Just In
- 25 min ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- 1 hr ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 2 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- 4 hrs ago
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
Don't Miss
- Movies
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హ్యుందాయ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ లాంచ్ ఎప్పుడంటే ?
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) కోనా ఎలక్ట్రిక్‌ను జూలై 2019 లో ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ కారు చాలామంది ప్రజల దృష్టిని ఆకర్షించింది. రాబోయే కాలంలో హ్యుందాయ్ కోన అమ్మకాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. కోనా కాంపాక్ట్ భారతదేశంలో రూ. 37.7 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరను కలిగి ఉంటుంది.

ఆటోకార్ ఇండియా నివేదిక ప్రకారం, హ్యుందాయ్ మార్కెట్ కోసం మరో కొత్త వాహనంపై పనిచేస్తోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండి మరియు సిఇఒ సియోన్ సియోబ్ కిమ్ మాట్లాడుతూ, ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల కంపెనీ కొద కొత్త ఎలెక్క్ట్రిక్ వాహనం తయారు చేయడంపై నిమగ్నమై ఉంది. ఇది భారత వినియోగదారులకు సరసమైన ఉత్పత్తి కూడా అయ్యే అవకాశం ఉంది.

హ్యుందాయ్ కంపెనీ తయారు చేస్తున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ వాహనం కొత్త ఇ.వి గ్రౌండ్-అప్ ఎస్‌యూవీగా ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. ఈ కొత్త ఉత్పత్తిని సంస్థ 2022 నాటికి మార్కెట్లోకి తీసుకువస్తుందని మేము ఆశిస్తున్నాము. ఇటీవల కాలంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కువ మంది వినియోగదారులు కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలపైనే మొగ్గు చూపుతున్నారు.
MOST READ:సురక్షితమైన ప్రయాణానికి శానిటైజ్ క్యాబ్ సర్వీస్, ఇదే

ఈ నేపథ్యంలో హ్యుందాయ్ కంపెనీ కూడా వినియోగ దారుణాలకు ఒక కొత్త ఉత్పత్తిని అందించడం కోసం పనిచేస్తోంది. హ్యుండై కంపెనీ ఎలక్ట్రిక్ కారు 2022 నాటికి మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఈ కార్ ధరల గురించి వ్యాఖ్యానిస్తూ సియోబ్ కిమ్ ఈ వాహనం యొక్క ధరలను త్వరలో వెల్లడిస్తామని, అంతే కాకుండా ఇది వాహనదారునికి చాలా అనుకూలంగా ఉండే విధంగా ఉంటుందని తెలిపారు. హ్యుందాయ్ ఇవి మైలేజ్ విషయానికి వస్తే ఇది 200 కిలోమీటర్ల పైన మరియు 200 నుండి 300 కిలోమీటర్ల మధ్య ఉంటుంది.

ఇటీవలి ఆటో వారతలా ప్రకారం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డిఎఐ) అన్ని సాధారణ బీమా సంస్థలకు సెప్టెంబర్ 2018 నుండి కొత్త కార్ల కోసం మూడేళ్ల థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలను మాత్రమే ఇవ్వడం తప్పనిసరి చేసింది. కానీ ఇప్పుడు ఆగస్టు 1, 2020 నుండి మూడేళ్ల థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ ఆర్డర్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.
MOST READ:ట్రాఫిక్ ఫైన్ తగ్గించాలని అభ్యర్థించిన బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఓనర్ [వీడియో]

థర్డ్ పార్టీ మోటారు భీమా పాలసీ యొక్క ప్రధాన లోపాలలో ఒకటి బీమా సంస్థలకు ప్రీమియంను దీర్ఘకాలిక 'ఓన్ డ్యామేజ్' కవర్ కోసం అంచనా వేయడంలో ఇబ్బంది ఉంది. ఇంటర్ లింక్డ్ ఫైనాన్షియల్ ఆసక్తుల కారణంగా బీమా సంస్థల నుండి బలవంతంగా విక్రయించే అవకాశాలు కూడా ఉన్నాయి. మూడేళ్ల పాలసీపై నో క్లెయిమ్ బోనస్‌ను అంచనా వేస్తుంది.

హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్యూవీ గురించి డ్రైవ్స్పార్క్ అభిప్రాయం :
ప్రకృతిలో సహజ వనరులు (పెట్రోల్ మరియు డీజిల్) కొరత ఉన్నందున, వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలు భవిష్యత్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇప్పటికే చాలామంది వినియోగాదారులు ఎలెక్ట్రికె వాహనాలపై ఎక్కువ ఆసక్తిని కనపరుస్తున్నారు. ఏదేమైనా దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేసిన తర్వాత, ఇది టాటా నెక్సాన్ ఇవి మరియు ఎంజి జెడ్ఎస్ ఇవి వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది.
MOST READ:ఈ ఏడాదిలో రెండు సార్లు పెరిగిన టీవీఎస్ అపాచే ఆర్టిఆర్ 180 ధరలు