భారత్‌లో డీజిల్ కార్లను నిలిపివేసిన జాగ్వార్, వివరాలు

టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్, భారత మార్కట్లో విక్రయిస్తున్న కొన్ని రకాల ప్రీమియం ఆల్ట్రా లగ్జరీ కార్లలో డీజిల్ వేరియంట్లను డిస్‌కంటిన్యూ చేసింది. ఈ మేరకు జాగ్వార్ తమ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఎక్స్ఈ, ఎక్స్ఎఫ్ మరియు ఎఫ్-పేస్ మోడళ్లలో డీజిల్ వేరియంట్లను తొలగించింది.

భారత్‌లో డీజిల్ కార్లను నిలిపివేసిన చేసిన జాగ్వార్, వివరాలు

జాగ్వార్ అందించిన ఎక్స్ఈ, ఎక్స్ఎఫ్ మరియు ఎఫ్-పేస్ ఈ మూడు మోడళ్లు కూడా 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌తో లభ్యమయ్యేవి. ఈ ఇంజన్ గరిష్టంగా 177 బిహెచ్‌పిల శక్తిని, 400 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ డీజిల్ ఇంజన్ ప్రస్తుతం భారత్‌లో అమలులో ఉన్న బిఎస్6 కాలుష్య నిబంధనలకు అనుకూలంగా లేనందునే ఈ డీజిల్ వేరియంట్లను డిస్‌కంటిన్యూ చేసినట్లు తెలుస్తోంది.

భారత్‌లో డీజిల్ కార్లను నిలిపివేసిన చేసిన జాగ్వార్, వివరాలు

కంపెనీ అందిస్తున్న మరో ఫ్లాగ్‌షిప్ సెడాన్ జాగ్వార్ ఎక్స్‌జే ఎల్ (Jaguar XJ L) మోడల్‌ను కూడా డిస్‌కంటిన్యూ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఎక్స్‌జే ఎల్ సెడాన్‌లో శక్తివంతమైన వి6 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్‌ను భారత మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేశారు. అయితే, ఇటీవలి కాలంలో కాలుష్య నిబంధనలు మారడంతో పలు కంపెనీ తమ ఇంజన్లను అప్‌గ్రేడ్ చేస్తుంటే మరికొన్ని కంపెనీలు మాత్రం ఇలా ఉత్పత్తులనే నిలిపివేస్తున్నాయి.

MOST READ: ఆర్ట్ ఆఫ్ పర్ఫామెన్స్ టూర్: అరుదైన అవకాశం కల్పించిన జాగ్వార్

భారత్‌లో డీజిల్ కార్లను నిలిపివేసిన చేసిన జాగ్వార్, వివరాలు

ప్రస్తుతం భారతదేశంలో జాగ్వార్ నుంచి కొనుగోలు చేయటానికి అందుబాటులో ఉన్న మోడళ్ల వివరాలను తెలుసుకుందాం రండి.

జాగ్వార్ ఎక్స్ఈ

జాగ్వార్ ఎక్స్ఈ (Jaguar XE)లో కంపెనీ గతేడాది ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసి 2.0 లీటర్ పెట్రోల్ మరియు 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లను పరిచయం చేసింది. ఇది జాగ్వార్ నుంచి అందుబాటులో ఉన్న అతి తక్కువ ధర కలిగిన కారు. ఈ ఎంట్రీ లెవల్ కారులో ఇప్పుడు డీజిల్ ఇంజన్ ఆప్షన్ తొలగిపోవటంతో జాగ్వార్ ఎక్స్ఈ ఇకపై కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యం కానుంది. ఈ 2.0 లీటర్ ఇంజీనియం టర్బో పెట్రోల్ ఇంజన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 247 బిహెచ్‌పిల శక్తిని, 1,500 ఆర్‌పిఎమ్ వద్ద 365 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

భారత్‌లో డీజిల్ కార్లను నిలిపివేసిన చేసిన జాగ్వార్, వివరాలు

జాగ్వార్ ఎక్స్ఈ ప్రస్తుతం రెండు వేరియంట్లలో (S, SE) లభిస్తుంది. ప్రారంభ వేరియంట్ ధర రూ.46.64 లక్షలుగా ఉంటే టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.48.50 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉంది. జాగ్వార్ ఎక్స్ఈ ఈ సెగ్మెంట్లో లభిస్తున్న బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్, ఆడి ఏ4, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ వంటి మోడళ్లకు గట్టి పోటీగా నిలుస్తుంది.

