Just In
- 44 min ago
భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..
- 1 hr ago
కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి
- 2 hrs ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
- 2 hrs ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
Don't Miss
- News
పెళ్లికి పెద్దల ‘నో’: జగిత్యాలలో యువతి, దుబాయ్‌లో యువకుడు బలవన్మరణం
- Finance
మరో'సారీ': యాక్సెంచర్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ నెంబర్ వన్, TCS ఆనందం కాసేపు
- Sports
ఆసీస్ పర్యటనలో నా విజయ రహస్యం ఇదే: మహ్మద్ సిరాజ్
- Lifestyle
తమకు కాబోయే వారిలో ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఏమి కోరుకుంటారో తెలుసా...
- Movies
30 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ అన్నయ్యలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎక్సెంట్ డిస్కంటిన్యూ; అయినా ఈ మోడల్ని మీరు కొనొచ్చు, ఎలా అంటే..
కొరియా కార్ బ్రాండ్ హ్యుందాయ్ ఇప్పటి వరకూ భారత మార్కెట్లో విక్రయించిన తమ పాపులర్ కాంపాక్ట్ సెడాన్ "హ్యుందాయ్ ఎక్సెంట్"ను కంపెనీ డిస్కంటిన్యూ చేసింది. ఎక్సెంట్ స్థానాన్ని రీప్లేస్ చేస్తూ హ్యుందాయ్ ఈ ఏడాది జనవరిలో ఔరా అనే కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. ఔరా రాకతో ఎక్సెంట్ అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి.

ప్రస్తుతం హ్యుందాయ్ ఎక్సెంట్ ఉత్పత్తి దశ ముగిసింది. హ్యుందాయ్ ఇండియా వెబ్సైట్ నుండి కూడా ఈ మోడల్‌ను తొలగించారు. హ్యుందాయ్ డీలర్లు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. దాదాపు ఆరు నెలల నుండి తమకు ఎలాంటి ఎక్సెంట్ వాహనాల స్టాక్ రాలేదని డీలర్లు చెబుతున్నారు.

హ్యుందాయ్ తొలిసారిగా 2014లో ఎక్సెంట్ కారును ప్రవేశపెట్టింది. అప్పట్లో డీసెంట్ ఫీచర్లతో వచ్చిన ఈ కాంపాక్ట్ సెడాన్ ఈ విభాగంలోనే అగ్రగామిగా కొనసాగింది. ఆ తర్వాతి కాలంలో హ్యుందాయ్ తమ ఎక్సెంట్‌లో ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేసింది. అయితే, అప్పటికే ఈ విభాగంలో పెరిగిన పోటీ కారణంగా ఎక్సెంట్ మార్కెట్లో నిలదొక్కుకోలేకపోయింది.
MOST READ:లగ్జరీ బిఎమ్‌డబ్ల్యూ కె 1600 జిటి బైక్‌పై కనిపించిన సద్గురు జగ్గీ వాసుదేవ్

హ్యుందాయ్ ఎక్సెంట్‌ను ప్యాసింజర్ కార్ విభాగంలో కంపెనీ డిస్కంటిన్యూ చేసినప్పటికీ, ఈ కారును టాక్సీ విభాగంలో కంపెనీ ఇంకా అందుబాటులోనే ఉంచింది. హ్యుందాయ్ ఎక్సెంట్ ప్రైమ్ పేరుతో దీనిని ఫ్లీట్ ఆపరేటర్ల కోసం అందుబాటులో ఉంచారు. టాక్సీ విభాగంలో ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తోంది. ఇందులో సిఎన్జి ఫ్యూయెల్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

ఈ కారులోని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 82 బిహెచ్పి శక్తిని, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 114 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. గతంలో ఈ కారును 1.2 లీటర్ డీజిల్ ఇంజన్‌తో కూడా ఆఫర్ చేశారు. ఈ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 74 బిహెచ్పి శక్తిని, 190 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేసేంది. బిఎస్6 నిబంధనల తర్వాత ఈ ఇంజన్‌ను నిలిపివేశారు. ఈ రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడ్డాయి.
MOST READ:స్కోడా కంపెనీకి భారీ జరిమానా విధించిన వినియోగదారుల కోర్టు.. ఎందుకో తెలుసా?

హ్యుందాయ్ ఎక్సెంట్ ప్రైమ్ టాక్సీ వెర్షన్ ఎలక్ట్రానిక్ స్పీడ్ లిమిటర్‌తో వస్తుంది. ఈ కారు వేగాన్ని గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్లకు పరిమితం చేశారు. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మోడల్‌ను ఆధారంగా చేసుకొని ఎక్సెంట్ కారును తయారు చేశారు. అయితే, ఆసక్తికరంగా గ్రాండ్ ఐ10 మోడల్ అమ్మకాలను మాత్రం కంపెనీ ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఈ మోడల్ అమ్మకాలు స్థిరంగానే సాగుతున్నాయి.

ప్రస్తుతం మార్కెట్లో గ్రాండ్ ఐ10 మరియు గ్రాండ్ ఐ10 నియోస్ అనే రెండు రకాల హ్యాచ్‌బ్యాక్‌లు అమ్మకానికి ఉన్నాయి. గ్రాండ్ ఐ10 ప్లాట్‌ఫామ్‌పై ఎక్సెంట్ కారును మరియు గ్రాండ్ ఐ10 నియోస్ ప్లాట్‌ఫామ్‌పై ఔరా కారును తయారు చేశారు.
MOST READ:68 ఏళ్ల వయసులో అందరిని ఆశ్చర్యపరిచిన వృద్ధ మహిళ.. ఇంతకీ ఏం చేసిందో తెలుసా?

సబ్-4 మీటర్ సెడాన్ కేటగిరీలో హ్యుందాయ్ కారు కోసం చూస్తున్న కస్టమర్లకు ప్రస్తుతం ఔరా ఒక్కటే ఆప్షన్‌గా ఉంటుంది. ఈ కారు మూడు ఇంజన్ ఆప్షన్లు మరియు రెండు గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఔరా అమ్మకాలు కూడా హ్యుందాయ్ ఆశించిన రీతిలో సాగటం లేదు. అందుకే కంపెనీ ఈ మోడల్‌పై ఎప్పటికప్పుడు డిస్కౌంట్లను అందిస్తూనే ఉంది.

హ్యుందాయ్ ఎక్సెంట్ మోడల్ డిస్కంటిన్యూపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
హ్యుందాయ్ ఎక్సెంట్‌ను పూర్తిగా నిలిపివేయటం గురించి కంపెనీ ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలదు. అయితే, కంపెనీ వెబ్సైట్ నుండి మాత్రం ఈ ఉత్పత్తిని తొలగించి వేసింది. ప్రస్తుతం హ్యుందాయ్ ఇండియా అధికారిక వెబ్సైట్లో ఎక్సెంట్ ప్రైమ్ ఫ్లీట్ ఆపరేటర్ విభాగంలో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.
MOST READ:కొత్త రైడింగ్ జాకెట్స్ లాంచ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్, వీటి రేటెంతో తెలుసా ?