జీప్ కంపాస్ బిఎస్6 డీజల్ వేరియంట్ లాంచ్: ధర మరియు ఫోటోలు

జీప్ ఇండియా మార్కెట్లోకి సరికొత్త బిఎస్6 కంపాస్ డీజల్ ఆటోమేటిక్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. జీప్ కంపాస్ ఆటోమేటిక్ బిఎస్6 వెర్షన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.96 లక్షలుగా ఉన్నట్లు జీప్ ప్రతినిధులు వెల్లడించారు.

జీప్ కంపాస్ బిఎస్6 డీజల్ వేరియంట్ లాంచ్: ధర మరియు ఫోటోలు

సరికొత్త డీజల్-ఆటోమేటిక్ ఇంజన్ ఆప్షన్ ఇప్పుడు జీప్ కంపాస్‌లోని లాంగిట్యూడ్ మరియు లిమిటెడ్ ప్లస్ వేరియంట్లలో లభిస్తోంది. జీప్ కంపాస్ టాప్ ఎండ్ వేరియంట్ లిమిటెడ్ ప్లస్ డీజల్ ఆటోమేటిక్ ధర రూ. 24.99 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

జీప్ కంపాస్ బిఎస్6 డీజల్ వేరియంట్ లాంచ్: ధర మరియు ఫోటోలు

జీప్ కంపాస్ స్టార్టింగ్ వేరియంట్‌తో పోల్చుకుంటే కంపాస్ లిమిటెడ్ ప్లస్ డీజల్ వేరియంట్ ధర సుమారు 4 లక్షల అధికంగా ఉంది. నూతన 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జోడింపుతో పాటు లాంగిట్యూడ్ మరియు లిమిటెడ్ ప్లస్ రెండు వేరియంట్లలో కూడా అతి త్వరలో అమల్లోకి రానున్న బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా ఇంజన్ ‌అప్‌డేట్ చేశారు.

జీప్ కంపాస్ బిఎస్6 డీజల్ వేరియంట్ లాంచ్: ధర మరియు ఫోటోలు

జీప్ ఇండియా ఈ డీజల్-ఆటోమేటిక్ ఇంజన్‌ ఆప్షన్‌ను కంపాస్ ట్రయల్‌హాక్ మోడల్‌లో మాత్రమే అందిస్తోంది. 2019 మధ్య భాగంలో జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఇంటర్నేషనల్ మోడల్‌ను రూ. 26.80 లక్షల ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) ధరతో ప్రవేశపెట్టింది.

జీప్ కంపాస్ బిఎస్6 డీజల్ వేరియంట్ లాంచ్: ధర మరియు ఫోటోలు

జీప్ కంపాస్ లాంగిట్యూడ్ మరియు లిమిటెడ్ ప్లస్ వేరియంట్లలో కూడా కంపాస్ ట్రయల్‌హాక్‌లో ఉన్నటువంటి అదే 2.0-లీటర్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల డీజల్ ఇంజన్ అందించారు. ఇంజన్ ప్రొడ్యూస్ చేసే 173బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా అన్ని చక్రాలకు అందుతుంది.

జీప్ కంపాస్ బిఎస్6 డీజల్ వేరియంట్ లాంచ్: ధర మరియు ఫోటోలు

కొత్త ఇంజన్ ఆప్షన్ పరిచయం చేయడం మినహాయిస్తే లాంగిట్యూడ్ మరియు లిమిటెడ్ ప్లస్ వేరియంట్లలో ఎలాంటి మార్పులు జరగలేదు. రెండింటిలో కూడా ఎన్నో అత్యాధునిక ఫీచర్లు, సేఫ్టీ మరియు టెక్నాలజీని అందించారు.

జీప్ కంపాస్ బిఎస్6 డీజల్ వేరియంట్ లాంచ్: ధర మరియు ఫోటోలు

పానొరమిక్ సన్‌రూఫ్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఆటోమేటిక్ వైపర్లు, 6 ఎయిర్ బ్యాగులు, 8-దిశలలో అడ్జెస్ట్ చేసుకునే సౌలభ్యం ఉన్న ఎలక్ట్రానిక్ డ్రైవర్ సీటు, 8.4-ఇంచుల టచ్‌‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు జీప్ వారి U-కనెక్ట్ టెక్నాలజీ వంటివి వచ్చాయి.

జీప్ కంపాస్ బిఎస్6 డీజల్ వేరియంట్ లాంచ్: ధర మరియు ఫోటోలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జీప్ ఇండియా గత ఏడాది మార్కెట్లోకి విడుదల చేసిన ట్రయల్‌హాక్‌లో మాత్రమే లభించే డీజల్-ఆటోమేటిక్ ఇంజన్ ఆప్షన్‌ను ఇప్పుడు జీప్ కంపాస్ లోయర్ ఎండ్ వేరియంట్లలో కూడా అందుబాటులోకి వచ్చంది. జీప్ కంపాస్ ప్రీమియం మిడ్-సైజ్ ఎస్‌యూవీ కియా సెల్టోస్, ఎంజీ హెక్టర్, టాటా హ్యారియర్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Jeep Compass BS6 Diesel Automatic Launched In India: Prices Start At Rs 21.96 Lakh. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X