ఆడి క్యూ 8 ఎస్‌యూవీని మొదటిసారి డ్రైవింగ్ చేసిన విరాట్ కోహ్లీ!

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి లగ్జరీ కార్లంటే ఇష్టమని మనం ఇది వరకే తెలుసుకున్నాం. మార్కెట్లోకి వచ్చిన చాలా రకాల లగ్జరీ కార్లను తన సొంతం చేసుకుంటూ ఉంటాడు. ఈ విధంగా కొనుగోలు చేసి కోహ్లీ కార్ గ్యారేజ్ ని తయారు చేసుకున్నాడు. అదే విధంగా ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఆడి క్యూ 8 ఎస్‌యూవీని తన సొంతం చేసుకున్నట్లు మనకు తెలుస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

ఆడి క్యూ 8 ఎస్‌యూవీని మొదటిసారి డ్రైవింగ్ చేసిన విరాట్ కోహ్లీ!

జర్మన్ కార్ల తయారీ సంస్థ అయిన ఆడి సరికొత్త ఆడి క్యూ 8 క్రాస్ఓవర్ ఎస్‌యూవీని బుధవారం లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసిన తర్వాత ఈ కారుని సొంతం చేసుకున్న తొలి భారతీయుడు విరాట్ కోహ్లీ.

ఆడి క్యూ 8 ఎస్‌యూవీని మొదటిసారి డ్రైవింగ్ చేసిన విరాట్ కోహ్లీ!

ఆడి క్యూ 8 ఎస్‌యూవీని సొంతం చేసుకున్న కోహ్లీ రాజ్‌కోట్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌కు బయలుదేరిన కోహ్లీ తన ఆడి క్యూ 8 ని విమానాశ్రయానికి నడిపినట్లు గుర్తించారు. విమానాశ్రయంలో ఈ కారు నడిపిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది.

ఆడి క్యూ 8 ఎస్‌యూవీని మొదటిసారి డ్రైవింగ్ చేసిన విరాట్ కోహ్లీ!

ఆడి క్యూ 8 ధర భారతదేశంలో రూ. 1.33 కోట్లు. ఇది అనేక అనుకూలీకరణ ఎంపికలతో కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఆడి ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు వర్చువల్ రియాలిటీ ఎలిమెంట్లను ప్రవేశపెట్టింది.

ఆడి క్యూ 8 ఎస్‌యూవీని మొదటిసారి డ్రైవింగ్ చేసిన విరాట్ కోహ్లీ!

జర్మన్ కార్ల తయారీ సంస్థ ఆడి నుండి సరికొత్త ఎస్‌యూవీ వోక్స్‌వ్యాగన్ గ్రూప్ యొక్క ట్రేడ్‌మార్క్ అయిన 3.0 లీటర్ టిఎఫ్‌ఎస్‌ఐ (టర్బో ఫ్యూయల్ స్ట్రాటిఫైడ్ ఇంజెక్షన్) ఇంజిన్‌తో వస్తుంది. ఇది 500 ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ వద్ద 340 హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. ఇది 0 నుండి 100 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఆరు సెకండ్లలో చేరుకుంటుంది.

ఆడి క్యూ 8 ఎస్‌యూవీని మొదటిసారి డ్రైవింగ్ చేసిన విరాట్ కోహ్లీ!

ఆడి క్యూ 8 లగ్జరీ కారు సింగిల్ ఫ్రేమ్ అక్టోగోనల్ గ్రిల్ మరియు ఎల్ఈడి హెడ్ లైట్లతో వస్తుంది. ఈ ఎస్‌యూవీలో నాలుగు జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఎయిర్ కంట్రోల్ ప్యాకేజీ కూడా ఉంటుంది. డాష్‌బోర్డ్ రెండు టచ్‌స్క్రీన్‌లను కలిగి ఉంది. ఒకటి 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్‌, ఇది నావిగేషన్ కంట్రోల్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం. మరొకటి 8.6-అంగుళాల స్క్రీన్, ఎయిర్ కండిషనింగ్ కోసం ప్రత్యేకంగా ఉంటాయి.

ఆడి క్యూ 8 ఎస్‌యూవీని మొదటిసారి డ్రైవింగ్ చేసిన విరాట్ కోహ్లీ!

ఆడి క్యూ 8 కారులో భద్రతా లక్షణాలు చాలా ఉంటాయి. ఇందులో ఎనిమిది ఎయిర్‌బ్యాగులు ఉంటాయి. ఆడి పార్క్ అసిస్ట్, ఎలక్ట్రానిక్‌ స్టెబిలైజేషన్‌ ప్రోగ్రామ్‌ ప్రత్యేకంగా రూపొందించబడి ఉంటుంది.

ఇది గంటకు గరిష్టంగా 250 కిమీ దూరానికి దూసుకెళ్లే సామర్త్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో 48 వోల్టుల మెయిన్ ఎలక్ట్రికల్ సిస్టమ్ గల లిథియం ఆయాన్ బ్యాటరీ, బెల్ట్ ఆల్టర్నేటర్ స్టార్టర్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Virat Kohli Spotted Driving His New Audi Q8 SUV For the First Time. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X