ఇండియాలో బిఎస్ 6 హ్యుందాయ్ వెన్యూ డీజిల్ రేటెంతో తెలుసా.. !

భారత మార్కెట్లో హ్యుందాయ్ సంస్థ బిఎస్ 6 హ్యుందాయ్ వెన్యూ డీజిల్ వెర్షన్ ని విడుదల చేసింది. ఈ బిఎస్ 6 హ్యుందాయ్ వెన్యూ డీజిల్ బేస్ 'ఇ' స్పెక్ ప్రారంభ ధర రూ. 8.09 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతుంది. అదే విధంగా హ్యుందాయ్ వెన్యూ టాప్ ఎస్ఎక్స్ (ఓ) ట్రిమ్ ధర రూ .11.39 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఇండియాలో బిఎస్ 6 హ్యుందాయ్ వెన్యూ డీజిల్ రేటెంతో తెలుసా.. !

బిఎస్-6 హ్యుందాయ్ వెన్యూ వేరియంట్ ని బట్టి రూ. 20,000 నుంచి రూ. 55,000 వరకు పెరుగుదల ఉంటుంది. హ్యుందాయ్ వెన్యూ టాప్ స్పెక్ ఎస్ఎక్స్ (ఓ) ట్రిమ్ ఇప్పుడు డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌తో వస్తుంది. ఈ హ్యుందాయ్ డ్యూయల్ టోన్ వేరియంట్ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ).

ఇండియాలో బిఎస్ 6 హ్యుందాయ్ వెన్యూ డీజిల్ రేటెంతో తెలుసా.. !

కొత్త హ్యుందాయ్ వెన్యూ బిఎస్ 6 మోడల్ ఇప్పుడు 1.5 లీటర్ డీజిల్ యూనిట్‌తో వస్తుంది. ఇది గతంలో ఉన్న పాత 1.4 లీటర్ ఇంజిన్‌ను భర్తీ చేస్తుంది. ఏదేమైనా 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యువి కొంచెం తక్కువ శక్తి మరియు టార్క్ ఫిగర్స్ ని ఉత్పత్తి చేస్తుంది.

ఇండియాలో బిఎస్ 6 హ్యుందాయ్ వెన్యూ డీజిల్ రేటెంతో తెలుసా.. !

హ్యుందాయ్ వెన్యూ రెండు పెట్రోల్ ఇంజిన్లను కలిగి ఉంటుంది. కానీ ఇవి బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్‌ చేయబడలేదు. కానీ వీటి ధరలను కంపెనీ నివేదికల ప్రకారం గమనించినట్లయితే, హ్యుండై వెన్యూ బిఎస్ 6 కంప్లైంట్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ధర రూ. 6.70 లక్షలు. ఇది దాని బిఎస్-4 వెర్షన్ కంటే దాదాపుగా రూ. 19,000 ఎక్కువగా ఉంటుంది.

ఇండియాలో బిఎస్ 6 హ్యుందాయ్ వెన్యూ డీజిల్ రేటెంతో తెలుసా.. !

అదే విధంగా హ్యుందాయ్ యొక్క 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ధర రూ. 24,000 అధిక ధరను కలిగి దీని ప్రారంభ ధర 8.46 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంది. హ్యుందాయ్ వెన్యూ బిఎస్-6 నవీనీకరణలకు సంబంధించి కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

ఇండియాలో బిఎస్ 6 హ్యుందాయ్ వెన్యూ డీజిల్ రేటెంతో తెలుసా.. !

హ్యుందాయ్ వెన్యూలో బిఎస్ 6 కంప్లైంట్ డీజిల్ ఇంజిన్‌కు తిరిగి వస్తోంది. ఇది ఖచ్చితమైన పవర్ గణాంకాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే ఇది 110 బిహెచ్‌పి పరిధిలో ఉంటుందని ఆశించవచ్చు. ఇది 115 బిహెచ్‌పి మరియు 250 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ఆరు-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడుతుంది. హ్యుందాయ్ వెన్యూ బిఎస్ 6 నవీకరణలు మినహా, ఇతర మార్పులు చేయలేదు.

ఇండియాలో బిఎస్ 6 హ్యుందాయ్ వెన్యూ డీజిల్ రేటెంతో తెలుసా.. !

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యుందాయ్ వెన్యూ ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో బిఎస్-6 వెర్షన్ డీజిల్ వెర్షన్ ని ప్రారంభించింది. దీని ప్రారంభ ధర రూ. 8.09 లక్షలు. ఈ హ్యుందాయ్ వెన్యూ ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన రెండవ కాంపాక్ట్ ఎస్‌యువి. ఇది ఇండియన్ మార్కెట్లో ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మహీంద్రా ఎక్స్‌యువి 300 మరియు టాటా నెక్సాన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Hyundai Venue BS6 Diesel Launched In India At Rs 8.09 Lakh: Borrows Powertrain From Kia Seltos. Read in telugu.
Story first published: Wednesday, February 19, 2020, 18:20 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X