ఎలంట్రా ఎన్ లైన్ సెడాన్ ఆవిష్కరించిన హ్యుందాయ్

ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ తన కొత్త ఎలంట్రా ఎన్ లైన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇది కొత్త హ్యుందాయ్ ఎలంట్రా ఎన్ లైన్ పెర్ఫార్మెన్స్ మోడల్. హ్యుందాయ్ ఎలంట్రా ఎన్ లైన్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఎలంట్రా ఎన్ లైన్ సెడాన్ ఆవిష్కరించిన హ్యుందాయ్

ఈ కొత్త హ్యుందాయ్ ఎలంట్రా ఎన్ లైన్ కారులో 1.6-లీటర్ టర్బోచార్జ్డ్ జిడిఐ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 201 బిహెచ్‌పి శక్తిని మరియు 264.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

ఎలంట్రా ఎన్ లైన్ సెడాన్ ఆవిష్కరించిన హ్యుందాయ్

ఈ కొత్త హ్యుందాయ్ ఎలంట్రా ఎన్ లైన్ పెర్ఫార్మెన్స్ మోడల్‌లో 18 అంగుళాల అల్లాయ్ వీల్ అమర్చారు. ఈ కారు ముందు భాగంలో బ్రేక్ రోటర్లు మరియు మల్టీ-లింక్ రియర్ సస్పెన్షన్ ఉన్నాయి. రేసింగ్ తరహా పాడిల్ షిఫ్టింగ్ కోసం ఇది డ్రైవ్ మోడ్ సెలెక్టర్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ కారు యొక్క వెలుపలి భాగం పారామెట్రిక్ డైనమిక్స్ థీమ్‌తో ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంది.

MOST READ:తండ్రికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ గిఫ్ట్ గా ఇచ్చిన కొడుకు [వీడియో]

ఎలంట్రా ఎన్ లైన్ సెడాన్ ఆవిష్కరించిన హ్యుందాయ్

కారు ముందు భాగంలో ఎన్ లైన్ బ్యాడ్జ్‌తో క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్ అమర్చారు. ఇది ఈ కారును మరింత దూకుడుగా కనిపించేవిధంగా చేస్తుంది. ఈ హ్యుందాయ్ ఎలంట్రా ఎన్ లైన్ కారులో ఇంజిన్ కూలింగ్, స్పోర్టియర్ బ్లాక్ సైడ్ స్కర్ట్, బాడీ ప్యానెల్స్‌పై క్రీజులు మరియు ఆకర్షణీయమైన అద్దాలు ఉన్నాయి.

ఎలంట్రా ఎన్ లైన్ సెడాన్ ఆవిష్కరించిన హ్యుందాయ్

ఫాస్ట్‌బ్యాక్ సెడాన్ యొక్క ఎన్ లైన్ వెర్షన్‌లో ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, క్రోమ్ ట్విన్ ఎగ్జాస్ట్ మరియు ఎన్ లైన్ రియర్ డిఫ్యూజర్ ఉన్నాయి.

MOST READ:బ్యాటరీ రహిత ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నెల్

ఎలంట్రా ఎన్ లైన్ సెడాన్ ఆవిష్కరించిన హ్యుందాయ్

సాధారణ హ్యుందాయ్ ఎలంట్రా కారులో 1.5 లీటర్ యు 2 డీజిల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 112 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందించబడుతుంది.

ఎలంట్రా ఎన్ లైన్ సెడాన్ ఆవిష్కరించిన హ్యుందాయ్

హ్యుందాయ్ ఎలంట్రా ఎన్ లైన్ పెర్ఫార్మెన్స్ మోడల్ ఇప్పుడు లేన్ ఫాలోయింగ్ అసిస్ట్ (ఎల్ఎఫ్ఎ), హై బీమ్ అసిస్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్ మరియు డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ వంటి ఫీచర్లతో అమర్చబడింది.

MOST READ:కరోనా లాక్‌డౌన్ లో వసూలు చేసిన జరిమానా ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు

Most Read Articles

English summary
Hyundai Elantra N Line Sedan Unveiled. Read in Telugu.
Story first published: Friday, August 14, 2020, 11:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X