2020 క్రెటా లాంచ్ డేట్ ఖరారు చేసిన హ్యుందాయ్

2020 ఆటో ఎక్స్‌పో ఇంకెంతో కాలం లేదు.. ఢిల్లీలో ప్రతి రెండేళ్లకొకసారి జరిగే అంతర్జాతీయ వాహన ప్రదర్శన వేదికలో వివిధ కార్ల కంపెనీలు తమ నూతన ఉత్పత్తులను ఆవిష్కరించడానికి సిద్దమవుతున్నాయి. తాజాగా అందిన సమాచారం మేరకు, హ్యుందాయ్ మోటార్స్ తమ సెకండ్ జనరేషన్ క్రెటా ఎస్‌యూవీని ఫిబ్రవరి 6న ఇండియన్ ఆటో ఎక్స్‌పో ఈవెంట్లో అంతర్జాతీయ ఆవిష్కరణకు సిద్దమవుతున్నట్లు తెలిసింది.

2020 క్రెటా లాంచ్ డేట్ ఖరారు చేసిన హ్యుందాయ్

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ 2020 హ్యుందాయ్ క్రెటా (సెకండ్ జనరేషన్) కారును ఆవిష్కరించనున్నారు. అయితే ఈ కొత్త క్రెటాను మార్కెట్లో లాంచ్ చేయడంలేదు.

2020 క్రెటా లాంచ్ డేట్ ఖరారు చేసిన హ్యుందాయ్

ఎక్ట్సీరియర్ డిజైన్ మార్పులతో మాత్రమే క్రెటా ఎస్‌యూవీని ప్రవేశపెట్టనున్నారు. ఇంటీరియర్‌ను ప్రదర్శించడం లేదు, ఇటీవల హ్యుందాయ్ ఆవిష్కరించిన ఆరా కారును కూడా ఇదే తరహాలో ఎక్ట్సీరియర్‌ను మాత్రమే రివీల్ చేసింది. ఇటీరియర్ మరియు ఫీచర్లకు సంభందించిన వివరాలను లాంచ్ సమయంలోనే రివీల్ చేయనుంది. క్రెటా విషయంలో కూడా అదే పద్దతిని అవలంభిస్తోంది.

2020 క్రెటా లాంచ్ డేట్ ఖరారు చేసిన హ్యుందాయ్

కొత్త తరం 2020 హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని మార్చి 2020లో మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ మిడ్-సైజ్ ఎస్‌‌యూవీ సెగ్మెంట్లో భారీ సక్సెస్ అందుకున్న క్రెటా ఇటీవల విడుదలైన కియా సెల్టోస్ కారణంగా పోటీ కష్టమైంది. దీంతో భారీ మార్పు చేర్పులతో కొత్త తరం క్రెటాను లాంచ్ చేస్తున్నారు.

2020 క్రెటా లాంచ్ డేట్ ఖరారు చేసిన హ్యుందాయ్

మార్చి 2020 నుండి అసలైన ఆట మొదలవుతుందనే చెప్పాలి, హ్యుందాయ్ 2020 క్రెటా తీసుకొస్తుండటంతో మహీంద్రా కూడా వెర్షన్ ఎక్స్‌యూవీ500 మోడల్‌ను సిద్దం చేస్తోంది. దీనికి తోడు చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్స్ మరియు హైమా ఆటోమొబైల్స్ కంపెనీలు ఇదే సెగ్మెంట్ ద్వారా ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి.

2020 క్రెటా లాంచ్ డేట్ ఖరారు చేసిన హ్యుందాయ్

డిజైన్ విషయానికి వస్తే, 2020 క్రెటా ఎస్‌యూవీలో పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోవడంలేదు. అయితే, హ్యుందాయ్ గత ఏడాది చైనాలో ఆవిష్కరించిన హ్యుందాయ్ ఐఎక్స్25 ఆధారంగా కొత్త తరం క్రెటా కారులో మార్పులు జరుపుతున్నట్లు తెలిసింది. నూతన అల్లాయ్ వీల్స్ మరియు సరికొత్త ఫ్రంట్ గ్రిల్ ఇందులో వస్తున్నాయి.

2020 క్రెటా లాంచ్ డేట్ ఖరారు చేసిన హ్యుందాయ్

ఇంజన్ విషయానికి వస్తే, హ్యుందాయ్ భాగస్వామ్యపు దిగ్గజం కియా మోటార్స్ సెల్టోస్ ఎస్‌యూవీలో అందిస్తున్న ఇంజన్ ఆప్షన్లనే క్రెటాలో కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. కియా సెల్టోస్ జీటీ-లైన్ లోని 1.4-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్ న్యూ క్రెటాలో రావొచ్చు.

2020 క్రెటా లాంచ్ డేట్ ఖరారు చేసిన హ్యుందాయ్

సరికొత్త హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్స్ మరియు హ్యుందాయ్ ఐఎక్స్25 మోడల్‌లో ఉన్నటువంటి 10.25-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అధునాతన వీల్ ఆర్చెస్, పానరొమిక్ సన్‌రూఫ్ వంటివి 2020 క్రెటాలో ప్రధాన హైలెట్స్ అని చెప్పుకోవచ్చు.

2020 క్రెటా లాంచ్ డేట్ ఖరారు చేసిన హ్యుందాయ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ మార్కెట్లో సేల్స్ మరియు కస్టమర్ల సంతృప్తి పరంగా ఎప్పుడో నిరూపించుకుంది. ప్రతిష్టాత్మకమైన "ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్" (ICOTY) అవార్డు కూడా లభించింది. సెకండ్ జనరేషన్ క్రెటా విడుదలతో అంచనాలు మించి ఫలితాలిస్తుందని హ్యుందాయ్ భావిస్తోంది.

Source:Autocar India

Most Read Articles

English summary
New (2020) Hyundai Creta India Launch Date Confirmed: Here Are The Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X