హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని ఆన్‌లైన్‌లో తెగ కొనేస్తున్నారు!

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ భారత్‌లో విక్రయిస్తున్న కార్లకు ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. కాంపిటీటర్లతో పోల్చుకుంటే మరిన్ని ఎక్కువ ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీ మరియు అధునాత డిజైన్‌లతో పాటుగా సరసమైన ధరలకే హ్యుందాయ్ తమ వాహనాలను విక్రయిస్తుంది. తాజాగా కంపెనీ ప్రవేశపెట్టిన 2020 హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ అతి తక్కువ సమయంలో కస్టమర్లను ఆకర్షించి, ఈ సెగ్మెంట్లో బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది.

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని ఆన్‌లైన్‌లో తెగ కొనేస్తున్నారు!

ఈ ఏడాది ఆరంభంలో సరికొత్త 2020 హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ మార్కెట్లో విడుదలైంది. ప్రస్తుతం దీని ప్రారంభ ధర రూ.9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. కోవిడ్-19 నేపథ్యంలో హ్యుందాయ్ తమ క్రెటా కారు కోసం ఇటీవలే ఆన్‌లైన్ సేల్స్‌ని ప్రారంభించింది. కంపెనీ స్టార్ట్ చేసిన క్లిక్-టు-బై 'Click-To-Buy'ప్లాట్‌ఫామ్ ద్వారా ఇప్పటికే హ్యుందాయ్ క్రెటాకు 1,700 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చాయి.

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని ఆన్‌లైన్‌లో తెగ కొనేస్తున్నారు!

ఈ క్లిక్-టు-బై ప్లాట్‌ఫామ్‌లో అన్ని హ్యుందాయ్ కార్లను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంది. సరికొత్త క్రెటా మరియు కొత్త వెర్నా కార్లు కూడా ఈ ప్రోడక్ట్ లిస్టింగ్‌లో ఉన్నాయి. ఈ ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 500 లకు పైగా హ్యుందాయ్ డీలర్‌షిప్‌లతో కస్టమర్లు నేరుగా కనెక్ట్ కావచ్చు. ఈ ఆన్‌లైన్ సేల్స్ స్టోర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెగ్యులర్ డీలర్‌షిప్‌లకు అదనం.

MOST READ: భారత్‌లో ప్రారంభమైన జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ డెలివరీలు

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని ఆన్‌లైన్‌లో తెగ కొనేస్తున్నారు!

హ్యుందాయ్ క్లిక్-టు-బై డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు కంపెనీ వివిధ రకాల ఫైనాన్సింగ్ ఆప్షన్లను కూడా అందుబాటులో ఉంచింది. వాహనాల కొనుగోలు విషయంలో కస్టమర్లకు ఓ వ్యక్తిగత ఆన్‌లైన్ సేల్ అసిస్టెంట్ సహాయం చేస్తారు. అంతాకుండా కస్టమర్లు తాము ఎంచుకున్న కారును తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని ఆన్‌లైన్‌లో తెగ కొనేస్తున్నారు!

సరికొత్త హ్యుందాయ్ క్రెటా పూర్తిగా కొత్త ఇంజన్లతో వస్తుంది. హ్యుందాయ్ తన 1.4 లీటర్ మరియు 1.6 లీటర్ యూనిట్లను పాత మోడళ్ల నుండి పూర్తిగా నిలిపివేసింది. ఈ పాత ఇంజన్లను కొత్త 1.5 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ యూనిట్లతో భర్తీ చేసింది. కొత్త 2020 హ్యుందాయ్ క్రెటా 14 విభిన్న వేరియంట్లు మొత్తం 3 ఇంజన్ ఆప్షన్లతో మార్కెట్లో లభిస్తోంది.

MOST READ: 3 కోట్ల విలువైన కార్లు దొంగలించిన దొంగల ముఠా, తర్వాత ఏం జరిగించే తెలుసా ?

