హ్యుందాయ్ క్రెటాలో కొత్త బేస్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

హ్యుందాయ్ ఇండియా, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ "క్రెటా" లో కంపెనీ ఓ కొత్త బేస్ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. "హ్యుందాయ్ క్రెటా ఈ" అని పిలిచే కొత్త పెట్రోల్ వేరియంట్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. మార్కెట్లో ఈ మోడల్ ధర రూ.9.81 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

హ్యుందాయ్ క్రెటాలో కొత్త బేస్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఇప్పటి వరకూ "క్రెటా ఈ" వేరియంట్ కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభించేంది, ఇప్పుడు ఇందులో పెట్రోల్ వేరియంట్ కూడా అందుబాటులోకి వచ్చింది. 'హ్యుందాయ్ క్రెటా ఈ' వేరియంట్ బేసిక్ ఫీచర్లతో లభిస్తుంది. ఇందులో మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్, డ్యూయెల్-టోన్ ఇంటీరియర్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటాలో కొత్త బేస్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఇంకా ఇందులో డ్రైవర్ మరియు ప్యాసింజర్ సైడ్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, లేన్ చేంజింగ్ ఇండికేటర్, డ్యూయెల్ హార్న్, సెంట్రల్ లాకింగ్, డే / నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో లభిస్తాయి.

MOST READ:రోల్స్ రాయిస్ నుంచి రానున్న హైస్పీడ్ ఎలక్ట్రిక్ విమానం ఇదే.. చూసారా !

హ్యుందాయ్ క్రెటాలో కొత్త బేస్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

'హ్యుందాయ్ క్రెటా ఈ' వేరియంట్ కంపెనీ ఇటీవలే అప్‌గ్రేడ్ చేసిన బిఎస్6 పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఇందులో ఆప్షనల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో లేదు.

హ్యుందాయ్ క్రెటాలో కొత్త బేస్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త బేస్ పెట్రోల్ వేరియంట్‌ను విడుదల చేయటంతో పాటుగా కంపెనీ ఈ ఎస్‌యూవీ లైనప్‌లోని ఇతర వేరియంట్ల ధరలను కూడా పెంచింది. పెట్రోల్ ఈఎక్స్ వేరియంట్ ధర అత్యధికంగా రూ.61,900 మేర పెరిగింది. ఇతర డీజిల్ మరియు పెట్రోల్ వేరియంట్‌ల ధరలు ఇప్పుడు రూ.11,900 వరకూ పెరిగాయి.

MOST READ:బిగ్ బ్రేకింగ్ న్యూస్: భారత్‌కు టెస్లా రాకను ఖరారు చేసిన ఎలన్ మస్క్!

హ్యుందాయ్ క్రెటాలో కొత్త బేస్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ధరల మార్పు మరియు కొత్త వేరియంట్‌ను చేర్చిన తరువాత, ప్రస్తుతం 2020 హ్యుందాయ్ క్రెటా ధరలు రూ.9.81 లక్షల నుండి రూ.17.31 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ ఏడాది ఆరంభంలో కొత్త బిఎస్6 హ్యుందాయ్ క్రెటా విడుదలైన తర్వాత, ఈ మోడల్ ధరలు పెరగడం ఇదే మొదటిసారి.

హ్యుందాయ్ క్రెటాలో కొత్త బేస్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త హ్యుందాయ్ క్రెటా మూడు ఇంజన్ మరియు ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో లభిస్తోంది. అవి: 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు మరియు 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇందులో రెండు 1.5 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లను సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో పెట్రోల్‌ వెర్షన్లు సిక్స్-స్పీడ్ ఐవిటి మరియు డీజిల్ వెర్షన్లు సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌లతో లభిస్తాయి.

MOST READ:మహీంద్రా థార్ కన్వర్టిబల్‌ను చూశారా? - ధర, వివరాలు

హ్యుందాయ్ క్రెటాలో కొత్త బేస్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

టాప్-ఎండ్ వేరియంట్లలో 1.4 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను అందిస్తున్నారు. ఈ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 139 బిహెచ్‌పి పవర్‌ను మరియు 242 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ క్రెటాలో కొత్త బేస్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలోని ఇతర వేరియంట్‌లలో ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, డ్యూయెల్-టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ మరియు రెండు చివర్లలో ఫాక్స్ స్కఫ్ ప్లేట్లు మొదలైనవి ఉన్నాయి.

MOST READ:త్వరపడండి.. హోండా కార్లపై ఆకర్షనీయమైన ఆక్టోబర్ నెల ఆఫర్లు!

హ్యుందాయ్ క్రెటాలో కొత్త బేస్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఇంటీరియర్స్‌లో డి-కట్ స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్, 7 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హ్యుందాయ్ లేటెస్ట్ బ్లూ-లింక్ కనెక్టివిటీ టెక్నాలజీ, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో మొదలైనవి ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటాలో కొత్త బేస్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

మునుపటి నివేదికల ప్రకారం, దేశం కఠినమైన బిఎస్6 ఉద్గార నిబంధనలకు మారిన తరువాత కూడా డీజిల్ కార్లకు డిమాండ్ అధికంగానే ఉంది. ఈ నేపథ్యంలో, డిసిటి గేర్‌బాక్స్‌కు అనుసంధానించబడిన టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో కూడిన క్రెటా ఎస్‌యూవీని కూడా కంపెనీ అందిస్తోంది, ఇది మిడ్-సైజ్ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకునే ఔత్సాహికులను లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టబడినది.

హ్యుందాయ్ క్రెటాలో కొత్త బేస్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

హ్యుందాయ్ క్రెటా బేస్ పెట్రోల్ వేరియంట్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హ్యుందాయ్ భారత మార్కెట్లో తన అన్ని వేరియంట్ల ధరలను పెంచింది. అయితే, ప్రారంభ వేరియంట్ ధరను రూ.10 లక్షల మార్క్ కంటే తక్కువగా ఉంచడానికి, కంపెనీ తమ క్రెటా ఎస్‌యూవీలో కొత్త బేస్ వేరియంట్‌ను ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తోంది. హ్యుందాయ్ క్రెటా భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన మిడ్-సైజ్ ఎస్‌యూవీలలో ఒకటిగా కొనసాగుతోంది.

Most Read Articles

English summary
Hyundai India has launched a new base variant of the Creta Petrol called E. The new Creta petrol E variant is priced at Rs 9.81 lakh (ex-showroom, Delhi). Earlier the E variant was only available with diesel engine option. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X