Just In
Don't Miss
- News
బలవంతపు ఏకగ్రీవాలు జరగనివ్వొద్దు .. పంచాయతీ పోరు కోసం టీడీపీ కంట్రోల్ రూమ్ : చంద్రబాబు
- Sports
ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లను తిట్టినోళ్లు దొరకలేదట.!
- Movies
ఆ హీరోలు రిజెక్ట్ చేసిన మల్టీస్టారర్ కథలో విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్.. అసలు మ్యాటర్ ఇదన్నమాట!
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు, హెచ్చరిక సంకేతాలు
- Finance
Budget 2021: 80సీ లిమిట్ పెరుగుతుందా, ఐటీ స్లాబ్స్‌లో మార్పులు?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హ్యుందాయ్ కార్లపై దీపావళి ఆఫర్స్; రూ.1 లక్ష వరకూ తగ్గింపు!
కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్, భారత మార్కెట్లో కొనసాగుతున్న పండుగ సీజన్‌లో కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు ఆకర్షణీయమైన తగ్గింపులు మరియు ప్రయోజనాలను ప్రకటించింది. కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి కంపెనీ గరిష్టంగా రూ .1 లక్ష వరకు ప్రయోజనాలను అందిస్తోంది.

ఈ పండుగ ప్రయోజనాలు, నగదు తగ్గింపులు మరియు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కంపెనీ అందిస్తున్న ఎంపిక చేసిన మోడళ్లపై అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో శాంత్రో, గ్రాండ్ ఐ10, గ్రాండ్ ఐ10 నియోస్, ఎలైట్ ఐ20, ఔరా మరియు ఎలంట్రా మోడళ్లు ఉన్నాయి.

కస్టమర్లు దేశవ్యాప్తంగా ఉన్న హ్యుందాయ్ అధీకృత డీలర్లను సందర్శించడం ద్వారా ఈ ఆఫర్లను పొందవచ్చు. ఇందుకు ప్రత్యామ్నాయంగా, కస్టమర్లు హ్యుంద్యా బ్రాండ్ యొక్క క్లిక్-టు-బై ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి కూడా పొందవచ్చు. నవంబర్ 1 మరియు నవంబర్ 30, 2020 వరకూ ఇవి చెల్లుబాటులో ఉంటాయి. మోడల్ వారీగా లభిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:
MOST READ:రూ. 9 లక్షలకు ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకున్న యువకుడు.. ఇంతకీ ఏంటి ఈ నెంబర్ స్పెషల్

హ్యుందాయ్ శాంత్రో
కంపెనీ నుండి లభిస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్‌తో హ్యుందాయ్ శాంత్రోపై గరిష్టంగా రూ.45,000 వరకు ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇందులో రూ.25,000 వరకు నగదు తగ్గింపుతో పాటు రూ.15,000 వరకూ ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.5 వేల కార్పొరేట్ డిస్కౌంట్‌లు కలిసి ఉన్నాయి.

ప్రస్తుతం మార్కెట్లో హ్యుందాయ్ శాంత్రో పెట్రోల్ మరియు పెట్రోల్-సిఎన్‌జి ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. మార్కెట్లో ఈ హ్యాచ్‌బ్యాక్ ధరలు రూ.4.63 లక్షల నుంచి రూ.6.31 లక్షల మధ్యలో ఉన్నాయి అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ.
MOST READ:ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. మహీంద్రా నుండి స్పెషల్ ఆఫర్స్..

గ్రాండ్ ఐ10
ఈ దీపావళి సీజన్‌లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారును కొనుగోలు చేసే కస్టమర్లు గరిష్టంగా రూ.60,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ.40,000 నగదు తగ్గింపు, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.5,000 ప్రభుత్వ ఉద్యోగి డిస్కౌంట్‌లు కలిసి ఉన్నాయి.

