Just In
Don't Miss
- Lifestyle
సోమవారం దినఫలాలు : అనవసరమైన పనులకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు...!
- News
వ్యవసాయ చట్టాల రద్దు తప్ప.. ఏదైనా అడగండి: కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్
- Movies
ట్రెండింగ్ : కొంచెం కూడా ఇంగితజ్ఞానం లేదా.. పైకి కనపడేది నిజం కాదు.. మళ్లీ బుక్కైన నాగబాబు
- Finance
పెట్రోల్, డీజిల్ వాడకం భారీగా తగ్గినా.. ఆదాయం అదుర్స్: ఎందుకంటే
- Sports
సెహ్వాగ్ చెప్పిన ప్రకారం గబ్బాలో భారత్‌దేనా విజయం..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్, త్వరలో లాంచ్!
అమెరికన్ పాపులర్ ఎస్‌యూవీ బ్రాండ్ 'జీప్ ఇండియా' దేశీయ విపణిలో విక్రయిస్తున్న 'జీప్ కంపాస్' లో కంపెనీ ఫేస్‌లిఫ్ట్ 2021 మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు మేము ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో జీప్ తమ కొత్త కంపాస్ ఎస్‌యూవీని భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తుంగా కెమెరాకు చిక్కింది.

కొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఓ 7-సీటర్ వెర్షన్ కూడా మార్కెట్లోకి రావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తిగా క్యామోఫ్లేజ్ చేసిన కంపాస్ ఎస్‌యూవీని మహారాష్ట్ర రోడ్లపై టెస్టింగ్ చేస్తుడగా, రష్‌లేన్ బృందం తమ కెమెరాలో బంధించింది. ఇందులో కొత్త మోడల్‌కి సంబంధించిన కొన్ని కాస్మోటిక్ మార్పులను గమనించవచ్చు.

జీప్ ఇండియా తమ కొత్త 2021 కంపాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేనప్పటికీ, ఇది ఈ ఏడాదిలోనే భారత మార్కెట్ల విడుదల కావచ్చని తెలుస్తోంది. జీప్ ఇటీవలి కాలంలో చెప్పినట్లుగా, ఈ బ్రాండ్ భారత్‌లో రెండు లేదా మూడు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కొత్త కంపాస్ కూడా ఓ మోడల్ అయి ఉండొచ్చని తెలుస్తోంది.
MOST READ: చేతులు కలిపిన ఫోక్స్‌వ్యాగన్, ఫోర్డ్; కొత్త వాహనాల అభివృద్ధికి శ్రీకారం

ప్రస్తుత తరం కంపాస్ మోడల్‌తో పోల్చుకుంటే కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఏమీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఎక్స్‌టీరియర్ మార్పుల్లో సెవన్ స్లాట్ గ్రిల్, ఎల్ఈడి ఫాగ్ లాంప్స్, ఆప్షనల్‌గా లభించే కొత్త అల్లాయ్ వీల్స్, కొత్త కలర్ ఆప్షన్స్, డ్యూయెల్ ఎగ్జాస్ట్ టిప్, కొత్త మెష్ డిజైన్ వంటి మార్పులు ఉండొచ్చని సమాచారం.

ఇక ఇందులోని ఇంటీరియర్స్‌లో కొత్తగా 8.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండే అవకాశం ఉంది, ఇది జీప్ బ్రాండ్ యొక్క లేటెస్ట్ యూకనెక్ట్ 5.0 సాఫ్ట్‌వేర్‌ను సపోర్ట్ చేయడంతో పాటుగా ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు అమెజాన్ అలెక్సాలను కూడా సపోర్ట్ చేయనుంది.
MOST READ: కరోనా ఎఫెక్ట్ : ఆటోస్‌లో ప్రొటెక్టివ్ స్క్రీన్ అమలు చేసిన ఓలా

జీప్ యూకనెక్ట్ సాఫ్ట్‌వేర్ సాయంతో కస్టమర్లు రిమోట్ ఇంజన్ స్టార్ట్, క్లైమేట్ కంట్రోల్ మొదలైన కంట్రోల్ చేసే వెసలుబాటు ఉంటుంది. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్స్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, జీప్ కంపాస్ 2021 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను త్వరలోనే భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ వాహనాన్ని రంజాంగావ్‌లో జీప్ ఉత్పత్తి కేంద్రంలో అసెంబుల్ చేయనున్నట్లు తెలుస్తోంది.
MOST READ: కోవిడ్-19 కారణంగా ప్రజా రవాణా పరిశ్రమలో 20 లక్షల ఉద్యోగాలు పోయాయ్: బిసిఓసిఐ

ఇంజన్ విషయానికి వస్తే.. కొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ కొత్తగా 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను (అంతర్జాతీయ మార్కెట్లలో లభించే ఇంజన్) ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది. ఇది రెండు ట్యూనింగ్‌లతో వస్తుంది. అందులో ఒకటి 128bhp శక్తిని మరియు 270Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది; మరొకటి 148bhp శక్తిని మరియు 270Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఆ ఇంజన్లు వరుసగా ఆరు-స్పీడ్ మాన్యువల్ మరియు తొమ్మిది-స్పీడ్ డిసిటితో జతచేయబడి ఉంటాయి.

జీప్ కంపాస్‌లో బిఎస్6 వెర్షన్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఉంటుంది, ఇది 170bhp శక్తిని మరియు 350Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఏడాది నవంబర్ నాటికి ఈ కొత్త మోడల్ మార్కెట్లో విడుల కావచ్చని అంచనా. ఇది ఈ సెగ్మెంట్లోని టాటా హారియర్, ఎంజి హెక్టర్ వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.
MOST READ: ఇప్పుడు సైకిల్ & ఎలక్ట్రిక్ వెహికల్ రూట్స్ కోసం ఆపిల్ మ్యాప్

జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ 2021 మోడల్ టెస్టింగ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
నిజానికి ఇది ఆటో పరిశ్రమకు శుభవార్త. కరోనా నుంచి పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రానున్న కొద్ది నెలల్లో మరిన్ని ఆటోమొబైల్ తయారీదారులు తమ కొత్త హనాల టెస్టింగ్‌ను ప్రారంభిస్తారని మేము ఆశిస్తున్నాము. ప్రస్తుత పరిస్థితుల్లో వాహనాలను పరీక్షించడం అంటే పరిశ్రమ నెమ్మదిగా కోలుకుంటుందని అర్థం.