Just In
- 10 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 12 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 13 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 13 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త బిఎస్ 6 హ్యుందాయ్ ఎలంట్రా డీజిల్ : ధర & ఇతర వివరాలు
దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన వాహన తయారీ దారు హ్యుందాయ్ ఇండియా బిఎస్ 6 కంప్లైంట్ డీజిల్‌తో నడిచే ఎలంట్రా సెడాన్‌ను విడుదల చేసింది. కొత్త హ్యుందాయ్ ఎలంట్రా బిఎస్ 6 డీజిల్ ఇంజన్ ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్ (ఓ) అనే రెండు వేరియంట్లలో అందించబడుతుంది. వీటి ప్రారంభ ధర రూ. 18.70 లక్షలతో లభిస్తుంది. అయితే ఇందులోని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 20.65 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంటుంది.

కొత్త హ్యుందాయ్ ఎలంట్రా బిఎస్ 6 డీజిల్ అదే 1.5-లీటర్ సిఆర్డి ఇంజన్ యొక్క నవీకరించబడిన సంస్కరణను ఉపయోగిస్తుంది. ఇది 4000 ఆర్‌పిఎమ్ వద్ద 114 బిహెచ్పి మరియు 1,750 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బేస్ ఎస్ఎక్స్ వేరియంట్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అందుకుంటుంది. కానీ ఎస్ఎక్స్ (ఓ) ట్రిమ్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో వస్తుంది.

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఎండి & సిఇఒ ఎస్ఎస్ కిమ్ మాట్లాడుతూ, హ్యుందాయ్ ఎలంట్రా అనేది హ్యుందాయ్ మోటార్ యొక్క గ్లోబల్ సెడాన్ మరియు స్టాండర్డ్ డిజైన్ యొక్క ఉత్తమమైన నవీనీకరణ. స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్‌గా, హ్యుందాయ్ క్లీనర్ & ఎఫెక్టివ్ టెక్నాలజీలతో ముందుకు సాగుతోంది.
MOST READ:కొత్త ఐ 20 కార్ స్పాట్ టెస్ట్ రీస్టార్ట్ చేసిన హ్యుందాయ్

ఫన్ టు డ్రైవ్ & పవర్ఫుల్ 1.5 ఎల్ యు2 సిఆర్డి డీజిల్ బిఎస్ 6 పవర్ట్రెయిన్లతో పాటు ఎలంట్రాపై కస్టమర్ల ఆనందాన్ని పెంచుతున్నాము. అంతే కాకుండా హ్యుందాయ్ ఎలంట్రాలో ఉన్న పెట్రోల్ బిఎస్ 6 పవర్‌ట్రెయిన్ ఎంపికల కోసం మెరుగైన ఫీచర్స్ అందిస్తుంది.

ఇంజిన్ నవీకరణ కాకుండా, హ్యుందాయ్ ఎలంట్రాలో దాదాపుగా ఎటువంటి మార్పు ఉండదు. ఎగ్జిక్యూటివ్ సెడాన్ దాని రెండు వేరియంట్లలోని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ టైల్లైట్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్లు, స్టైలిష్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఫోల్డబుల్ ఓఆర్‌విఎంలు, ఆపిల్ కార్ప్లేతో పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు బ్లూ లింక్ కనెక్ట్ టెక్నాలజీ వంటివి ఇందులో ఉన్నాయి.
MOST READ:ఈ జాగ్వార్ కారుకి పెట్రోల్ అవరసం లేదు! ఎందుకలా?

హ్యుందాయ్ ఎలంట్రాలో వైర్లెస్ ఛార్జింగ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్‌వ్యూ కెమెరా, ఎబిడి విత్ ఇబిడి, సీట్‌బెల్ట్ రిమైండర్, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి ఇతర ఫీచర్స్ కూడా ఉన్నాయి.

హ్యుందాయ్ ఎలంట్రాకు పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది. ఎలంట్రాలోని పెట్రోల్ యూనిట్ 2.0-లీటర్ ఇంజిన్ రూపంలో వస్తుంది. ఇది బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఇప్పటికే నవీకరించబడింది. పెట్రోల్‌తో నడిచే హ్యుందాయ్ ఎలంట్రా మోడళ్ల ధరలు రూ. 17.60 లక్షల (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయి.
MOST READ:భారత్‌లో డీజిల్ కార్లు కొనసాగిస్తాం: మెర్సిడెస్ బెంజ్

బిఎస్ 6 హ్యుందాయ్ ఎలంట్రా డీజిల్ గురించి డ్రైవ్స్పార్క్ అభిప్రాయం :
హ్యుందాయ్ ఎలంట్రా భారత మార్కెట్లో దక్షిణ కొరియా కార్ల తయారీదారు యొక్క ప్రీమియం సెడాన్ ఆఫర్. హ్యుందాయ్ ఎలంట్రా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. ఎలంట్రా బిఎస్ 6 డీజిల్ భారత మార్కెట్లో స్కోడా ఆక్టావియా మరియు హోండా సివిక్ వంటి వాటికి ప్రత్యర్థిగా కొనసాగుతోంది.