రష్యాలో సందడి చేస్తున్న ఇండియన్ వెర్షన్ హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్

హ్యుందాయ్ సరికొత్త వెర్నా ఫేస్‌లిఫ్ట్ కారును రష్యాలో ఆవిష్కరించింది, ఈ మోడల్ ఈ ఏడాది చివరికల్లా ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ వెర్నాతో పోల్చుకుంటే ఫేస్‍‌‌లిఫ్ట్ వెర్షన్ వెర్నాలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.

రష్యాలో సందడి చేస్తున్న ఇండియన్ వెర్షన్ హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్

గత ఏడాది చైనీస్ మార్కెట్ కోసం హ్యుందాయ్ ప్రవేశపెట్టిన వెర్నా కారు పూర్తిగా మారిపోయినప్పిటికీ, రష్యా మరియు ఇండియన్ మార్కెట్ కోసం మాత్రం ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కీలకమైన మార్పులు జరిగాయి. స్టైలిష్ ఫ్రంట్ లుక్, విశాలమైన బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, అధునాతన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, నూతన ఎయిర్ ఇంటేకర్ మరియు సరికొత్త అల్లాయ్ వీల్స్ వచ్చాయి.

రష్యాలో సందడి చేస్తున్న ఇండియన్ వెర్షన్ హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్

రియర్ డిజైన్‌‌లో రీడిజైన్ చేయబడిన బంపర్, నూతన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, న్యూ గ్రాఫిక్స్, స్పోర్టివ్ ఫాక్స్ డిఫ్యూజర్ వంటి పరిమితమైన ఎక్ట్సీరియర్ మార్పులు జరిగాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే, వెర్నా ఫేస్‌లిఫ్ట్‌లో పూర్తిగా మారిపోయిన అధునాతన డాష్‌బోర్డ్ లేఔట్, మధ్యలో ఏసీ వెంట్స్ మరియు హై క్వాలిటీ మెటీరియల్స్ వచ్చాయి.

రష్యాలో సందడి చేస్తున్న ఇండియన్ వెర్షన్ హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్

ఎంటర్‌టైన్‌‌మెంట్ కోసం ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేసే 8-ఇంచుల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ముందు వరసలో ఎలక్ట్రిక్ పవర్‌తో అడ్జెస్ట్ చేసుకునే సౌకర్యం ఉన్న సీట్లు మరియు నాలుగు స్పీకర్ల ఆడియో సిస్టమ్ ఉంది.

రష్యాలో సందడి చేస్తున్న ఇండియన్ వెర్షన్ హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్

ప్రయాణికుల భద్రతకు పెద్దపీఠ వేసిన హ్యుందాయ్, వెర్నా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ట్రాక్షన్ కంట్రోల్, ఎమర్జెన్సీ కాల్ డివైజ్, ఎత్తును అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డ్రైవర్ సీట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, ఇంకా ఎన్నో సేఫ్టీ ఫీచర్లున్నాయి.

రష్యాలో సందడి చేస్తున్న ఇండియన్ వెర్షన్ హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ వెర్నా 1.4-లీటర్ పెట్రోల్ & డీజల్ మరియు 1.6-లీటర్ పెట్రోల్ & డీజల్ మొత్తం నాలుగు ఇంజన్ ఆప్షన్లలో మ్యాన్యువల్ మరియుఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఛాయిస్‌లో లభిస్తోంది.

ఇందులోని 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ 99బిహెచ్‌పి పవర్ మరియు 132ఎన్ఎమ్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తోంది. అదే విధంగా 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్ 121బిహెచ్‌పి పవర్ మరియు 151ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

రష్యాలో సందడి చేస్తున్న ఇండియన్ వెర్షన్ హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్

డీజల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులోని 1.4-లీటర్ డీజల్ యూనిట్ 89బిహెచ్‌పి-220ఎన్ఎమ్ టార్క్, 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అదే విధంగా 1.6-లీటర్ డీజల్ ఇంజన్ 126బిహెచ్‌‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది, దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఛాయిస్‌లో ఎంచుకోవచ్చు.

రష్యాలో సందడి చేస్తున్న ఇండియన్ వెర్షన్ హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్

తాజాగా అందిన సమాచారం మేరకు, హ్యుందాయ్ ఇండియా తమ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ఎలాంటి కొత్త ఇంజన్ ఆప్షన్స్ పరిచయం చేయడం లేదు, ప్రస్తుతం వెర్నాలో ఉన్న ఇంజన్‌లనే యధావిధిగా అందిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ వెర్నా ధరల శ్రేణి రూ. 8.18 లక్షల నుండి రూ. 14.08 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యుందాయ్ వెర్నా ఒకానొక కాలంలో బెస్ట్ సెల్లింగ్ మిడ్-సైజ్ సెడాన్, అయితే ఆ తర్వాత వచ్చిన పోటీ కారణంగా తన రాజసాన్ని కోల్పోయింది. వెర్నా ఫేస్‌లిఫ్ట్‌తో హ్యుందాయ్ భారీ అంచనాలే పెట్టుకుంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.

Most Read Articles

English summary
Hyundai Verna Facelift Model Unveiled In Russia: India Bound Later This Year. Read in Telugu.
Story first published: Saturday, February 22, 2020, 10:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X