పెరిగిన హ్యుందాయ్ వెన్యూ ధరలు, మారిన వేరియంట్లు - వివరాలు

హ్యుందాయ్ మోటార్ ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. హ్యుందాయ్ వెన్యూలో కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను ధరలు రూ.5,000 నుంచి రూ.12,000 మేర పెరుగుతాయి. ధరల పెరుగుదలతో పాటుగా కంపెనీ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలోని కొన్ని వేరియంట్‌లను కూడా తొలగించి వేసింది.

పెరిగిన హ్యుందాయ్ వెన్యూ ధరలు, మారిన వేరియంట్లు - వివరాలు

ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన హ్యుందాయ్ వెన్యూ 1.2 ఇ కనీసం రూ.5,000 ధరల పెంపును అందుకుంది. తాజా పెంపు తర్వాత ఈ వేరియంట్ ప్రారంభ ధర రూ.6.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

పెరిగిన హ్యుందాయ్ వెన్యూ ధరలు, మారిన వేరియంట్లు - వివరాలు

కాగా, ఈ మోడల్‌లోని మెజారిటీ వేరియంట్ల ధరల రూ.7,000 మేర పెరిగాయి. ఈ జాబితాలో పెట్రోల్ వేరియంట్స్ ఎస్, ఎస్+, టి-జిడిఐ ఎస్, టి-జిడిఐ డిసిటి ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ స్పోర్ట్, ఎస్ఎక్స్ (ఓ), ఎస్ఎక్స్ (ఓ) స్పోర్ట్, మరియు టి-జిడిఐ డిసిటి ఎస్ఎక్స్ + స్పోర్ట్‌లు ఉన్నాయి. ధరల పెరుగుదల పొందిన డీజిల్ వేరియంట్లలో ఇ, ఎస్, ఎస్ఎక్స్ (ఓ)లు ఉన్నాయి.

MOST READ:ఇది నీటితో నడిచే పోప్‌మొబైల్.. ఒకేసారి 500 కిలోమీటర్ల దూరం వెళ్లొచ్చు..

పెరిగిన హ్యుందాయ్ వెన్యూ ధరలు, మారిన వేరియంట్లు - వివరాలు

హ్యుందాయ్ వెన్యూ టి-జిడిఐ డిసిటి ఎస్ఎక్స్+ వేరియంట్ ధర అత్యధికంగా రూ.12,000 మేర పెరిగింది. ధరల పెరుగుదల తరువాత, ప్రస్తుతం మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ రూ.6.74 లక్షల నుండి రూ.11.65 లక్షల మధ్య రిటైల్ అవుతుంది (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

పెరిగిన హ్యుందాయ్ వెన్యూ ధరలు, మారిన వేరియంట్లు - వివరాలు

హ్యుందాయ్ వెన్యూ ఈ విభాగంలో నేరుగా కియా సోనెట్‌తో పోటీ పడుతుంది. హ్యుందాయ్ వెన్యూ కొత్త ధరలను కియా సోనెట్‌తో పోల్చి చూస్తే, వెన్యూ యొక్క బేస్ మోడల్ ఇప్పుడు కియా సోనెట్ కంటే రూ. 4,000 అధికంగా ఉంటుంది.

MOST READ:8 నెలల క్రితం పోయింది.. మళ్లీ ఇప్పుడు దొరికింది.. థ్యాంక్యూ పోలీస్..

పెరిగిన హ్యుందాయ్ వెన్యూ ధరలు, మారిన వేరియంట్లు - వివరాలు

మరోవైపు, కియా సోనెట్ మరియు హ్యుందాయ్ వెన్యూ టాప్-ఎండ్ మోడళ్ల ధరలను పరిశీలిస్తే, సోనెట్ టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.12.89 లక్షలుగా ఉంటే వెన్యూ టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.11.65 లక్షలుగా ఉంది. దీన్నిబట్టి చూస్తే హ్యుందాయ్ వెన్యూ టాప్-ఎండ్ వేరియంట్ కన్నా కియా సోనెట్ టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.1.24 లక్షలు అధికంగా ఉంది.

