భారీగా పెరిగిన హ్యుందాయ్ శాంట్రో బిఎస్6 ధర

హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త శాంట్రో బిఎస్6 వెర్షన్ మార్కెట్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. హ్యుందాయ్ శాంట్రో బిఎస్6 విడుదలకు ముందే కొత్త ధరలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

భారీగా పెరిగిన హ్యుందాయ్ శాంట్రో బిఎస్6 ధర

కార్‌వాలే వెబ్‌సైట్ ప్రచురించిన కథనం ప్రకారం, అతి త్వరలో విడుదల కానున్న బిఎస్6 వెర్షన్ హ్యుందాయ్ శాంట్రో ప్రారంభ వేరియంట్ ధర రూ. 4.57 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 6.25 లక్షలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న శాంట్రోతో పోలిస్తే ప్రతి వేరియంట్ మీద రూ. 22,000 నుండి రూ. 27,000 ధరలు పెరుగుతున్నట్లు పేర్కొంది.

భారీగా పెరిగిన హ్యుందాయ్ శాంట్రో బిఎస్6 ధర

హ్యందాయ్ శాంట్రో బిఎస్6లోని పెట్రోల్ వేరియంట్ల మీదే ధరల పెంపు ఉంటుంది, సీఎన్జీ వేరియంట్ల మీద ఎలాంటి ధరల పెంపు ఉండదని కొన్ని రిపోర్ట్స్ చెపుతున్నాయి.

భారీగా పెరిగిన హ్యుందాయ్ శాంట్రో బిఎస్6 ధర

సరికొత్త హ్యుందాయ్ శాంట్రో కారును ఎత్తైన టాల్ బాయ్ డిజైన్‌లో నిర్మించారు. ఫ్రంట్ డిజైన్‌లో క్యాస్కేడింగ్ గ్రిల్, క్రోమ్ ఎలిమెంట్స్, స్వెప్ట్ బ్యాక్ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, ఫ్రంట్ గ్రిల్ మరియు ఫాగ్ ల్యాంప్ చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ ఫనిషింగ్ మరియు నూతన శైలిలో రూపొందించిన బంపర్ వచ్చాయి.

భారీగా పెరిగిన హ్యుందాయ్ శాంట్రో బిఎస్6 ధర

శాంట్రో రియర్ డిజైన్‌లో విశాలమైన మిర్రర్, ఎత్తైన స్టాప్ ల్యాంప్, రెఫ్లక్టర్లు మరియు ప్లాస్టిక్ సొబగులు గల కొత్త బంపర్. ఇంటీరియర్‌లో బ్లాక్ మరియు బీజీ డ్యూయల్ టోన్ కలర్ ఫినిషింగ్, సిల్వర్ తొడుగులున్న ఏసీ వెంట్స్, గేర్ లీవర్ మరియు స్టీరింగ్ వీల్ ఉన్నాయి. బిఎస్4 శాంట్రోలో ఉన్నటువంటి అవే సేఫ్టీ ఫీచర్లు బిఎస్6 వెర్షన్‌లో కూడా యధావిధిగా వచ్చాయి.

భారీగా పెరిగిన హ్యుందాయ్ శాంట్రో బిఎస్6 ధర

ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్ లింక్ అప్లికేషన్ల సపోర్ట్ గల 7-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న సైడ్ మిర్రర్లు, రియర్ ఏసీ వెంట్స్, స్టీరింగ్ ఆధారిత ఆడియో కంట్రోల్స్, యూఎస్‌బీ పోర్ట్, ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మీద ఎమ్ఐడీ పోర్ట్, మడిపే వెసులుబాటున్న రియర్ సీట్లు, పవర్ విండోస్ మరియు రియర్ వైపర్ వాషర్ వంటి అత్యాధునిక ఫీచర్లున్నాయి.

భారీగా పెరిగిన హ్యుందాయ్ శాంట్రో బిఎస్6 ధర

హ్యుందాయ్ శాంట్రో హ్యాచ్‌బ్యాక్ కారులో సాంకేతికంగా 1.1-లీటర్ కెపాసిటీ గల పెట్రోల్ ఇంజన్ కలదు, 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ గరిష్టంగా 68బిహెచ్‌పి పవర్ మరియు 99ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హ్యుందాయ్ శాంట్రో సీఎన్జీ వేరియంట్లోని ఇదే ఇంజన్ గరిష్టంగా 58బిహెచ్‌పి పవర్ మరియు 84ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

భారీగా పెరిగిన హ్యుందాయ్ శాంట్రో బిఎస్6 ధర

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో గాలి కాలుష్య తారా స్థాయికి చేరడంతో, వాతావరణ కాలుష్య సమస్య ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో డీజల్ మరియు పెట్రోల్ వాహనాలు విడుదల చేసే కాలుష్య కారకాలను తగ్గించే ఉద్దేశ్యంతో అత్యంత కఠినమైన బిఎస్6 నూతన ఉద్గార ప్రమాణాలను అమల్లోకి తెచ్చారు. దీంతో హ్యుందాయ్ తమ శాంట్రో హ్యాచ్‌బ్యాక్ కారును బిఎస్6 వెర్షన్‌లో సిద్దం చేసింది. బిఎస్4 నుంచి బిఎస్6 అప్‌గ్రేడ్ కారణంగా ధరలు కూడా పెరుగుతున్నాయి.

Most Read Articles

English summary
Hyundai Santro BS6 Prices Revealed Ahead Of Launch: Prices Increased By Upto Rs 27,000. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X