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని ఆన్‌లైన్‌లో తెగ కొనేస్తున్నారు!

కొత్త 2020 హ్యుందాయ్ క్రెటాలో కొత్త 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు వరుసగా 115 బిహెచ్‌పిల శక్తిని మరియు 144 ఎన్ఎమ్ మరియు 250 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను అందిస్తాయి. హ్యుందాయ్ క్రెటా హై స్పెక్ వేరియంట్లలో 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని ఆన్‌లైన్‌లో తెగ కొనేస్తున్నారు!

ఈ మూడు ఇంజన్లు స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కావాలనుకునే వారికి ఇందులో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ సివిటి, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ టార్క్-కన్వర్టర్ మరియు 1.4-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

MOST READ: 19 సూపర్ బైక్‌లను స్వాధీనం చేసుకున్న గురుగ్రామ్ పోలీసులు, ఎందుకో తెలుసా ?

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని ఆన్‌లైన్‌లో తెగ కొనేస్తున్నారు!

గడచిన మార్చ్ నెలలో రిఫ్రెష్ చేసిన ఈ సరికొత్త 2020 హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్లలో కంపెనీ అనేక మార్పులు చేర్పులు చేసింది. ముందు భాగంలో సరికొత్త క్యాస్కేడింగ్ గ్రిల్‌, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌ల చుట్టూ కొత్తగా రూపొందించిన ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్, కొత్త ఎల్‌ఈడి ఫాగ్ ల్యాంప్స్ మరియు క్రింది భాగంలో ఫాక్స్ సిల్వర్ స్కఫ్ ప్లేట్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని ఆన్‌లైన్‌లో తెగ కొనేస్తున్నారు!

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. కొత్త హ్యుందాయ్ క్రెటా బేసిక్ క్యాబిన్ డిజైన్‌ను యధావిధిగా ఉంచారు. స్టీరింగ్ వీల్‌పై కొన్ని రకాల కంట్రోల్స్ ఉంటాయి. ఇందులో డ్రైవర్ సమాచారం కోసం 7-ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇందులో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా జోడించారు. ఇది హ్యుందాయ్ అందిస్తున్న అఫీషియల్ బ్లూ-లింక్ కనెక్టివిటీ టెక్నాలజీతో పాటుగా యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

MOST READ: కస్టమర్ల కోసం షెల్ డోర్‌స్టెప్ వెహికల్ మెయింటినెన్స్ సర్వీస్

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని ఆన్‌లైన్‌లో తెగ కొనేస్తున్నారు!

కొత్త హ్యుందాయ్ క్రెటాలో వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, పానోరమిక్ సన్‌రూఫ్, ఆంబియెంట్ లైటింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్ విత్ ఇబిడి, ప్యాడల్ షిఫ్టర్స్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు సెన్సార్లు, హిల్-స్టార్ట్ అసిస్ట్, హిల్-డీసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అధునాతన సాంకేతిక మరియు సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని ఆన్‌లైన్‌లో తెగ కొనేస్తున్నారు!

హ్యుందాయ్ క్రెటా ఆన్‌లైన్ బుకింగ్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుత కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు షోరూల కన్నా డిజిటల్ ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కస్టమర్లతో నేరుగా కాంటాక్ట్ కాకుండా, తమకు నచ్చిన కారును ఎంచుకోవటం నుంచి డెలివరీ వరకూ అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. హ్యుందాయ్ కూడా ఇదే తరహాలో తమ వాహనాలను ఆన్‌లైన్ దుకాణంలో అందుబాటులో ఉంచింది. క్రెటా ఇప్పటికే ఈ సెగ్మెంట్లో ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది.

Most Read Articles

English summary
The 2020 Hyundai Creta has achieved a new milestone with the number of online bookings received by the brand in the country. The Creta was launched in the Indian market early this year and retails at a starting price of Rs 9.99 lakh, ex-showroom (India). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X