ఫస్ట్ టైమ్: హ్యుందాయ్ ఆరా ఇంటీరియర్ రివీల్.. వీడియో చూడండి!

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఇటీవల సరికొత్త ఆరా కాంపాక్ట్ సెడాన్ కారును దేశీయంగా ఆవిష్కరించింది. ఇప్పటి వరకు ఎక్ట్సీరియర్ మరియు ఇంజన్ వివరాలను మాత్రమే వెల్లడించిన హ్యుందాయ్ తాజాగ ఇంటీరియర్ వివరాలతో కూడిన వీడియోను రివీల్ చేసింది. హ్యుందాయ్ ఆరా సెడాన్ కారు విడుదల తేదీని కూడా ఖరారు చేసింది.

హ్యుందాయ్ ఆరా ఇంటీరియర్‌తో పాటు ఫీచర్లు, డిజైన్ మరియు పూర్తి వివరాలు ఇవాళ్టి స్టోరీలో...

ఫస్ట్ టైమ్: హ్యుందాయ్ ఆరా ఇంటీరియర్ రివీల్.. వీడియో చూడండి!

సరికొత్త హ్యుందాయ్ ఆరా కాంపాక్ట్ సెడాన్ జనవరి 21 నుండి మార్కెట్లో అమ్మకాల్లోకి రానుంది. హ్యుందాయ్ ఆరా బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దేశ్యాప్తంగా ఉన్న హ్యుందాయ్ అధీకృత డీలర్ల వద్ద రూ. 10,000 చెల్లించి ఆరా కారును బుక్ చేసుకోవచ్చు. విడుదలైన వెంటనే డెలివరీలు ప్రారంభిస్తామని హ్యుందాయ్ తెలిపింది.

పైనున్న వీడియోలో చూస్తే, హ్యుందాయ్ ఆరా సెడాన్ చూడటానికి గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్ క్యాబిన్‌ను పోలి ఉంది. అయితే నియోస్ కారుతో పోలిస్తే ఆరా సెడాన్‌ మరింత డార్క్ కలర్ ఇంటీరియర్‌తో రానుంది.

ఫస్ట్ టైమ్: హ్యుందాయ్ ఆరా ఇంటీరియర్ రివీల్.. వీడియో చూడండి!

హ్యుందాయ్ ఆరా క్యాబిన్‌లో డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌ వచ్చింది. డ్యాష్‌బోర్డు మీద డార్క్ షేడ్స్, ఫ్యాబ్రిక్ అప్‌హోల్‌స్ట్రే మరియు సీట్లు బీజీ కలర్ ఫినిషింగ్‌లో వచ్చాయి. డ్యాష్‌బోర్డు మీదున్న సెంటర్ కన్సోల్‌లో ఆపిల్ కార్‌‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేసే 8.0-ఇంచుల టచ్‌‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వచ్చింది.

ఫస్ట్ టైమ్: హ్యుందాయ్ ఆరా ఇంటీరియర్ రివీల్.. వీడియో చూడండి!

హ్యుందాయ్ గ్రాండ్ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్ కారును సేకరించిన 5.3-ఇంచుల డిజిటల్ డిస్ల్పే కూడా వచ్చింది. అనలాగ్ టాకో మీటర్ మరియు డ్రైవర్‌కు కావాల్సిన పూర్తి వివరాలను ఇందులో చూడొచ్చు. క్లైమేట్ కంట్రోల్ కోసం మరో చిన్న డిస్ల్పే కూడా అదనంగా అందించారు. టర్బైన్ ఆకారంలో ఉన్న ఏసీ వెంట్స్‌ మినహాయిస్తే ఇంటీరియర్‌ మొత్తం నియోస్ తరహాలోనే ఉంటుంది.

ఫస్ట్ టైమ్: హ్యుందాయ్ ఆరా ఇంటీరియర్ రివీల్.. వీడియో చూడండి!

హ్యుందాయ్ ఆరా కాంపాక్ట్ సెడాన్‌లోని ఫీచర్ల విషయానికి వస్తే, రియర్ ఏసీ వెంట్స్, స్టీరింగ్ ఆధారిత కంట్రోల్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎయిర్ బ్యాగులు ఇంకా ఎన్నో ఫీచర్లు వచ్చాయి.

ఫస్ట్ టైమ్: హ్యుందాయ్ ఆరా ఇంటీరియర్ రివీల్.. వీడియో చూడండి!

కొరియన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ ఆరా కాంపాక్ట్ సెడాన్ కారులో బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటించే మూడు రకాల ఇంజన్ ఆప్షన్స్ అందిస్తోంది. వీటిలో హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌‌యూవీ నుండి సేకరించిన డీజల్ ఇంజన్ కూడా ఉంది.

ఫస్ట్ టైమ్: హ్యుందాయ్ ఆరా ఇంటీరియర్ రివీల్.. వీడియో చూడండి!

ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 82బిహెచ్‌‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్; 1.0-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్ 100బిహెచ్‌పి పవర్ మరియు 172ఎన్ఎమ్ టార్క్ మరియు 1.2-లీటర్ డీజల్ ఇంజన్ 75బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఫస్ట్ టైమ్: హ్యుందాయ్ ఆరా ఇంటీరియర్ రివీల్.. వీడియో చూడండి!

హ్యుందాయ్ ఆరా సెడాన్‌‌లో లభించే మూడు ఇంజన్‌లను కూడా స్టాండర్డ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. 1.2-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లు ఆప్షనల్ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో కూడా లభిస్తాయి, కానీ 1.0-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్ వేరియంట్ మాత్రం ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభించదు.

ఫస్ట్ టైమ్: హ్యుందాయ్ ఆరా ఇంటీరియర్ రివీల్.. వీడియో చూడండి!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రస్తుతం ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ కారును విక్రయిస్తోంది. అయితే, ఇది ఆశించిన స్థాయిలో సేల్స్ సాధించకపోవడంతో దీని స్థానంలో గ్రాండ్ఐ10 నియో ఆధారంగా ఆరా కాంపాక్ట్ సెడాన్ కారును తీసుకొస్తోంది. హ్యుదాయ్ ఆరా మార్కెట్లో ఉన్న ఎక్సెంట్ స్థానాన్ని భర్తీ చేస్తుంది.

ఇది పూర్తి స్థాయిలో విడుదలైతే మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్ వంటి కాంపాక్ట్ సెడాన్ కార్లకు గట్టి పోటీనివ్వనుంది. దీని ధర సుమారుగా రూ. 6 లక్షల నుండి రూ. 8 లక్షల రేంజ్‌లో ఉండవచ్చు.

Most Read Articles

English summary
Hyundai Aura Interiors Revealed In New Video: India Launch Scheduled For 21st Of January. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X