హైదరాబాద్ లో రెండు స్పోర్ట్స్ కార్లను సీజ్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా

భారతదేశంలో కార్ రేసింగ్లు, బైక్ రేసింగ్లు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. వాహనదారుల యొక్క అమితమైన ఉత్సాహం వల్ల ఈ రేసింగ్లు జరుగుతున్నాయి. ఇటువంటి రేసింగ్లు చాలా ప్రమాదమైనవి. ఇటువంటి రేసింగ్ లు జరపకుండా ఉండటానికి ప్రభుత్వాలు కఠిన చర్యలను కూడా చేపడుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఎక్కడో ఒకదగ్గర పోలీసుల కళ్ళు కప్పి ఇటువంటి రేసింగ్లు జరుగుతూనే ఉంటాయి. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

హైదరాబాద్ లో రెండు స్పోర్ట్స్ కార్లను సీజ్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా

చాలా మంది సూపర్ కార్లు మరియు సూపర్ బైక్ వినియోగదారులు అప్పుడపుడు పబ్లిక్ రోడ్లపై అధికవేగంతో ప్రయాణిస్తూ ఉంటారు. సాధారణంగా రోడ్డు నియమాల ప్రకారం వేగపరిమితులను అమలు చేసినప్పటికీ చాలా మంది వాహనదారులు వీటిని పాటించడంలేదు. సూపర్ వెహికల్స్ ని కలిగిన కొంతమంది ఉత్సాహంతో జాతీయరహదారులపై అధిక వేగంతో ప్రయాణిస్తుంటారు.

హైదరాబాద్ లో రెండు స్పోర్ట్స్ కార్లను సీజ్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా

తెల్లవారు జామున రోడ్లపై చాలా వరకు ఖాళీగా ఉంటుంది. ఈ సమయంలో పోలీసులకు పట్టుబడకుండా అధిక వేగంతో ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటారు.

హైదరాబాద్ లో రెండు స్పోర్ట్స్ కార్లను సీజ్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా

హైదరాబాద్‌లోని పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేలో రెండు సూపర్ కార్లు తెల్లవారు జామున అధికవేగంతో వెళ్లడంతో నగర పోలీసులు గుర్తించి వీటిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలలో ఒకటి లంబోర్ఘిని హురాకాన్ మరియు ఆడి ఆర్ 8 ఉన్నాయి.

హైదరాబాద్ లో రెండు స్పోర్ట్స్ కార్లను సీజ్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా

పోలీసుల నివేదికల ప్రకారం లంబోర్ఘిని డ్రైవర్ ప్రతీక్, ఆడి నడుపుతున్న చేతన్ శంషాబాద్ నుండి మెహదీపట్నం వెళ్తున్నారు. వీరిద్దరూ పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రయాణిస్తున్నారు. ఆ రహదారి చాలా ఖాళీగా ఉంది. ఈ ఇద్దరు వ్యక్తులు తమ వాహనాలన పనితీరుని మరియు వేగాన్ని పరీక్షించుకోవడానికి అధికమైన వేగంతో ప్రయాణించడం జరిగింది.

హైదరాబాద్ లో రెండు స్పోర్ట్స్ కార్లను సీజ్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా

ఈ రెండు వాహనాల గురించి ఒకే రహదారిపై వాహనదారుల నుండి అనేక కంప్లైంట్స్ కూడా వచ్చాయని పోలీసులు తెలియజేసారు. ఈ రెండు వాహనాలు కూడా రోడ్లపై చాలా వేగంతో నడుపుతున్నారని కూడా పిర్యాదులు వచ్చాయని అధికారులు తెలియజేసారు.

హైదరాబాద్ లో రెండు స్పోర్ట్స్ కార్లను సీజ్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా

వాహనదారుల కంప్లైంట్స్ తీసుకున్న పోలీసులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీటిని పట్టుకోవడానికి వాహనాదారులు వెంబడించి చివరికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సహాయంతో పట్టుకోవడం జరిగింది. ఈ రెండు వాహనాలు సరోజిని దేవి ఐ హాస్పిటల్ పరిధిలో ఉన్నట్లు గుర్తించి, పోలీసులు మొదట వాహనాల యొక్క పత్రాలను అడిగారు. ఈ సూపర్ కార్ల యజమానులకు ఎటువంటి సరైన వాహన పత్రాలు లేకపోవడమే కాకుండా అధిక వేగంతో ప్రయాణించడం వల్ల ఆ సూపర్ కార్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ వాహనాలు వెళ్లిన రోడ్ లో ఎటువంటి కెమెరాలు లేకపోవడం వల్ల ఎంత వేగంతో వెళ్లారు అనేది స్పష్టంగా తెలియదు.

హైదరాబాద్ లో రెండు స్పోర్ట్స్ కార్లను సీజ్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా

రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ జి. సురేష్ అందించిన నివేదిక ప్రకారం వీరిద్దరూ రహదారులపై అధిక వేగంతో ప్రయాణించారని, వారికి ఎటువంటి వాహన పత్రాలు లేదని దీని కారణంగా ఈ సూపర్ కార్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదేవిధంగా ఈ ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చేశామని, కానీ వారిపై విధించిన జరిమానాలు గురించి ఖచ్చితమైన వివరాలు లేవని చెప్పారు.

హైదరాబాద్ లో రెండు స్పోర్ట్స్ కార్లను సీజ్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా

సాధారణంగా రహదారులన్నీ ఎల్లప్పుడూ రద్దీగా ఉంటాయి. కాబట్టి వాహనదారులందరు ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలను, వేగ పరిమితులను కచ్చితంగా పాటించాలి. రహదారులపై వేగవంతమైన ప్రయాణం చాలా ప్రమాదంగా ఉంటుంది కావున వాహనదారులందరు పరిమితవేగంతోనే ప్రయాణించాలి. అప్పుడే కొంతవరకు ప్రమాదాలను అరికట్టవచ్చు.

హైదరాబాద్ లో రెండు స్పోర్ట్స్ కార్లను సీజ్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారతదేశంలో రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు వేల సంఖ్యలో పెరిగిపోతూనే ఉన్నాయి. అధిక వేగంతో ప్రయాణించడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వంటి నిర్లక్ష్య కార్యకలాపాల వల్ల ఈ ప్రమాదాల జరుగుతున్నాయి. కొంత మంది వాహనదారులు అధిక రద్దీలో కూడా అమితమైన ఉత్సాహాన్ని చూపించడానికి అధిక వేగంతో ప్రయాణించడం మనం చూస్తూనే ఉన్నాము. ప్రభుత్వాలు కూడా కఠినమైన రోడ్డు నిబంధనలను ప్రవేశపెడుతూ

Most Read Articles

English summary
Lamborghini Huracan and Audi R8 supercars SEIZED for street racing. Read in Telugu.
Story first published: Monday, February 3, 2020, 18:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X