ఇసుజు డి-మ్యాక్స్ బిఎస్6 పికప్ టీజర్ లాంచ్ - వీడియో, వివరాలు

ఇసుజు ఇండియా తమ మొదటి బిఎస్6 వాహనాన్ని భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసిన టీజర్ ప్రకారం, ఇసుజు ఇండియా దేశంలో ప్రవేశపెట్టిన తమ మొట్టమొదటి వాహనం డి-మాక్స్ కమర్షియల్ పిక్-అప్‌ను బిఎస్6 అప్‌డేట్‌తో త్వరలోనే మార్కెట్లో విడుదల చేయనుంది.

ఇసుజు డి-మ్యాక్స్ బిఎస్6 పికప్ టీజర్ లాంచ్ - వీడియో, వివరాలు

ఇసుజు మోటార్స్ అందిస్తున్న డి-మాక్స్ పికప్ ట్రక్ భారత కమర్షియల్ లైనప్ వాణిజ్య ఆటోమోటివ్ విభాగంలో బాగా ప్రాచుర్యం పొందిన మోడల్. గడచిన ఏడాది కాలంగా, ఇసుజు బ్రాండ్ యొక్క వాణిజ్య వాహన శ్రేణిలో విక్రయించే వివిధ మోడళ్లు బ్రాండ్‌కు అమ్మకాల పరంగా మంచి ఫలితాలు తెచ్చిపెట్టాయి.

ఇసుజు వెబ్‌సైట్‌లోని టీజర్ ఇమేజ్‌తో పాటు, డి-మాక్స్ కమర్షియల్ పిక్-అప్‌ను ప్రదర్శించే కొత్త టీజర్ వీడియోను కూడా కంపెనీ విడుదల చేసింది. ఇప్పుడు ఈ వాహనం యొక్క పేలోడ్ సామర్థ్యాన్ని కూడా 1,710 కిలోల బరువుకు పెంచారు.

MOST READ:పోర్స్చే పనామెరా 4 10 ఇయర్ ఎడిషన్ ఫస్ట్ లుక్ రివ్యూ

ఇసుజు డి-మ్యాక్స్ బిఎస్6 పికప్ టీజర్ లాంచ్ - వీడియో, వివరాలు

బహుశా, ఇది భారత మార్కెట్లో ప్రారంభించబోయే ‘సూపర్ స్ట్రాంగ్' అని పిలువబడే డి-మాక్స్ పిక్-అప్ యొక్క కొత్త వేరియంట్ కూడా కావచ్చని తెలుస్తోంది. ఇందులో రీడిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు మరియు స్వల్పంగా ట్వీక్ చేయబడిన ఇంటీరియర్‌లు మరియు బిఎస్6 అప్‌డేట్‌తో ఈ కొత్త మోడల్ అందుబాటులోకి రానుంది.

ఇసుజు డి-మ్యాక్స్ బిఎస్6 పికప్ టీజర్ లాంచ్ - వీడియో, వివరాలు

ఇసుజు డి-మ్యాక్స్ బిఎస్4లో ఉపయోగించిన 2.5-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ గరిష్టంగా 3600 ఆర్‌పిఎమ్ వద్ద 134 బిహెచ్‌పి పవర్‌ను మరియు 1800-2800 ఆర్‌పిఎమ్ మధ్యలో 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. బిఎస్6 ఇంజన్ కూడా ఇదే రకమైన పనితీరుని కనబరచవచ్చని అంచనా.

MOST READ:ఈ స్టార్ కపుల్స్ పెళ్లి రోజు కొన్న కారు ధర రూ. 2.65 కోట్లు.. ఇంతకీ వారు ఎవరో తెలుసా ?

