స్కొడా ర్యాపిడ్‌ మోంట్ కార్లో మోడల్‌లో డీలర్లు కొత్త టచ్‌స్క్రీన్‌ను జోడిస్తున్నారా?

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ 'స్కొడా ఆటో' ఈ ఏడాది ఆరంంభంలో తమ సరికొత్త 2020 'స్కొడా రాపిడ్' సెడాన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ కారు కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తోంది. ఇందులో ఫోక్స్‌వ్యాగన్ వెంటో నుండి గ్రహించిన 1.0 లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. మునుపటి మోడళ్లలో ఉపయోగించిన పాత 1.6-లీటర్ ఎమ్‌పిఐ ఇంజన్ స్థానాన్ని రీప్లేస్ చేస్తూ కంపెనీ ఈ కొత్త 1.0 లీటర్ టిఎస్ఐ ఇంజన్‌ను ప్రవేశపెట్టింది.

స్కొడా ర్యాపిడ్‌ మోంట్ కార్లో మోడల్‌లో డీలర్లు కొత్త టచ్‌స్క్రీన్‌ను జోడిస్తున్నారా?

తాజాగా, యూట్యూబ్‌లో విడుదలైన ఓ వీడియో ప్రకారం, స్కొడా రాపిడ్ స్టైల్ మరియు మోంట్ కార్లో వేరియంట్లలో కొత్త ఆండ్రాయిడ్ ఇన్ఫోటైన్‌మెంట్ హెడ్ యూనిట్ డీలర్లు ఇన్‌స్టాల్ చేస్తున్నట్లు సమాచారం. మునుపటి తరం కార్లలో ఉపయోగించిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కంపెనీ దిగుమతి చేసుకుని విక్రయించేంది, కాగా ఇప్పుడు వాటిని కొత్త ఆండ్రాయిడ్ ప్లేయర్లతో భర్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

స్కొడా ర్యాపిడ్‌ మోంట్ కార్లో మోడల్‌లో డీలర్లు కొత్త టచ్‌స్క్రీన్‌ను జోడిస్తున్నారా?

విపణిలో కొత్త 2020 స్కొడా రాపిడ్ 1.0 లీటర్ టిఎస్ఐ సెడాన్ ప్రారంభ ధర రూ.7.49 లక్షలుగా ఉంది. ఈ కారు మొత్తం ఐదు వేరియంట్లలో (రైడర్, అంబిషన్, ఒనిక్స్, స్టైల్ మరియు మోంట్ కార్లో) లభిస్తోంది. ఇందులో టాప్-ఎండ్ స్కొడా రాపిడ్ మోంట్ కార్లో వేరియంట్ ధర రూయ11.79 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).

MOST READ: 2 కోట్ల విలువైన లంబోర్ఘిని కారుని సొంతం చేసుకున్న భారతీయ నిరుద్యోగి, ఎలానో తెలుసా ?

స్కొడా ర్యాపిడ్‌ మోంట్ కార్లో మోడల్‌లో డీలర్లు కొత్త టచ్‌స్క్రీన్‌ను జోడిస్తున్నారా?

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త స్కొడా ర్యాపిడ్‌లో ఉపయోగించిన 999 సిసి టర్బోచార్జ్డ్, త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 5500 ఆర్‌పిఎమ్ వద్ద 108 బిహెచ్‌పి శక్తిని మరియు 1750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో వస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కొత్త స్కొడా రాపిడ్ ఇప్పుడు మునపటి కన్నా 23 శాతం మెరుగైన మైలేజీని ఇస్తుంది (ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్ 18.97 కెఎమ్‌పిఎల్).

స్కొడా ర్యాపిడ్‌ మోంట్ కార్లో మోడల్‌లో డీలర్లు కొత్త టచ్‌స్క్రీన్‌ను జోడిస్తున్నారా?

ప్రస్తుతానికి స్కొడా ర్యాపిడ్ కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభ్యమవుతోంది. కాగా, ఇందులో కంపెనీ ఆప్షనల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ వార్తను స్కొడా ఆటో సేల్స్, సర్వీస్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ జాక్ హోలిస్ ధృవీకరించారు. స్కొడా రాపిడ్ 1.0 లీటర్ టిఎస్‌ఐ ఎటి వేరియంట్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల అవుతుందని అంచనా. ఇందులో టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఉపయోగించాలని కంపెనీ బావిస్తోంది.

MOST READ: మీరు ఇప్పటివరకు చూడని అరుదైన మరియు అందమైన హిందుస్తాన్ ట్రెక్కర్

స్కొడా ర్యాపిడ్‌ మోంట్ కార్లో మోడల్‌లో డీలర్లు కొత్త టచ్‌స్క్రీన్‌ను జోడిస్తున్నారా?

కొత్త స్కొడా రాపిడ్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 'రాపిడ్' బ్యాడ్జ్ కలిగిన స్కఫ్ ప్లేట్లు, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, చుట్టూ ఎల్‌ఈడి లైట్లు (హెడ్‌ల్యాంప్స్, డిఆర్‌ఎల్‌లు, ఫాగ్ లాంప్స్ మరియు టెయిల్ లైట్స్), లెథెరెట్ సీట్ అప్‌హోలెస్ట్రీ, క్రూయిజ్ కంట్రోల్, స్టైలిష్ డ్యూయెల్-టోన్ 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో నాలుగు ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, ఇబిడి, రియర్‌వ్యూ కెమెరా మరియు సెన్సార్లు, బ్రేక్ అసిస్ట్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

స్కొడా ర్యాపిడ్‌ మోంట్ కార్లో మోడల్‌లో డీలర్లు కొత్త టచ్‌స్క్రీన్‌ను జోడిస్తున్నారా?

స్కొడా ర్యాపిడ్ ఆండ్రాయిడ్ ప్లేయర్ ఇన్ఫోటైన్‌మెంట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఈ విషయంపై కంపెనీ నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, కొందరు డీలర్లు ఇందులో థర్డ్ పార్టీ ఆండ్రాయిడ్ ప్లేయర్లను ఇన్‌స్టాల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్లలో స్కొడా రాపిడ్ 1.0-లీటర్ టిఎస్ఐ మెజారిటీ వాటాను కలిగి ఉంది. భారత మార్కెట్లో ఈ మోడల్ ఫోక్స్‌వ్యాగన్ వెంటో, మారుతి సుజుకి సియాజ్, హ్యుందాయ్ వెర్నా మరియు హోండా సిటీ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Source:YouTube Video

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Skoda Auto launched the 2020 Rapid earlier this year in the Indian market. The car now comes with a petrol-only format and features the 1.0-litre TSI unit, borrowed from the Volkswagen Vento. Read in Telugu.
Story first published: Saturday, July 11, 2020, 14:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X