యొక్క అధికారిక ప్రవేశానికి దగ్గరగా ఉంటాయి. మార్కెట్లో మళ్ళీ హమ్మర్ వాహనాలు తమ గత వైభవాన్ని పొందుతాయని అని మాత్రం ఆశించవచ్చు.