జాగ్వార్ ల్యాండ్ రోవర్ నుంచి మరిన్ని డీజిల్ కార్లు

ప్రస్తుతం భారత్‌లో అమలులో ఉన్న కాలుష్య నిబంధనలకు అనువుగా ఆటోమొబైల్ కంపెనీలన్నీ తమ వాహనాల ఇంజన్లను బిఎస్6 వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో.. టాటా మోటార్స్‌కి చెందిన బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కూడా తమ డీజిల్ కార్ల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇప్పటి వరకూ ల్యాండ్ రోవర్ నుంచి డిస్కవరీ స్పోర్ట్ మరియు ఎవోక్ రెండు మోడళ్లు మాత్రమే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుండేవి. మిగిలిన అన్ని మోడళ్లు కూడా కేవలం పెట్రోల్ ఆప్షన్లతో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ నుంచి మరిన్ని డీజిల్ కార్లు

అంతేకాదు, డీజిల్ ఇంజన్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు వెయింటింగ్ పీరియడ్ కూడా ఎక్కువగానే ఉండేది. ఈ నేపథ్యంలో కంపెనీ అందిస్తున్న పాపులర్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌ను కోల్పోవటానికి కంపెనీ సముఖత చూపడం లేదని తెలుస్తోంది. ల్యాండ్ రోవర్ ఆఫర్ చేస్తున్న ఇతర మోడళ్లలో కూడా అప్‌గ్రేడ్ చేసిన బిఎస్6 డీజిల్ ఇంజన్‌ను ఆఫర్ చేయాలని కంపెనీ యోచిస్తోంది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ నుంచి మరిన్ని డీజిల్ కార్లు

వాస్తవానికి ఏప్రిల్ 1, 2020 నాటికి అన్ని జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాహనాల్లో కనీసం ఒకటైనా బిఎస్6ను ప్రవేశపెట్టాలని కంపెనీ ప్లాన్ చేసింది. అయితే కోవిడ్-19 కారణంగా ఆ ప్లాన్ కాస్తా సరిగ్గా అమలు కాలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కంపెనీ ఉపయోగిస్తున్న ఈ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌లో కొత్తగా బిఎస్6 వెర్షన్‌ను త్వరలోనే మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్‌లో అసెంబ్లింగ్ చేయబడుతున్న జాగ్వార్ ఎక్స్ఎఫ్ మరియు రేంజ్ రోవల్ వెలార్ వంటి మోడళ్లలో ఈ కొత్త బిఎస్6 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం.

MOST READ: టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

జాగ్వార్ ల్యాండ్ రోవర్ నుంచి మరిన్ని డీజిల్ కార్లు

ఇదిలా ఉంచితే, ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జాగ్వార్ ల్యాండ్ రోవర్ కూడా తమ అమ్మకాలను షోరూమ్ నుంచి ఆన్‌లైన్ వైపుకి మార్చింది. ఈ మేరకు ఆన్‌లైన్ సేల్స్ అండ్ సర్వీస్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ప్రారంభించింది. ఈ సదుపాయంతో కస్టమర్లు నేరుగా తమ ఇంటి నుంచి తమకు నచ్చిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాహనాలను కొనుగోలు చేసి, తమ ఇంటికి రప్పించుకునే వెసలుబాటును కంపెనీ కల్పించింది. ఈ కంపెనీకి ఇదివరకే 'findmeacar.in'మరియు 'findmeasuv.in' అనే ఆన్‌లైన్ రీటైల్ ఛానెళ్లను నిర్వహించేంది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ నుంచి మరిన్ని డీజిల్ కార్లు

కాగా.. ఇప్పుడు తమ వినియోగదారుల కోసం పూర్తిస్థాయి ఆన్‌లైన్ సేవలు అందించే విధంగా తమ అధికారిక వెబ్‌సైట్ నుంచే కొనుగోళ్ల నుంచి డెలివరీ వరకూ అన్ని రకాల సేవలను అందిస్తోంది. మరోవైపు కరోనా లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇటీవలే తమ ప్లాంట్‌లో సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ తయారు చేసిన తొలి రేంజ్ రోవర్ కారును కూడా విడుదల చేసింది. తమ ప్లాంట్‌లో పూర్తిస్థాయిలో కోవిడ్-19 నివారణ చర్యలు చేపడుతూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

MOST READ: కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

జాగ్వార్ ల్యాండ్ రోవర్ నుంచి మరిన్ని డీజిల్ కార్లు

జాగ్వార్ ల్యాండ్ రోవర్ బిఎస్6 డీజిల్ ఇంజన్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇప్పటికే కొన్ని మోడళ్లలో 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఆఫర్ చేస్తోంది. కాకపోతే, కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇందులో బిఎస్6 వేరియంట్ లాంచ్ విడుదల ఆలస్యమైంది. ఈ పవర్‌ఫుల్ డీజిల్ ఇంజన్‌ను మరిన్ని ల్యాండ్ రోవర్ మోడళ్లలో ఆఫర్ చేసినట్లయితే కంపెనీ అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Most Read Articles

English summary
Jaguar Land Rover has not given up on the diesel engines, moreover, the company's 2.0-litre diesel engine option is one of the highest selling ones and will be offered soon with the other cars in India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X