దోషపూరిత నెంబర్ ప్లేట్ తో ప్రయాణించిన వ్యక్తికి హైదరాబాద్ లో ఎం జరిగిందంటే..?

భారతదేశంలో వాహనదారులందరూ కొన్ని కచ్చితమైన నిబంధనలను పాటించాలని ప్రభుత్వాలు ఆదేశిస్తాయి. కానీ కొంతమంది వాటిని లెక్కచేయకుండా రహదారులలో తిరగటం మనం సాధారణంగా చూస్తూనే ఉంటాము. డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ లేకపోవడం ,డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, మద్యం తాగి వాహనాలు డ్రైవ్ చేయడం వంటివి రోజు చూస్తూనే ఉంటాము. ఇదే విధంగా హైదరాబాద్ లో ఒక వ్యక్తి తన వాహనానికి సరైన నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్డుపై ప్రయాణించించాడు, తరువాత ఎం జరిగింతో చూద్దాం.. రండి.

దోషపూరిత నెంబర్ ప్లేట్ తో ప్రయాణించిన వ్యక్తికి హైదరాబాద్ లో ఎం జరిగిందంటే..?

భారతదేశంలో చాల మంది వాహనదారులు సరైన నెంబర్ ప్లేట్ లు లేకుండా అక్రమంగా ఉన్న నెంబర్ ప్లేట్స్ ని ఎక్కువగా కలిగి ఉన్నారు. సాధారంగా వాహనదారులందరు తమ వాహనాలకు సరైన నెంబర్ ప్లేట్ ని కలిగి ఉండాలి. చాలా మంది తమ నెంబర్ ప్లేట్ లను వివిధ ఆకృతులలో డిజైనర్ నెంబర్ ప్లేట్ లను కలిగి ఉంటారు.

దోషపూరిత నెంబర్ ప్లేట్ తో ప్రయాణించిన వ్యక్తికి హైదరాబాద్ లో ఎం జరిగిందంటే..?

మోటార్ వెహికల్ చట్టం ప్రకారం నిబంధనలు అనుగుణంగా వాహనదారులు వాహనానికి సంబంధించి అన్నింటిని కలిగి ఉండాలి. లేకపోతె ఇటువంటి వాహనాదారులమీద కఠినమైన చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. కానీ ఇందుకు భిన్నంగా హైదరాబాద్ పోలీసులు ఈ నిభందనలు గురించి ప్రజలందరికి తెలియజేయడానికి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.

దోషపూరిత నెంబర్ ప్లేట్ తో ప్రయాణించిన వ్యక్తికి హైదరాబాద్ లో ఎం జరిగిందంటే..?

హ్యదరాబాద్ లో పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు అక్రమ రిజిస్ట్రేషన్ తో ఉన్న ఒక వాహనాన్ని పట్టుకున్నారు. ఇది ఒకే డిజిటల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ని కలిగి ఉంది. అది చూడటానికి ఇతర నంబర్స్ కంటే పెద్దదిగా కనిపిస్తుంది. ఈ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు నెంబర్ ప్లేట్ కోసం చలాన్ విధించడానికి బదులుగా కొత్త ప్లేట్ ని మార్పించిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విధంగా వైరల్ అవ్వడం ద్వారా ప్రజలలో అవగాహన కలుగుతుందని పోలీసులు భావించారు.

దోషపూరిత నెంబర్ ప్లేట్ తో ప్రయాణించిన వ్యక్తికి హైదరాబాద్ లో ఎం జరిగిందంటే..?

రిజిస్ట్రేషన్ ప్లేట్ కోసం వాహన యజమాని డబ్బు చెల్లించాడో లేదో తెలియదు. కానీ పోలీసులు ఇలాంటి వాటిని పూర్తి చేయమని అడుగుతారు. అంతే కాకుండా ఆర్టీఓ ఆఫీస్ కి లేదా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. కానీ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దీనికి భిన్నంగా వాహనానికి అక్కడికక్కడే నెంబర్ ప్లేట్ ని పూర్తి చేసినట్లు మనకు తెలుస్తుంది.

దోషపూరిత నెంబర్ ప్లేట్ తో ప్రయాణించిన వ్యక్తికి హైదరాబాద్ లో ఎం జరిగిందంటే..?

సాధారణంగా వాహనదారులు నిభందనలు విరుద్దంగా ప్రవర్తిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఆంటే కాకుండా జరిమానాలు విధించడం వంటివి చేయవచ్చు. కానీ ఇందుకు భిన్నగా పోలీసులు అప్పటికప్పుడే నెంబర్ ప్లేట్ మార్చడం జరిగింది. వాహనదారులు నంబర్స్ ని వివిధ డిజైన్లతో వేసుకోవడం మనం చూస్తూ ఉంటాము, ఇవన్నీ చట్ట విరుద్ధమైనవని ప్రజలు గ్రహించాలి.

దోషపూరిత నెంబర్ ప్లేట్ తో ప్రయాణించిన వ్యక్తికి హైదరాబాద్ లో ఎం జరిగిందంటే..?

అనేక రాష్ట్రాల్లో కొత్త కార్ల కోసం తప్పనిసరి అయిన భారతదేశం చుట్టూ హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (హెచ్‌ఎస్‌ఆర్‌పి) ను రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందిస్తున్నాయి. హెచ్‌ఎస్‌ఆర్‌పి ట్యాంపర్ ప్రూఫ్ మరియు వాహనం దెబ్బతినకుండా తొలగించబడదు. చాలా రాష్ట్రాలు పాత వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్‌పిని ఏర్పాటు చేయడం తప్పనిసరి చేసింది. కొత్త ప్లేట్లు వాహనాలకు డిజైనర్ నంబర్ ప్లేట్ రాకుండా చర్యలు తీసుకుంటోంది.

దోషపూరిత నెంబర్ ప్లేట్ తో ప్రయాణించిన వ్యక్తికి హైదరాబాద్ లో ఎం జరిగిందంటే..?

రహదారులపైన అక్రమ నెంబర్ ప్లేట్ తో ప్రయాణించడం చట్ట విరుద్ధం. రోడ్లపై అక్రమ నంబర్ ప్లేట్లను తనిఖీ చేయడానికి తరచుగా ట్రాఫిక్ పోలీసు బృందాలు ప్రత్యేక డ్రైవ్‌లు నడుపుతాయి. గత సంవత్సరం పోలీసులు ఇలాంటి డ్రైవ్ చేసెవారిని ఒక్కరోజులో వందలాదిమందికి జరిమానాలు విధించారు. రహదారుపైన ఇలాంటి అసౌకర్యాలను నివారించడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలను తీసుకువస్తోంది.

దోషపూరిత నెంబర్ ప్లేట్ తో ప్రయాణించిన వ్యక్తికి హైదరాబాద్ లో ఎం జరిగిందంటే..?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారతదేశంలో రోడ్డు నియమాలు కఠినంగా ఉన్నపటికీ చాల మంది వాటిని పాటించడం లేదు. వాహనదారులందరు తప్పని సరిగా నిబంధనలు కచ్చితంగా పాటించాలి. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, మద్యం తాగి ప్రయాణించడం, లైసెన్స్ వంటివి లేకుండా తిరగడం చట్టరీత్యా నేరం. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలి.

Most Read Articles

English summary
Cops bust Toyota Fortuner owner for faulty numberplate: Let him go after fixing numberplate. Read in Telugu.
Story first published: Thursday, February 13, 2020, 12:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X