నమ్మశక్యంగాని ఫీచర్లతో ఐ20 ఇంటీరియర్ రివీల్ చేసిన హ్యుందాయ్

భారతదేశపు రెండవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ 2020 హ్యుందాయ్ 20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు విడుదలు ఏర్పాట్లు ప్రారంభించింది. మార్చి నెలలో జరగబోయే జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించనున్న 2020 హ్యుందాయ్ 20 కారు ఇంటీరియర్‌ను రివీల్ చేశారు.

నమ్మశక్యంగాని ఫీచర్లతో వస్తున్న కొత్త తరం హ్యుందాయ్ 20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గురించి పూర్తి వివరాలు..

నమ్మశక్యంగాని ఫీచర్లతో ఐ20 ఇంటీరియర్ రివీల్ చేసిన హ్యుందాయ్

సరికొత్త హ్యుందాయ్ 20 ఎక్ట్సీరియర్ అత్యాధుని షార్ప్ డిజైన్ ఎలిమెంట్స్‌తో కొత్త లుక్‌లో వచ్చింది. ఇంటీరయర్‌లో 10.25-ఇంచుల అతి పెద్ద ఫ్లోటింగ్ టైప్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వచ్చింది. ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను ఇది సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు ముందు వైపున ఫాక్స్ ఏసీ వెంట్స్ మరియు 4-స్పోక్ స్టీరింగ్ వీల్ కలదు.

నమ్మశక్యంగాని ఫీచర్లతో ఐ20 ఇంటీరియర్ రివీల్ చేసిన హ్యుందాయ్

హ్యుందాయ్ ప్రత్యేకంగా అభివృద్ది చేసిన హ్యుందాయ్ బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా వచ్చింది. క్రూయిజ్ కంట్రోల్, బాస్ ఆడియో సిస్టమ్, వైర్-లెస్ ఫోన్ ఛార్జింగ్, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్, కీలెస్ ఎంట్రీ మరియు పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్లు వచ్చాయి.

నమ్మశక్యంగాని ఫీచర్లతో ఐ20 ఇంటీరియర్ రివీల్ చేసిన హ్యుందాయ్

సరికొత్త 2020 హ్యుందాయ్ 20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ రెండు రకాల ఇంజన్ ఆప్షన్లలో లభించనుంది. ఇందులోని 1.0-లీటర్ జీడీఐ డీజల్ 98బిహెచ్‌పి పవర్ మరియు 118బిహెచ్‌పి పవర్ అనే రెండు విభిన్న పవర్‌ ఔట్‌పుట్‌లో లభిస్తుంది.

నమ్మశక్యంగాని ఫీచర్లతో ఐ20 ఇంటీరియర్ రివీల్ చేసిన హ్యుందాయ్

రెండవ ఇంజన్ ఆప్షన్ విషయానికి వస్తే, 1.2-లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్ అందించారు. ఇది సుమారుగా 83బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుండగా, టీ-జీడీఐ డీజల్ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7-స్పీడ్ డైరక్ట్ క్లచ్ ట్రాన్స్‌మిషన్(DCT) గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభించనుంది.

నమ్మశక్యంగాని ఫీచర్లతో ఐ20 ఇంటీరియర్ రివీల్ చేసిన హ్యుందాయ్

2020 హ్యుందాయ్ 20లో భద్రతకు కూడా పెద్దపీట వేశారు, ఇందులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, లేన్ కీప్ అసిస్ట్, డ్రైవ్ అటెన్షన్ వార్నింగ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-థెఫ్ట్ అలారమ్, సీట్ బెల్ట్ వార్నింగ్ అలారమ్, క్రాష్ మరియు పార్కింగ్ సెన్సార్లు ఇంకా ఎన్నో ఉన్నాయి.

నమ్మశక్యంగాని ఫీచర్లతో ఐ20 ఇంటీరియర్ రివీల్ చేసిన హ్యుందాయ్

హ్యుందాయ్ ఇండియా ఎంతోకాలంగా 2020 20 కారును ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తూనే ఉంది. బహుశా దీనిని ఏడాది జూన్ లేదా జూలై నాటికల్లా మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం ఉంది. హ్యుందాయ్ 20 ప్రస్తుత మోడల్ ధరల శ్రేణి రూ. 5.60 లక్షల నుండి రూ. 9.41 లక్షల మధ్య ఉంది. 2020 హ్యుందాయ్ 20 సుమారుగా రూ. 6.60 లక్షల నుండి రూ. 10.41 మధ్య ఉండవచ్చు. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఇవ్వబడ్డాయి.

నమ్మశక్యంగాని ఫీచర్లతో ఐ20 ఇంటీరియర్ రివీల్ చేసిన హ్యుందాయ్

హ్యుందాయ్ మోటార్స్‌కు సంభందించిన వార్తల్లో, హ్యుందాయ్ డీలర్లు అతి త్వరలో విడుదల కాబోయే 2020 టుసాన్ మోడల్ మీద అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించారు. టుసాన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

నమ్మశక్యంగాని ఫీచర్లతో ఐ20 ఇంటీరియర్ రివీల్ చేసిన హ్యుందాయ్

2020 హ్యుందాయ్ టుసాన్ ఫేస్‌లిఫ్ట్‌లో ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా ఫీచర్లతో పాటు ఎన్నో సేఫ్టీ అంశాలను కూడా జోడించారు. దీనిని పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఛాయిస్‌లో ఎంచుకోవచ్చు.

నమ్మశక్యంగాని ఫీచర్లతో ఐ20 ఇంటీరియర్ రివీల్ చేసిన హ్యుందాయ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యుందాయ్ 20 భారతదేశపు తొలి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారుగా మార్కెట్లోకి వచ్చింది. అయితే, తర్వాత కాలంలో మారుతి తీసుకొచ్చిన బాలెనో హ్యుందాయ్ 20 స్థానాన్ని ఆక్రమించింది. పోటీని ఎదుర్కొని మార్కెట్లో నిలబడేందుకు భారీ మార్పుచేర్పులతో సరికొత్త 2020 హ్యుందాయ్ 20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును ఇండియాతో పాటు ప్రపంచ మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని ఆవిష్కరించింది. సేల్స్ పరంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి మరి..!

Most Read Articles

English summary
Hyundai i20 2020 Models Interiors Revealed Ahead Of India Launch: Details And Expected Features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X