ఎలంట్రా ‘ఎస్’ వేరియంట్ నిలిపివేసిన హ్యుందాయ్, ఎందుకో తెలుసా

దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన హ్యుందాయ్ తమ ఎలంట్రా సెడాన్ యొక్క బేస్ -స్పెక్ 'ఎస్' వేరియంట్‌ను భారత మార్కెట్లో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. హ్యుందాయ్ ఎలంట్రా ఎస్ ధర రూ. 15.89 లక్షలు, (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఎలంట్రా ‘ఎస్’ వేరియంట్ నిలిపివేసిన హ్యుందాయ్, ఎందుకో తెలుసా

ఇండియన్ మార్కెట్లో హ్యుందాయ్ ఎలంట్రా ప్రారంభ ధర కొంత వరకు పెరిగింది. హ్యుందాయ్ ఎలంట్రా ‘ఎస్ఎక్స్' ఇప్పుడు లైనప్‌లో కొత్త ఎంట్రీ లెవల్ వేరియంట్‌గా ‘ఎస్' స్థానంలో ఉంది. కొత్త బేస్ వేరియంట్ మునుపటి మోడల్ కంటే దాదాపు 3 లక్షల రూపాయలు ఖరీదైనది. ఇప్పుడు దీని ధర రూ. 18.49 లక్షలు, (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఎలంట్రా ‘ఎస్’ వేరియంట్ నిలిపివేసిన హ్యుందాయ్, ఎందుకో తెలుసా

వేరియంట్ నిలిపివేయడానికి ఖచ్చితమైన కారణం గురించి హ్యుందాయ్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, మార్పులను ప్రతిబింబించేలా కంపెనీ వెబ్‌సైట్ మాత్రం నవీనీకరించబడింది. హ్యుందాయ్ ఎలంట్రా ఇటీవల భారత మార్కెట్లో బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా నవీనీకరించబడింది. కొత్త బిఎస్ 6 కంప్లైంట్ సెడాన్ 2.0 లీటర్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ కలిగి ఉంటుంది.

MOST READ:విడుదలకు సిద్దమైన న్యూ హ్యుందాయ్ ఐ 20 కార్, లాంచ్ ఎప్పుడో తెలుసా

ఎలంట్రా ‘ఎస్’ వేరియంట్ నిలిపివేసిన హ్యుందాయ్, ఎందుకో తెలుసా

ఈ హ్యుందాయ్ కారులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి మరియు 192 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ అదే 115 బిహెచ్‌పి మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు ఆరు-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఎలంట్రా ‘ఎస్’ వేరియంట్ నిలిపివేసిన హ్యుందాయ్, ఎందుకో తెలుసా

2020 హ్యుందాయ్ ఎలంట్రా ఇప్పుడు మూడు వేరియంట్ల ఎంపికలో రానుంది. అవి ఎస్ఎక్స్ ఎంటి, ఎస్ఎక్స్ ఏటి మరియు ఎస్ఎక్స్ (ఓ) ఏటి. ఈ వేరియంట్ లైనప్‌లో మార్పులు కాకుండా, ఇతర మార్పులు చేయలేదు. ఎలంట్రా సెడాన్ అనేక ఫీచర్లు మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

MOST READ:టికెట్ బుకింగ్స్ రద్దు చేసిన ఇండియన్ రైల్వే, ఎందుకో తెలుసా ?

ఎలంట్రా ‘ఎస్’ వేరియంట్ నిలిపివేసిన హ్యుందాయ్, ఎందుకో తెలుసా

భారతదేశంలోని హ్యుందాయ్ ఎలంట్రా ఐదు కలర్ ఎంపికలో అందించబడుతుంది. అవి ఫైరీ రెడ్, పోలార్ వైట్, మెరీనా బ్లూ, టైఫూన్ సిల్వర్ మరియు ఫాంటమ్ బ్లాక్. హ్యుందాయ్ ఎలంట్రా ఇటీవలి నవీనీకరించడం మాత్రమే కాకుండా, కంపెనీ ప్రస్తుతం భారత మార్కెట్లో ఉత్పత్తి, అమ్మకాలు వంటి కార్యకలాపాలను పునఃప్రారంభించే పనిలో ఉంది.

ఎలంట్రా ‘ఎస్’ వేరియంట్ నిలిపివేసిన హ్యుందాయ్, ఎందుకో తెలుసా

హ్యుందాయ్ తమ కార్యకలాపాలను పునఃప్రారంభించిన మొదటి రెండు రోజుల్లోనే తమ మోడళ్ల కోసం 500 బుకింగ్‌లను అందుకున్నట్లు హ్యుందాయ్ ఇటీవల ప్రకటించింది. ఇదే కాలంలో 170 యూనిట్ల అమ్మకాలను కూడా సాధించిందని కంపెనీ ప్రకటించింది.

MOST READ:అద్భుతమైన రూపంలో రానున్న కాంటెస్సా కారు, చూసారా !

Most Read Articles

English summary
Hyundai Elantra ‘S’ Variant Discontinued: Prices For Sedan Now Start At Rs 18.49 Lakh. Read in Telugu.
Story first published: Friday, May 15, 2020, 15:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X