కారులోకి వైరస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి - కార్ శానిటైజేషన్ చిట్కాలు

ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు, బయటి నుంచి వచ్చేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి కార్లను వినియోగించే కస్టమర్లు తమ కారును ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటే కరోనా ఎప్పటికీ దరిచేరదు.

కారులోకి వైరస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి - కార్ శానిటైజేషన్ చిట్కాలు

ఫోర్డ్ ఇండియా కార్ ఓనర్ల కోసం కొన్ని కీలక సూచనలు చేసింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో, కారులో పాటించాల్సిన శానిటైజేషన్ నియమాలను పేర్కొంది. కారుని బయటి వైపు నుంచి క్లీన్ చేయటమే కాకుండా ఇంటీరియర్లలో కొన్ని మనం నిత్యం తాకుతూ ఉండే ప్రాంతాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం రండి..!

కారులోకి వైరస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి - కార్ శానిటైజేషన్ చిట్కాలు

మనం కారులో నిత్యం చేతులతో తాకే ప్రాంతాల్లో మొదటిది కారు తాళం. కారును అన్‌లాక్ చేయగానే మనం బయటివైపు డోర్ హ్యాండిల్‌ను లోపలివైపు డోర్ హ్యాండిల్‌ను తాకుతాం, ఆ తర్వాత కారు ఇగ్నిషన్ మరియు కీస్‌ని ముట్టుకుంటాం. కాబట్టి ఈ ప్రాంతాలను ప్రతిసారి శానిటైజ్ చేసుకోవటం మంచిది.

MOST READ: సరికొత్త కియా ఎమ్‌పివి టీజర్ విడుదల, మారనున్న కార్నివాల్ రూపురేఖలు!

కారులోకి వైరస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి - కార్ శానిటైజేషన్ చిట్కాలు

కారులోకి ఎంటర్ అవ్వగానే మనం ముట్టుకునే తర్వాతి ప్రదేశం సీట్‌బెల్ట్, బకెల్, పుష్-స్టార్ట్ బటన్, రియర్ వ్యూ అండ్ సైడ్ వ్యూ మిర్రర్ బటన్స్, ఏసి కంట్రోల్స్ మరియు రేడియో కంట్రోల్స్. కాబట్టి ఈ ఏరియాలను ఎప్పటి కప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.

కారులోకి వైరస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి - కార్ శానిటైజేషన్ చిట్కాలు

ఆ తర్వాత మనం కారులో తాకే ప్రదేశాల్లో గేర్ సెలక్టర్ (గేర్ నాబ్), పార్కింగ్ బ్రేక్ లివర్, స్టీరింగ్ వీల్ మరియు స్టీరింగ్ వీల్‌పై ఉండే కంట్రోల్స్, టర్న్ సిగ్నల్ మరియు వైపర్ స్విచ్‌లు, హెడ్‌లైట్ నాబ్, సెంటర్ కన్సోల్, కప్ హోల్డర్స్ ఉంటాయి. వాటికని కూడా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి.

MOST READ: ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలలో ముందుకు దూసుకెళ్తున్న ఒకినావా

కారులోకి వైరస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి - కార్ శానిటైజేషన్ చిట్కాలు

కారు లోపల ప్లాస్టిక్ భాగాలు, బటన్లు, నాబ్స్ మరియు ఇతర ప్రాంతాలను బ్లీచ్ లేని క్రిమిసంహారకం ఉపయోగించి శుభ్రమైన క్లాత్‌తో తుడుచుకోవాలి. టచ్‌స్క్రీన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలపై సర్టిఫై చేయబడిన డిస్‌ఇన్‌ఫెక్టంట్ క్లీనర్లను మాత్రమే ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.