గ్రాండ్ 10 కారును కంపెనీ ఇటీవలే బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేసింది. ఇది కేవలం ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తోంది. ప్రస్తుతం ఈ హ్యాచ్‌బ్యాక్‌లో కేవలం రెండు వేరియంట్లు (మాగ్నా మరియు స్పోర్ట్జ్) మాత్రమే లభిస్తున్నాయి.
MOST READ:భారత్‌లో మినీ జాన్ కూపర్ వర్క్స్ జిపి ఇన్‌స్పైర్డ్ ఎడిషన్ విడుదల, ధర

గ్రాండ్ ఐ10 నియోస్
గ్రాండ్ ఐ10కి సక్సెసర్‌గా వచ్చిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్‌పై కంపెనీ మొత్తంగా రూ.25,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.10,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌లు కలిసి ఉన్నాయి.

ఈ మూడవ తరం ఐ10 హ్యాచ్‌బ్యాక్ బహుళ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. ఇందులో 1.2-లీటర్ డీజిల్ ఇంజన్, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజ్ మరియు ఫ్యాక్టరీతో ఫిట్టెడ్ సిఎన్‌జి యూనిట్‌లు ఉన్నాయి. గ్రాండ్ ఐ 10 నియోస్‌లో శక్తివంతమైన 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది.
MOST READ:లగ్జరీ బైక్ కొన్న సాధారణ యువకుడు.. ఇంతకీ ఎలా కొన్నాడో తెలుసా?

హ్యుందాయ్ ఎలైట్ ఐ20
కొత్త తరం ఐ20 కారు విడుదలతో హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మోడల్ స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు కంపెనీ ఈ మోడల్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఇప్పటికే హ్యుందాయ్ తమ ఇండియన్ వెబ్‌సైట్ నుండి ఈ మోడల్‌ను తొలగించింది. దేశంలో ఇంకా కొందరు డీలర్ల వద్ద పాత తరం ఐ20 కార్ల స్టాక్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 కారును మూడు వేరియంట్లలో అందిస్తున్నారు, వీటన్నింటిపై కంపెనీ రూ.50,000 నగదు తగ్గింపుతో పాటుగా రూ.75,000 వరకు విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇతర ఆఫర్లలో రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.5,000 ప్రభుత్వ ఉద్యోగి డిస్కౌంట్లు ఉన్నాయి.

హ్యుందాయ్ ఔరా
హ్యుందాయ్ ఎక్సెంట్ స్థానాన్ని భర్తీ చేసేందుకు వచ్చిన కొత్త కాంపాక్ట్-సెడాన్ హ్యుందాయ్ ఔరాపై కూడా కంపెనీ ఆఫర్లను ప్రకటించింది. ఈ నెలలో హ్యుందాయ్ ఔరాపై గరిష్టంగా రూ.30,000 ప్రయోజనాలను అందిసోతంది. ఇందులో వేరియంట్‌ను బట్టి రూ.10,000 వరకు నగదు తగ్గింపు, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌లు కలిసి ఉన్నాయి.

హ్యుందాయ్ ఎలంట్రా
హ్యుందాయ్ అందిస్తున్న ప్రీమియ సెడాన్ ఎలంట్రాపై కంపెనీ గరిష్టంగా లక్ష రూపాయల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో వేరియంట్‌ను బట్టి రూ.70,000 వరకు నగదు తగ్గింపు, రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలిసి ఉన్నాయి. మార్కెట్లో హ్యుందాయ్ ఎలంట్రా ధరలు రూ.17.7 లక్షల నుంచి రూ .20.65 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ).

హ్యుందాయ్ ఫెస్టివల్ ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
దేశంలో కొనసాగుతున్న పండుగ సీజన్‌లో ఉత్తేజకరమైన ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రవేశపెట్టడం ద్వారా కొత్త హ్యుందాయ్ కారును కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల కలను నిజం చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆఫర్లకు అదనంగా, కంపెనీ ఈజీ ఫైనాన్స్ పథకాలను కూడా అందిస్తోంది, ఇది వినియోగదారులకు ఈ దీపావళి సమయంలో కొనుగోలు నిర్ణయం తీసుకోవడంలో సహకరిస్తాయి.