Just In
- 11 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 13 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 14 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 14 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
7.68 లక్షల ధరతో విడుదలైన హ్యుందాయ్ నియోస్ టుర్భో: ఎందుకింత ధర?
హ్యుందాయ్ మోటార్ ఇండియా మార్కెట్లోకి సరికొత్త హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ వేరియంట్‌ను టుర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లో లాంచ్ చేసింది. ఆల్ న్యూ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ టుర్భో-పెట్రోల్ ప్రారంభ ధర రూ. 7.86 లక్షలు, ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.
నియోస్ టుర్భో వేరియంట్ ఇంత రేటెందుకు, లభించే వేరియంట్లు, ఫీచర్లు, మైలేజ్ మరియు ఫోటోలతో పాటు పూర్తి వివరాల కోసం..

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ లభించే స్పోర్ట్(Sportz) మరియు స్పోర్ట్ డ్యూయల్ టోన్ (Sportz dual-tone) మిడ్-వేరియంట్లలో మాత్రమే టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ లభిస్తోంది. హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్యూవీ నుండి ఈ శక్తివంతమైన ఇంజన్‌ను సేకరించారు.

998సీసీ కెపాసిటీ గల మూడు సిలిండర్ల టుర్భో-పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 100బిహెచ్పి పవర్ మరియు 172ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మరియు కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తోంది. టుర్భో-పెట్రోల్ ఇంజన్ పరిచయంతో గ్రాండ్ ఐ10 నియోస్ ఇప్పుడు అత్యంత శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్ కారుగా నిలిచింది.

హ్యుందాయ్ తమ గ్రాండ్ ఐ10 నియోస్లోని మునుపటి డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌ని యధావిధిగా అందిస్తోంది. కస్టమర్లు ఇప్పుడు ఫైరీ రెడ్/బ్లాక్ మరియు పోలార్ వైట్/బ్లాక్ డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌లో గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్‌ను ఎంచుకోవచ్చు. దీంతో పాటు అక్వా టీల్ మరియు పోలార్ వైట్ సింగల్ టోన్ రంగుల్లో కూడా లభిస్తోంది.

ఈ టుర్భో-ఛార్జ్డ్ వేరియంట్ గ్రాండ్ ఐ10 నియోస్ వేరియంట్ లైనప్‌లోని బేసిక్ వేరియంట్ స్పోర్ట్ (Sportz) మరియు టాప్ ఎండ్ వేరియంట్ ఆస్టా (Asta) మధ్య స్థానాన్ని భర్తీ చేస్తుంది. గ్రాండ్ ఐ10 నియోస్ స్పోర్ట్ వేరియంట్ టీ-జీడీఐ ఇంజన్ ఆప్షన్లో కూడా లభిస్తోంది. ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా ఎన్నో మార్పులు జరిగాయి.

పవర్ఫుల్ 1.0-లీటర్ టుర్భో-పెట్రోల్ వేరియంట్లో 15-ఇంచుల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఆల్-బ్లాక్ ఇంటీరియర్స్, ఇంటీరియర్‌లో అక్కడక్కడా లైట్ కలర్ హెలైట్స్, లెథర్ ఫినిషింగ్ గల స్టీరింగ్ వీల్, వైర్-లెస్ ఫోన్ ఛార్జింగ్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ మరియు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ వంటి అరుదైన ఫీచర్లు వచ్చాయి.

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ లభించే ఇతర వేరియంట్లతో పోల్చుకుంటే టుర్బో-పెట్రోల్ వేరియంట్ అత్యంత శక్తివంతమైనది మరియు స్పోర్టివ్ ఫీలింగ్ ఇచ్చే హ్యాచ్‌బ్యాక్ కారు. అందుకే ధర కూడా ఇతర వేరియంట్ల కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. పవర్, పర్ఫామెన్స్, ఫీచర్లు మరియు స్పోర్టివ్ ఫీల్ దీని సొంతం. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మార్కెట్లో ఉన్న ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ ఫ్రీస్టైల్, టాటా టియాగో మరియు మారుతి స్విఫ్ట్ మోడళ్లకు సరాసరి పోటీనిస్తుంది.