ఇసుజు డి-మ్యాక్స్ బిఎస్6 పికప్ టీజర్ లాంచ్ - వీడియో, వివరాలు

ఇసుజు డి-మాక్స్ కమర్షియల్ పిక్-అప్ సింగిల్ మరియు డబుల్ క్యాబిన్ అనే రెండు వెర్షన్లలో లభిస్తుంది. ఇందులో కస్టమైజేషన్ ఆప్షన్లను కూడా ఉన్నాయి. కాగా, బిఎస్6 మోడళ్లు ఇలాంటి కాన్ఫిగరేషన్లలోనే లభ్యం కానున్నాయి.

ఇసుజు డి-మ్యాక్స్ బిఎస్6 పికప్ టీజర్ లాంచ్ - వీడియో, వివరాలు

ఇటీవలి నివేదికల ప్రకారం, కంపెనీ ఇప్పటికే గడచిన సెప్టెంబర్ నెలలో తమ బిఎస్6 డి-మ్యాక్స్ వాహనాలను డీలర్‌షిప్‌లకు పంపించినట్లుగా తెలుస్తోంది. అయితే, దీనిపై కంపెనీ నుండి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.

MOST READ:మీరు ఈ బైక్ గుర్తుపట్టారా.. ఇది అందరికీ ఇష్టమైన బైక్ కూడా

ఇసుజు డి-మ్యాక్స్ బిఎస్6 పికప్ టీజర్ లాంచ్ - వీడియో, వివరాలు

ఇసుజు మోటార్స్ భారత మార్కెట్లో మొత్తం మూడు ఉత్పత్తులను అందిస్తోంది. ఇందులో డి-మాక్స్, వి-క్రాస్ మరియు ఎమ్‌యు-ఎక్స్ మోడళ్లు ఉన్నాయి. వి-క్రాస్ అనేది ప్రైవేట్ ఉపయోగం కోసం విక్రయించే పిక్-అప్ ట్రక్ మరియు ఇది మంచి రహదారి సామర్థ్యాలను కలిగి ఉంటుంది. మరోవైపు, ఎమ్‌యూ-ఎక్స్ అనేది ప్రీమియం ఫుల్-సైజ్ ఎస్‌యూవీ, ఇది టొయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్, మహీంద్రా అల్టురాస్ జి4 మరియు ఇటీవల విడుదలైన ఎమ్‌జి గ్లోస్టర్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

ఇసుజు డి-మ్యాక్స్ బిఎస్6 పికప్ టీజర్ లాంచ్ - వీడియో, వివరాలు

భారతదేశంలో కొత్త బిఎస్6 డి-మ్యాక్స్ వాణిజ్య వాహనాన్ని ప్రవేశపెట్టిన వెంటనే కంపెనీ ప్రైవేటు కొనుగోలుదారుల కోసం విక్రయించే రెండు వాహనాల్లో (వి-క్రాస్, ఎమ్‌యూ-ఎక్స్) కూడా బిఎస్6 వెర్షన్లను ప్రస్తుత పండుగ సీజన్‌లో విడుదల చేసే ఆస్కారం ఉంది.

MOST READ:కెమెరాకు చిక్కిన రెడ్ కలర్ ఫోర్స్ గూర్ఖా.. ఇది నిజంగా సూపర్ లుక్ గురూ..!

ఇసుజు డి-మ్యాక్స్ బిఎస్6 పికప్ టీజర్ లాంచ్ - వీడియో, వివరాలు

ఇసుజు డి-మ్యాక్స్ బిఎస్6 టీజర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

దేశంలో బిఎస్6 కాలుష్య నిబంధనలు కఠినతరం అయిన తర్వాత, ఇసుజు ఇండియా ఇంకా భారత మార్కెట్లో తమ బిఎస్6 వాహనాల లైనప్‌ను ఇంకా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో, ఇసుజు నుండి మొదటిగా రానున్న బిఎస్6 మోడల్ కొత్త డి-మ్యాక్స్‌గా నిలుస్తుంది.

Most Read Articles

Read more on: #ఇసుజు #isuzu
English summary
Isuzu India has teased its first BS6 vehicle that will be launching in the Indian market. Based on the teaser released on the company's website, the first vehicle to launch in the country will be the brand's D-Max commercial pick-up. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X