కారులోకి వైరస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి - కార్ శానిటైజేషన్ చిట్కాలు

కారు ఇంటీరియర్ క్లీనింగ్ కోసం స్ప్రే తరహా ఉత్పత్తులను ఉపయోగిస్తున్నట్లయితే వాటిని నేరుగా డ్యాష్‌బోర్డ్‌పై స్ప్రే చేయకుండా ముందుగా మైక్రోఫైబర్ క్లాత్‌పై స్ప్రే చేసి, ఆ క్లాత్‌తో డ్యాష్‌బోర్డ్‌ని శుభ్రం చేయాలి. ఫ్యాబ్రిక్ సీట్లు, కార్పెట్ ఏరియాలపై ఉండే దుమ్ము ధూళిని వాక్యూమ్ క్లీనర్ సాయంతో శుభ్రం చేసుకోవచ్చు లేదంటే పొడి/తడి బట్టలను ఉపయోగించి క్లీన్ చేసుకోవచ్చు.

MOST READ: బిఎస్6 జావా మోటార్‌సైకిళ్లు వచ్చేస్తున్నాయ్.. ఆర్ఈ క్లాసిక్ 350కి గట్టి పోటీ..!

కారులోకి వైరస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి - కార్ శానిటైజేషన్ చిట్కాలు

లెథర్ వంటి ప్రాంతాలను క్లీన్ చేసేటప్పుడు ముందుగా ఆ క్లీనర్‌ను కారులోని ఏదైనా చిన్న ప్రాంతంలో బొటనవేలితో అప్లయ్ చేసి, సైడ్ ఎఫెక్ట్స్ లేవని నిర్ధారించుకున్న తర్వాతనే మిగిలిన ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయటం వలన లెథర్‌పై సదరు క్లీనర్ ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపటం లేదని నిర్ధారించుకోవచ్చు.

కారులోకి వైరస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి - కార్ శానిటైజేషన్ చిట్కాలు

ఇదివరకు చెప్పుకున్నట్లు మనం రోజు కారులో తాకే బటన్లు, నాబ్స్ మరియు కంట్రోల్ స్విచ్‌లను బయట నుంచి రాగానే వెంటనే క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన వైరస్ కారక క్రిములు ఏవైనా ఉంటే వాటి నుంచి రక్షణ లభిస్తుంది. కారును పూర్తిగా డిస్‌ఇన్‌ఫెక్ట్ చేసిన తర్వాత తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలని ఫోర్డ్ సూచిస్తోంది.

MOST READ: సరికొత్త హోండా గ్రాజియా బిఎస్6 స్కూటర్ టీజర్ విడుదల, వివరాలు

కారులోకి వైరస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి - కార్ శానిటైజేషన్ చిట్కాలు

లాక్‌డౌన్‌ను క్రమక్రమంగా ఎత్తివేస్తున్న నేపథ్యంలో, ప్రజలు ఎక్కువగా బయట తిరిగే అవకాశాలు ఉన్నాయని, ప్రత్యేకించి కార్లలో ప్రయాణించే వారి సంఖ్య అధికంగా ఉంటుందని, ఇటువంటి పరిస్థితుల్లో మనం వైరస్ బారిన పడకుండా ఉండాలంటే కారును శానిటైజ్ చేసుకోవటం అవసరమని ఫోర్డ్ తెలిపింది.

కారులోకి వైరస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి - కార్ శానిటైజేషన్ చిట్కాలు

కారును శానిటైజ్ చేసుకోవటంలో ఫోర్డ్ తెలిపిన సూచనలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల్లో ప్రతి కారు యజమాని కూడా ఈ నియమాలను తప్పనిసరిగా పాటించినట్లయితే వైరస్ బారిన పడే అవకాశం ఉండదు. కార్ శానిటైజేషన్ కోసం కాస్తంత తీసుకున్నా సరే ఈ చిట్కాలను పాటిస్తే మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు మరియు మీ చుట్టూ ఉండే సమాజం స్వచ్ఛంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford India has shared a few trips about sanitising one's car bearing in mind that a lot of people are out on the streets after an almost 90 day lock down. Washing a car regularly will keep the car clean, but not necessarily germ-free. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X