భారత్‌లో ప్రారంభమైన జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ డెలివరీలు

అమెరికన్ కార్ బ్రాండ్ జీప్ భారత్‌లో విక్రయిస్తున్న జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ (Jeep Wrangler Rubicon) డెలివరీలను ప్రారంభించింది. ఈ మేరకు తొలి ఎస్‌యూవీని కంపెనీ బెంగుళూరులో ఓ కస్టమర్‌కు డెలివరీ చేసింది. మంచి ఆఫ్-రోడ్ సామర్థ్యాలు కలిగిన జీప్ వ్రాంగ్లస్ రూబికాన్ ఎస్‌యూవీ ప్రారంభ ర రూ.68.94 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది.

భారత్‌లో ప్రారంభమైన జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ డెలివరీలు

మార్చ్ 2020లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఈ ఎస్‌యూవీని లగ్జరీ సెగ్మెంట్లో కంపెనీ విడుదల చేసింది. కాగా.. మొదటి బ్యాచ్‌లో భాగంగా ఈ వ్రాంగ్లర్ రూబికాన్ ఎస్‌యూవీని బెంగుళూరుకి చెందిన కె.హెచ్.టి ప్రైమ్ డీలర్‌షిప్ తమ తొలి కస్టమర్‌కు అందజేసింది. దీంతో భారత్‌లో అధికారికంగా డెలివరీ అయిన తొలి ఎస్‌యూవీగా ఇది నిలిచింది.

భారత్‌లో ప్రారంభమైన జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ డెలివరీలు

గత మార్చ్ నెలలో కారు విడుదలైన తొలి నాళ్లలోనే వ్రాంగ్లర్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం కావల్సి ఉన్నప్పటికీ, కోవిడ్-19 వైరస్ వ్యాప్తి, దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా ఈ మోడల్ డెలివరీలు ఆలస్యం అయ్యాయి.

MOST READ: జీప్ కంపాస్ డెలివరీలు షురూ, ఎలా చేస్తున్నారో మీరే చూడండి

భారత్‌లో ప్రారంభమైన జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ డెలివరీలు

అంతర్జాతీయ మార్కెట్లలో ఈ గ్లోబల్ వెర్షన్ జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ ఎస్‌యూవీ మూడు డోర్లు మరియు ఐదు డోర్ల ఆప్షన్‌తో లభిస్తుంది. అయితే, భారత్‌లో ఇది కేవలం 5-డోర్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది. పూర్తిగా విదేశాల్లో తయారైన ఈ కారును సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు.

భారత్‌లో ప్రారంభమైన జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ డెలివరీలు

జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ ఎస్‌యూవీ అత్యుత్తమ ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో శక్తివంతమైన 2.0 లీటర్, ఫోర్-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5,250 ఆర్‌పిఎమ్ వద్ద 268 బిహెచ్‌పిల శక్తిని మరియు 3,000 ఆర్‌పిఎమ్ వద్ద 400 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ నుంచి వచ్చే శక్తిని 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సాయంతో నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేయబడుతుంది. ఇందులో 'రోడ్‌ట్రాక్ 4x4' ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను ఉపయోగించారు.

MOST READ: 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; త్వరలో భారత్‌లో విడుదల!

భారత్‌లో ప్రారంభమైన జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ డెలివరీలు

రూబికాన్ యొక్క ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని గుర్తు చేసేలా ఈ కారుపై 'Trail Rated' అనే బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది. మరింత బెటర్ ఆఫ్-రోడింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ కారులో పార్ట్-టైమ్ సెలక్షన్‌తో కూడిన 4:1 ట్రాన్స్‌ఫర్ కేస్, పెర్ఫార్మెన్స్ సస్పెన్షన్ సెటప్, ఎలక్ట్రానికల్‌గా లాక్ చేయదగిన 'ట్రూ-లాక్' మరియు ఎలక్ట్రానికల్‌గా నియంత్రించదగిన ఫ్రంట్ స్వే బార్ వంటి ఫీచర్లున్నాయి.

భారత్‌లో ప్రారంభమైన జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ డెలివరీలు

ఇకపోతే రెగ్యులర్ జీప్ వ్రాంగ్లర్‌లో ఉండే అన్ని ఫీచర్లను యధావిదిగా ఈ కొత్త కారులో కూడా అందుబాటులో ఉంచారు. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే లను సపోర్ట్ చేసే 8-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ కోసం 7-ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్, డ్యూయెల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పార్క్ అసిస్ట్‌తో కూడిన రియర్ పార్కింగ్ సెన్సార్స్, టైర్ ప్రెజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (టిపిఎమ్ఎస్), ఆల్-రౌండ్ ప్రొటెక్షన్ కోసం ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫీచర్లు దీని సొంతం.

MOST READ: గుడ్ న్యూస్.. జీప్ కంపాస్ ఎస్‌యూవీ రీస్టార్ట్

భారత్‌లో ప్రారంభమైన జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ డెలివరీలు

ఇదిలా ఉంచితే.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బయటకు రావటం ఇష్టం లేని కస్టమర్ల కోసం జీప్ ఇండియా ఓ కొత్త తరహా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆప్షన్‌తో కస్టమర్లు తమ ఇంటి నుండే ఆన్‌లైన్ ద్వారా తమకు నచ్చిన జీప్ వాహనాన్ని బుక్ చేసుకోవటం నుంచి డెలివరీ వరకూ అన్నీ ఆన్‌లైన్‌లోనే చేయవచ్చు. జీప్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు ఇదొక మంచి విర్చ్యువల్ ఎక్స్‌పీరియెన్స్‌గా ఉంటుంది.

భారత్‌లో ప్రారంభమైన జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ డెలివరీలు

జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ ఫస్ట్ డెలివరీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

గ్లోబల్ మార్కెట్లలో జీప్ వ్రాంగ్లర్ రూబికాన్‌కు ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. ఆఫ్-రోడ్ సామర్థ్యంలో ఈ వాహనానికి సాటి మరొకటి లేదు. ఎలాంటి ఆఫ్-రోడింగ్ ప్రాంతాలనైనా సులువుగా అధిగమించగలదు. భారత్‌లో జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ డెలివరీలు ప్రారంభమైన నేపథ్యంలో, ఇక రోడ్లపై ఈ వాహనాలను చూసే ఆస్కారం ఉంటుంది. ఈ ఎస్‌యూవీని జీప్ స్థానికంగా ఉత్పత్తి చేయగలగితే మరింత సరమైన ధరకే ఇది అందుబాటులోకి రావచ్చు.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
The Jeep Wrangler Rubicon deliveries have commenced across the country. The company delivered the first off-road SUV in India to a customer in Bangalore. The Jeep Wrangler Rubicon retails at a starting price of Rs 68.94 lakh, ex-showroom (India). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X