ALERT: హ్యుందాయ్ ఆరా మీద బుకింగ్స్ ప్రారంభం.. త్వరపడండి!

హ్యుందాయ్ మోటార్స్ తమ సరికొత్త హ్యుందాయ్ ఆరా కారు మీద అఫీషీయల్‌గా బుకింగ్స్ ప్రారంభించింది. లైట్ అప్ అనే పేరుతో హ్యుందాయ్ కొత్తగా రిలీజ్ ఆరా టెలివిజన్ యాడ్ వీడియోలో బుకింగ్స్ స్టార్ట్ చేసినట్లు ప్రకటించింది. హ్యుందాయ్ ఆరా కంపెనీ యొక్క కాంపాక్ట్ సెడాన్, ఇది విపణిలో ఉన్న ఎక్సెంట్ మోడల్ స్థానాన్ని భర్తీ చేస్తుంది (ఫ్యూచర్ ఎక్సెంట్ మోడల్ ఉండదు).

ALERT: హ్యుందాయ్ ఆరా మీద బుకింగ్స్ ప్రారంభం.. త్వరపడండి!

హ్యుందాయ్ మోటార్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ మరియు సర్వీసింగ్ హెడ్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, "2020 దశాబ్దాన్ని ఆరా బుకింగ్స్‌తో ప్రారంభిస్తున్నాము, అత్యాధునిక డిజైన్ శైలి, స్పోర్టివ్ ఫీల్ మరియు అవధులు లేని ప్రయాణ అనుభవాన్ని అందించడంలో హ్యుందాయ్ ఆరా తనను తాను నిరూపించుకుంటుంది" అని చెప్పుకొచ్చారు.

ALERT: హ్యుందాయ్ ఆరా మీద బుకింగ్స్ ప్రారంభం.. త్వరపడండి!

కస్టమర్లు ఇప్పుడు హ్యుందాయ్ ఆరా కారును కంపెనీ వెబ్‌సైట్ లేదా ఏదైనా హ్యుందాయ్ అధీకృత షోరూముల్లో రూ. 10,000 చెల్లించి హ్యుందాయ్ ఆరా కారును బుక్ చేసుకోవచ్చు. జనవరి 21, 2020న పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నట్లు హ్యుందాయ్ ప్రతినిధులు స్పష్టం చేశారు.

ALERT: హ్యుందాయ్ ఆరా మీద బుకింగ్స్ ప్రారంభం.. త్వరపడండి!

హ్యుందాయ్ ఆరా కాంపాక్ట్ సెడాన్ ఎక్ట్సీరియర్ డిజైన్ ఫోటోలు మినహాయిస్తే, ఇప్పటి వరకు దీని ఇంటరీయర్ ఫోటోలను రిలీజ్ చేయలేదు. కానీ హ్యుందాయ్ ఆరా ఇంటీరియర్ దాదాపు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఇంటీరియర్‌నే పోలి ఉంటుందని సమాచారం.

ALERT: హ్యుందాయ్ ఆరా మీద బుకింగ్స్ ప్రారంభం.. త్వరపడండి!

సరికొత్త హ్యందాయ్ ఆరా కారులో అత్యాధునిక స్టీరంగ్ వీల్ డిజైన్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల 8-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు రానున్నాయి.

ALERT: హ్యుందాయ్ ఆరా మీద బుకింగ్స్ ప్రారంభం.. త్వరపడండి!

ప్రీమియం లుక్ మరియు ఫీల్ కలిగించే అత్యాధునిక మెటీరియల్‌తో ఇంటీరియర్ ఫినిషింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫ్లోటింగ్ టైప్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, టూ-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్-లెస్ ఛార్జింగ్ ఇంకా హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీలో ఉన్నటువంటి మరెన్నో ఇతర కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో రానున్నాయి.

ALERT: హ్యుందాయ్ ఆరా మీద బుకింగ్స్ ప్రారంభం.. త్వరపడండి!

హ్యుందాయ్ ఆరా ఫ్రంట్ డిజైన్ చూడటానికి గ్రాండ్ ఐ10 నియోస్‌ను పోలి ఉంది. పలు రకాల కాస్మొటిక్ మార్పులు మినహాయిస్తే మిగతాదంతా సేమ్ టు సేమ్. రియర్ డిజైన్ ఇందులో పూర్తిగా కొత్తగా వచ్చింది. కారుకు రియర్ డోర్ చివర్లో ఉన్న C-పిల్లర్ డిక్కీ వరకు కొనసాగించడం హైలెట్‌‌గా నిలిచింది. రియర్ డిజైన్‌లో స్టైలిష్ C-ఆకారంలో ఉన్న ఎల్ఈడీ టెయిల్ లైట్లు మరియు హ్యుందాయ్, ఆరా లోగోలు ఉన్నాయి.

ALERT: హ్యుందాయ్ ఆరా మీద బుకింగ్స్ ప్రారంభం.. త్వరపడండి!

హ్యుందాయ్ ఆరా కాంపాక్ట్ సెడాన్ సాంకేతికంగా బిఎస్-6 వెర్షన్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇందులోని 1.0-లీటర్ టుర్భో పెట్రోల్ బిఎస్-6 మోడల్ గరిష్టంగా 100బిహెచ్‌పి పవర్ మరియు 172ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ALERT: హ్యుందాయ్ ఆరా మీద బుకింగ్స్ ప్రారంభం.. త్వరపడండి!

అదే విధంగా 1.25-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ బిఎస్-6 పెట్రోల్ ఇంజన్ 82బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. హ్యుందాయ్ ఆరా లోని మూడవ ఇంజన్ ఆప్షన్ 1.2-లీటర్ బిఎస్-6 డీజల్, ఇది 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

గేర్‌బాక్స్ విషయానికి వస్తే 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఛాయిస్‌లో హ్యుందాయ్ ఆరా కారును ఎంచుకోవచ్చు. హ్యుందాయ్ ఆరా ధరల శ్రేణి రూ. 6.35 లక్షల నుండి రూ. 9.35 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉండవచ్చు.

ALERT: హ్యుందాయ్ ఆరా మీద బుకింగ్స్ ప్రారంభం.. త్వరపడండి!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ కాంపాక్ట్ సెడాన్ మార్కెట్లోకి ఎక్సెంట్ మోడల్‌ను తీసుకొచ్చింది, అయితే ఇది ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో హ్యుందాయ్ ఇటీవల లాంచ్ చేసిన గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా కాంపాక్ట్ సెడాన్ వెర్షన్ హ్యుందాయ్ ఆరా కారును తీసుకొచ్చారు. డిజైన్, ఫీచర్లు మరియు ధరల పరంగా ఇతర మోడళ్లకు గట్టి పోటీనిస్తే ఈ సెగ్మెంట్లో హ్యుందాయ్‌కు తిరుగులేని సక్సెస్ ఖాయమని చెప్పొచ్చు.

Most Read Articles

English summary
Hyundai Aura Bookings Open At Rs 10,000: Company Releases New TVC. Read in Telugu.
Story first published: Saturday, January 4, 2020, 16:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X