హ్యుందాయ్ ఐ10 నియోస్ అన్ని వేరియంట్లపై ధరల పెంపు - వివరాలు

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ ఇటీవేల తమ పాపులర్ గ్రాండ్ ఐ10లో టర్బో జిడిఐ వేరియంట్ 'గ్రాండ్ ఐ10 నియోస్'ను మార్కెట్లో విడుదల చేసింది. స్పోర్ట్జ్, స్పోర్ట్జ్ డ్యూయెల్ టోన్ అనే రెండు వేరియంట్లలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ లభిస్తోంది. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ.7,68,050 (స్పోర్ట్జ్) మరియు రూ.7,73,350 (స్పోర్ట్జ్ డ్యూయెల్) (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.

హ్యుందాయ్ ఐ10 నియోస్ అన్ని వేరియంట్లపై ధరల పెంపు - వివరాలు

అయితే, హ్యుందాయ్ 'గ్రాండ్ ఐ10 నియోస్ టర్బో జిడిఐ' వేరియంట్ మాత్రం రూ.7,70,050 (స్పోర్ట్జ్ వేరియంట్‌లో)లుగా ఉంది. ఇందులో స్పోర్ట్జ్ డ్యూయెల్ టోన్ వేరియంట్‌ను వెబ్‌సైట్ నుంచి తొలగించారు. దీన్ని బట్టి చూస్తుంటే హ్యుందాయ్ ఈ డ్యూయెల్ టోన్ వేరియంట్‌ను డిస్‌కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హ్యుందాయ్ ఐ10 నియోస్ అన్ని వేరియంట్లపై ధరల పెంపు - వివరాలు

ఇంజన్ పరంగా చూస్తే, గ్రాండ్ ఐ10 నియోస్ పెట్రోల్ వెర్షన్‌లో 998సీసీ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 100 బిహెచ్‌పిల శక్తిని, 1500-4000 ఆర్‌పిఎమ్ వద్ద 172 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

MOST READ: హోండా CT125 హంటర్ కబ్‌ ఇండియాలో లాంచ్ అవ్వనుందా.. లేదా..?

హ్యుందాయ్ ఐ10 నియోస్ అన్ని వేరియంట్లపై ధరల పెంపు - వివరాలు

ఇక డీజిల్ వెర్షన్ గ్రాండ్ ఐ10 విషయానికి వస్తే.. గ్రాండ్ ఐ10 నియోస్ డీజిల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.2 లీటర్ బిఎస్6 డీజిల్ ఇంజన్ గరిష్టంగా 74 బిహెచ్‌పిల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇందులో ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ ఐ10 నియోస్ అన్ని వేరియంట్లపై ధరల పెంపు - వివరాలు

కొద్ది నెలల క్రితం హ్యుందాయ్ తమ గ్రాండ్ ఐ10 నియోస్‌లో సిఎన్‌జి వెర్షన్‌ను (మాగ్నా, స్పోర్ట్జ్ వేరియంట్లలో) విడుదల చేసింది. గ్రాండ్ ఐ10 నియోస్ మాగ్నా సిఎన్‌జి వేరియంట్ ధర రూ.6,62,610 మరియు గ్రాండ్ ఐ10 నియోస్ స్పోర్ట్జ్ సిఎన్‌జి వేరియంట్ ధర రూ.7,18,350 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

MOST READ: బిఎస్6 జావా మోటార్‌సైకిళ్లు వచ్చేస్తున్నాయ్.. ఆర్ఈ క్లాసిక్ 350కి గట్టి పోటీ..!

హ్యుందాయ్ ఐ10 నియోస్ అన్ని వేరియంట్లపై ధరల పెంపు - వివరాలు

పెట్రోల్ వెర్షన్ గ్రాండ్ ఐ10 నియోస్‌లో లభించే అన్ని ఫీచర్లు సిఎన్‌జి వెర్షన్లలో కూడా లభిస్తాయి. కేవలం ఇంజన్లలో మాత్రమే మార్పులు ఉంటాయి. ఇందులో 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేలను సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో వైర్‌లెస్ చార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వంటి ఫీచర్లున్నాయి.

హ్యుందాయ్ ఐ10 నియోస్ అన్ని వేరియంట్లపై ధరల పెంపు - వివరాలు

కాగా.. ఇందులో సిఎన్‌జి ఎక్విప్‌మెంట్‌ను చేర్చిన కారణంగా ఈ వేరియంట్లలో కూల్డ్ గ్లవ్ కంపార్ట్‌మెంట్స్, రియర్ అడ్జస్టబల్ హెడ్‌రెస్ట్స్, రియర్ వాషర్ అండ్ వైపర్ వంటి ఫీచర్లు ఉండవు. డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, హై-స్పీడ్ వార్నింగ్, సీట్-బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా వస్తాయి.

MOST READ: సరికొత్త హోండా గ్రాజియా బిఎస్6 స్కూటర్ టీజర్ విడుదల, వివరాలు

హ్యుందాయ్ ఐ10 నియోస్ అన్ని వేరియంట్లపై ధరల పెంపు - వివరాలు

సిఎన్‌జి వెర్షన్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ వేరియంట్లలో బిఎస్6 వెర్షన్ 1.2 లీటర్ కప్పా ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 66 బిహెచ్‌పిల శక్తిని మరియు 95 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ సిఎన్‌జి వేరియంట్లు కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తాయి. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు.

హ్యుందాయ్ ఐ10 నియోస్ అన్ని వేరియంట్లపై ధరల పెంపు - వివరాలు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ధరల పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ప్రీమియం స్టైల్ మరియు ఫీచర్లను ఆఫర్ చేసే బెస్ట్ హ్యాచ్‌బ్యాక్. ఈ సెగ్మెంట్లో ఇది ఫోర్డ్ ఫిగో, టాటా టియాగో, మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది. హ్యుందాయ్ ఐ10పై ఈ స్వల్ప ధరల పెంపు కంపెనీ అమ్మకాలపై పెద్దగా ప్రభావం చూపబోదనిపిస్తోంది.

Most Read Articles

English summary
Earlier this year, Hyundai introduced the Turbo GDi variant with the Grand i10 Nios. The Grand i10 Nios is available in two variants Sportz and Sportz Dual Tone trims for a price of Rs 7,68,050 and Rs 7,73,350 respectively. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X