మారుతికి గట్టిగా ఇవ్వబోతున్న హ్యుందాయ్

హ్యుందాయ్ మోటార్స్ గత ఏడాది లాంచ్ చేసిన గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్ కారును ఫిబ్రవరిలో ఢిల్లీ వేదికగా జరగబోయే ఆటో ఎక్స్‌పో 2020 వేదికపై పవర్‌ఫుల్ ఇంజన్‌తో లేటెస్ట్ మోడల్‌ను ఆవిష్కరించే ప్లాన్‌లో ఉంది. గ్రాండ్ ఐ10 సేల్స్ పెంచుకోవడంతో పాటు ప్రధాన పోటీగా నిలిచిన మారుతి సుజుకి కంపెనీకి కూడా పరోక్షంగా గట్టి పోటీనిచ్చేలా ప్లాన్ చేస్తోంది.

ఈ మోడల్ గురించి కంప్లీట్ డిటైల్స్ ఇవాళ్టి స్టోరీలో చూద్దాం రండి...

మారుతికి గట్టిగా ఇవ్వబోతున్న హ్యుందాయ్

హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో హ్యుందాయ్ తీసుకొచ్చిన గ్రాండ్ ఐ10 లేటెస్ట్ వెర్షన్ నియోస్ మార్కెట్లో మంచి సక్సెస్ అందుకుంది. సేల్స్ కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. అయితే, కస్టమర్ల అభిరుచి మేరకు మరో కొత్త ఇంజన్ ఆప్షన్‌లో పరిచయం చేసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. తాజాగా వచ్చినఆటోకార్ ఇండియా కథనం మేరకు పవర్‌ఫుల్ 1.0-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది తెలుస్తోంది.

మారుతికి గట్టిగా ఇవ్వబోతున్న హ్యుందాయ్

2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వాహన ప్రదర్శన వేడుకలో హ్యుందాయ్ మోటార్ ఇండియా గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్ కారును ఇదే పవర్‌ఫుల్ ఇంజన్‌తో కొత్త వేరియంట్లో ఆవిష్కరిస్తున్నట్లు కొన్ని రూమర్లు కూడా ఉన్నాయి.

మారుతికి గట్టిగా ఇవ్వబోతున్న హ్యుందాయ్

వాస్తవానికి హ్యుందాయ్ నియోస్ పూర్తి స్థాయిలో కొత్తగా రీడిజైన్ చేసిన మోడల్, చూడటానికి కాస్త శాంట్రో మోడల్‌నే పోలి ఉంటుంది. ఫ్రంట్ డిజైన్‌లో క్యాస్కేడింగ్ గ్రిల్, ఇరువైపులా పలుచటి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్, కంప్లీట్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ వంటివి ఈ హ్యాచ్‌‌బ్యాక్‌కు స్పోర్టివ్ ఫీలింగ్ తీసుకొచ్చాయి.

మారుతికి గట్టిగా ఇవ్వబోతున్న హ్యుందాయ్

హ్యుందాయ్ నియోస్ ఎక్ట్సీరియర్ డిజైన్‌లో స్టైలిష్ షోల్డర్ మరియు క్రీస్ లైన్స్‌తో పాటు 15-ఇంచుల అల్లాయ్ వీల్స్ వచ్చాయి. బ్లాక్ కలర్ ఫినిషింగ్ గల రూఫ్‌టాప్. విశాలమైన బంపర్లు, వీటి మీద రిఫ్లెక్టర్ లైట్లతో పాటు కొన్ని సిల్వర్ కలర్ హైలెట్స్ కూడా ఉన్నాయి.

మారుతికి గట్టిగా ఇవ్వబోతున్న హ్యుందాయ్

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఇంటీరియర్ విషయానికి వస్తే, లోపల చాలా సింపుల్ అండ్ స్టైలిష్ డిజైన్‌తో పాటు పెద్ద కార్ల మాదిరిగా ఎన్నో లేటెస్ట్ ఫీచర్లు వచ్చాయి. అత్యాధునిక క్యాబిన్‌లో బ్లాక్/గ్రే కలర్ ఫినిషింగ్ గల డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, సెంట్రల్ కన్సోల్ మీద అతి పెద్ద ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇరువైపులా పలు కంట్రోల్స్ మరియు బటన్స్ ఉన్నాయి. క్యాబిన్‌లో ప్రీమియం ఫీలింగ్ కల్పిస్తూ చాలా వరకూ సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ వినియోగించారు.

మారుతికి గట్టిగా ఇవ్వబోతున్న హ్యుందాయ్

ఇంజన్ విషయానికి వస్తే, హ్యుందాయ్ నియోస్ హ్యాచ్‌బ్యాక్‌లో అత్యాధునిక పవర్‌ఫుల్ 1.0-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది. హ్యుందాయ్ ఇటీవల విడుదల చేసిన ఆరా కాంపాక్ట్ సెడాన్ కారులో కూడా ఈ ఇంజన్ అందించారు. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో 100బిహెచ్‌పి పవర్ మరియు 172ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఈ ఇంజన్ కేవలం నియోస్ టాప్ ఎండ్ వేరియంట్లలో మాత్రమే అందించే ఛాన్స్ ఉంది.

మారుతికి గట్టిగా ఇవ్వబోతున్న హ్యుందాయ్

ఆటో ఎక్స్‌పోలో ఈ వేరియంట్‌ను పూర్తి స్థాయిలో విడుదల చేస్తే ధరలు కూడా అప్పుడే వెల్లడయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు హ్యుందాయ్ క్రెటా మరియు వెర్నా మోడళ్లను ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ప్రదర్శించే ఛాన్స్ ఉంది.

మారుతికి గట్టిగా ఇవ్వబోతున్న హ్యుందాయ్

సేఫ్టీ విషయానికి వస్తే హ్యుందాయ్ నియోస్ హ్యాచ్‌బ్యాక్ కారులో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, సీట్-బెల్ట్ రిమైండర్ అలర్ట్, హై-స్పీడ్ వార్నింగ్ సిస్టమ్, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్‌తో పాటు పలు ఇతర సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మారుతికి గట్టిగా ఇవ్వబోతున్న హ్యుందాయ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఒకప్పుడు నలుగురు లేదా ఐదు మంది ప్రయాణించేందుకు కారు ఉంటే చాలనుకునేవారు. అయితే ఇప్పుడు మారుతున్న అవసరాలు, టెక్నాలజీ, పోటీ మరియు కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా కార్ల మార్కెట్ పూర్తిగా మారిపోయింది. మార్కెట్లో ఆశించిన సేల్స్‌తో రాణిస్తూ కస్టమర్లు ఆకట్టుకోవాలంటే ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో నూతన అప్‌డేట్స్ తీసుకొస్తూనే ఉండాలి. అందులో భాగంగా స్పోర్టివ్ ఫీల్ అండ్ పర్ఫామెన్స్ కోసం పవర్‌ఫుల్ ఇంజన్ తీసుకురావాలనే ఆలోచనలో ఉంది హ్యుందాయ్. ఇదే నిజమైతే మారుతికి పోటీ మరింత పెరగడం ఖాయం!

Most Read Articles

English summary
Hyundai Grand i10 Nios 1.0-litre Turbo Petrol Model To Be Showcased At The Auto Expo. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X