MOST READ: జాగ్వార్ నుండి మొదటి ఎలక్ట్రిక్ కార్ వస్తుంది వివరాలు చుడండి

భారత్‌లో డీజిల్ కార్లను నిలిపివేసిన చేసిన జాగ్వార్, వివరాలు

జాగ్వార్ ఎక్స్ఎఫ్

జాగ్వార్ అందిస్తున్న ఎక్స్ఈ సెడాన్ కన్నా మరిన్ని కంఫర్ట్ అండ్ లగ్జరీ ఫీచర్లతో లభించే కారు జాగ్వార్ ఎక్స్ఎఫ్ (Jaguar XF). ఇంజన్ పరంగా ఎక్స్ఈ మరియు ఎక్స్ఎఫ్ కార్లలో ఎలాంటి మార్పు లేదు. వాస్తవానికి ఈ రెండు ఇంజన్లు పెర్ఫార్మెన్స్‌లో ఒకేతీరులో పనిచేస్తాయి. కాకపోతే, జాగ్వార్ ఎక్స్ఎఫ్ సెడాన్ ఎక్స్ఈ కన్నా పొడవుగా ఉంటుంది మరియు అనేక లగ్జరీ ఫీచర్లను కలిగి ఉంటుంది.

భారత్‌లో డీజిల్ కార్లను నిలిపివేసిన చేసిన జాగ్వార్, వివరాలు

జాగ్వార్ ఎక్స్ఎఫ్ సెడాన్ కేవలం 6.7 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు గంటకు 244 కిలోమీటర్ల గరిష్ట వేగం (టాప్ స్పీడ్)తో పరుగులు తీస్తుంది. ఈ లగ్జరీ సెడాన్ ప్రస్తుతం భారత్‌లో ఒకే ఒక వేరియంట్ (Prestige)లో అది కూడా పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తోంది. దీని ప్రారంభ ధర రూ.55.67 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. జాగ్వార్ ఎక్స్ఎఫ్ సెడాన్ ఈ సెగ్మెంట్లోని బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్, ఆడి ఏ6, మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది.

MOST READ: 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; త్వరలో భారత్‌లో విడుదల!

భారత్‌లో డీజిల్ కార్లను నిలిపివేసిన చేసిన జాగ్వార్, వివరాలు

జాగ్వార్ ఎఫ్-పేస్ జాగ్వార్ తయారు చేసిన మొట్టమొదటి ఎస్‌యూవీ జాగ్వార్ ఎఫ్-పేస్ కూడా 2.0 లీటర్ పెట్రోల్ మరియు 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతోనే లభ్యమయ్యేది. అయితే, ప్రస్తుతం ఇందులో డీజిల్ వేరియంట్లను డిస్‌కంటిన్యూ చేశారు. పెట్రోల్ ఇంజన్ కూడా బిఎస్4 కాలుష్య నిబంధనలకు అనుగుణంగా డిజైన్ చేయబడిన నేపథ్యంలో, త్వరలోనే కంపెనీ ఇందులో అప్‌గ్రేడెడ్ బిఎస్6 ఇంజన్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎక్స్ఈ మరియు ఎక్స్ఎఫ్ సెడాన్లలో ఉపయోగిస్తున్న టర్బో పెట్రోల్ ఇంజన్‌నే ఈ కొత్త ఎఫ్-పేస్ మోడల్‌లోను ఉపయోగించనున్నారు.

భారత్‌లో డీజిల్ కార్లను నిలిపివేసిన చేసిన జాగ్వార్, వివరాలు

భారత మార్కెట్లో జాగ్వార్ ఎక్స్ఎఫ్ సెడాన్ కూడా ఒకే ఒక వేరియంట్‌లో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.66.07 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. జాగ్వార్ ఎఫ్-పేస్ ఈ సెగ్మెంట్లోని ఆడి క్యూ5, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3, మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి వంటి లగ్జరీ కార్లకు పోటీగా నిలుస్తుంది.

భారత్‌లో డీజిల్ కార్లను నిలిపివేసిన చేసిన జాగ్వార్, వివరాలు

జాగ్వార్ డీజిల్ మోడళ్లను డిస్‌కంటిన్యూ చేయటంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత సర్కార్ ఇటీవలే వాహనాల కాలుష్య నిబంధనలను మారుస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, దేశంలోని అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాలను కొత్త కాలుష్య నిబంధనలు లోబడి తయారు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇది ఖర్చుతో కూడుకున్న పని, ఫలితంగా వాహనాల ధరలు కూడా పెరుగుతాయి. ఇందులో భాగంగానే జాగ్వార్ కూడా తమ పాపులర్ మోడళ్లయిన ఎక్స్ఈ, ఎక్స్ఎఫ్, ఎఫ్-పేస్ లలో డీజిల్ వెర్షన్‌ను నిలిపివేసింది. ప్రస్తుతానికి ఈ మోడళ్లు కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తున్నాయి. అయితే, భవిష్యత్తులో వీటిలో తిరిగి డీజిల్ ఇంజన్ ఆప్షన్లు వచ్చే ఆస్కారం కూడా లేకపోలేదు.

Most Read Articles

English summary
Jaguar has discontinued the XE, XF, and the F-Pace diesel variants in the Indian market. The company has unlisted the diesel variants of all the aforementioned models from its official website. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X