పెరిగిన హ్యుందాయ్ వెన్యూ ధరలు, మారిన వేరియంట్లు - వివరాలు

హ్యుందాయ్ ఇండియా తమ వెన్యూ ధరలను పెంచడంతో పాటుగా, ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీ లైనప్‌లో ఇదివరకు ఉన్న వేరియంట్లలో మార్పులు చేసింది. వెన్యూ ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (ఓ) డ్యూయల్-టోన్ వేరియంట్లను కంపెనీ ఈ ప్రోడక్ట్ లైనప్ నుండి తొలగించింది. అంతకుముందు, వెన్యూ మొత్తం 24 రకాల వేరియంట్లలో లభించేంది. ప్రస్తుతం దీని సంఖ్య 19కి తగ్గించబడింది.

MOST READ:గుడ్ న్యూస్.. త్వరలో రోడ్డుపైకి రానున్న కొత్త హోండా హైనెస్ సిబి350 బైక్

పెరిగిన హ్యుందాయ్ వెన్యూ ధరలు, మారిన వేరియంట్లు - వివరాలు

భారత మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ మూడు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. అవి: 82 బిహెచ్‌పి మరియు 115 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది 1.2-లీటర్ ఇంజన్, 118 బిహెచ్‌పి మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.0-లీటర్ త్రీ సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 98 బిహెచ్‌పి మరియు 240 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్.

పెరిగిన హ్యుందాయ్ వెన్యూ ధరలు, మారిన వేరియంట్లు - వివరాలు

హ్యుందాయ్ వెన్యూ కారులోని కొన్ని హైలైట్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు బ్రాండ్ యొక్క 'బ్లూలింక్' కనెక్టింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేసే ఇచ్చే ఎనిమిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగులు, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, డిజిటల్ గైడ్‌లైన్స్‌తో కూడిన రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు ఈబిడితో కూడిన ఏబిఎస్ వంటి ఫీచర్లున్నాయి.

MOST READ:ఇప్పుడు హీరో స్ప్లెండర్ ప్లస్‌ను మీకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోండి..

పెరిగిన హ్యుందాయ్ వెన్యూ ధరలు, మారిన వేరియంట్లు - వివరాలు

హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ సెగ్మెంట్లో కొత్తగా వచ్చిన కియా సోనెట్, హోండా డబ్ల్యూఆర్-వి, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యువి300, మారుతి విటారా బ్రెజ్జా మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. మరోవైపు ఈ విభాగంలో త్వరలో విడుదల కానున్న నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ వంటి మోడళ్లు కూడా హ్యుందాయ్ వెన్యూ గట్టి పోటీ ఇస్తుంది.

పెరిగిన హ్యుందాయ్ వెన్యూ ధరలు, మారిన వేరియంట్లు - వివరాలు

హ్యుందాయ్ వెన్యూ ధరల పెరుగుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హ్యుందాయ్ ఇండియా దేశీయ మార్కెట్లోని తమ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన వెన్యూ ధరలను స్వల్పంగా పెంచింది. అంతేకాకుండా, ఇందులో తక్కువగా అమ్ముడుపోతున్న ఐదు వేరియంట్లను కంపెనీ తమ వేరియంట్ లైనప్ నుండి తొలగించింది. ఈ ధరల పెరుగుదల స్వల్పమే కాబట్టి, ఇది ఈ మోడల్ అమ్మకాలను పెద్దగా ప్రభావితం చేయబోదనేది మా అభిప్రాయం.

Most Read Articles

English summary
Hyundai India has increased the prices of the Venue compact-SUV in the Indian market. The Hyundai Venue price increase ranges between Rs 5000 to Rs 12,000 depending on the variant. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X