ఆటో ఎక్స్‌పోలో ఒకేసారి 5 కార్లను రిలీజ్ చేసిన కియా మోటార్స్!

సరిగ్గా రెండేళ్ల క్రితం జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌ ద్వారా ఇండియన్ ప్యాసింజర్ కార్ల మార్కెట్లోకి ప్రవేశించిన కియా మోటార్స్, సెల్టోస్ మోడల్‌తో భారీ విజయాన్ని అందుకుంది. అనతి కాలంలోనే ఊహించని సక్సెస్ చూసిన కియా, 2020 ఆటో ఎక్స్‌పోలో ఇండియన్ మార్కెట్ కోసం నమ్మశక్యంగాని కార్లను ఆవిష్కరించింది.

కియా మోటార్స్ ఫ్యూచర్‌లో విడుదల చేసేందుకు ఢిల్లీ ఆటో ఎక్స్‌పో వేదికగా ప్రదర్శించిన కార్ల వివరాలు ఇవాళ్టి స్టోరీలో చూద్దాం రండి...

ఆటో ఎక్స్‌పోలో ఒకేసారి 5 కార్లను రిలీజ్ చేసిన కియా మోటార్స్!

కియా కార్నివాల్

కియా మోటార్స్ 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదికగా దేశీయ మార్కెట్లోకి తమ రెండవ మోడల్ కియా కార్నివాల్ ఎంపీవీ కారును లాంచ్ చేసింది. నమ్మశక్యంగాని ఫీచర్లు, అత్యాధునిక టెక్నాలజీ, విభిన్న సీటింగ్ ఆప్షన్లు, స్లైడింగ్ డోర్లు, డ్యూయల్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌లు ఇంకా ఎన్నో ఫీచర్లు కియా కార్నివాల్ సొంతం. దీని ప్రారంభ ధర రూ. 24.95 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

ఆటో ఎక్స్‌పోలో ఒకేసారి 5 కార్లను రిలీజ్ చేసిన కియా మోటార్స్!

కియా కార్నివాల్ ఎంపీవీ మూడు విభిన్న సీటింగ్ ఆప్షన్లలో లభిస్తోంది. అవి, 7,8 మరియు 9; వివిధ వేరియంట్ల ఆధారంగా సీటింగ్ ఆప్షన్ వేర్వేరుగా ఉంటుంది. సాంకేతికంగా ఇందులో 197బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే డీజల్ ఇంజన్ మరియు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌‍బాక్స్‌తో లభిస్తోంది.

ఆటో ఎక్స్‌పోలో ఒకేసారి 5 కార్లను రిలీజ్ చేసిన కియా మోటార్స్!

కియా కార్నివాల్ లగ్జరీ ఎంపీవీ విపణిలో ఉన్న టయోటా ఇన్నోవా క్రిస్టా కంటే పైస్థానంలో మరియు మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ ఎంపీవీ కంటే క్రింది స్థానంలో నిలిచింది. కానీ ఇన్నోవా క్రిస్టా మోడల్‌కు సరాసరి పోటీనిస్తుంది.

ఆటో ఎక్స్‌పోలో ఒకేసారి 5 కార్లను రిలీజ్ చేసిన కియా మోటార్స్!

కియా సోల్ ఇవి (ఎలక్ట్రిక్ వెహికల్)

కియా సోల్ ఎలక్ట్రిక్ కారును ఆటో ఎక్స్‌పో 2020లో ఆవిష్కరించారు. ఆటో ఎక్స్‌పోలో సందర్శకుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో అని తెలుసుకునేందుకు దీనిని ప్రదర్శించారు. కియా సోల్ పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారును ఇప్పట్లో విడుదల చేసే అవకాశాలు లేవు.

ఆటో ఎక్స్‌పోలో ఒకేసారి 5 కార్లను రిలీజ్ చేసిన కియా మోటార్స్!

కియా సోల్ ఎలక్ట్రిక్ కారును కియా మోటార్స్ తొలిసారిగా 2018 లాస్ ఏంజిల్స్ ఆటో షోలో ఆవిష్కరించారు. ఇందులో 64kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ కలదు, సింగల్ ఛార్జింగ్‌తో గరిష్టంగా 450కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

ఆటో ఎక్స్‌పోలో ఒకేసారి 5 కార్లను రిలీజ్ చేసిన కియా మోటార్స్!

కియా నిరో ఇవి (ఎలక్ట్రిక్ వెహికల్)

కియా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో నిరో ఎలక్ట్రిక్ ఎంట్రీ లెవల్ మోడల్. కియా నిరో ఎలక్ట్రిక్ కారులో కూడా 64kWh సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీ సిస్టమ్ మరియు సింగల్ ఛార్జింగ్‌తో 450కిలోమీటర్ల మైలేజ్‌నిచ్చే ఎలక్ట్రిక్ మోటార్ వ్యవస్థ కలదు.

ఆటో ఎక్స్‌పోలో ఒకేసారి 5 కార్లను రిలీజ్ చేసిన కియా మోటార్స్!

కియా మోటార్స్ అంతర్జాతీయ మార్కెట్లో నిరో కారును పెట్రోల్/డీజల్ ఇంజన్ ఆప్షన్లలో కూడా విక్రయిస్తోంది. ఆటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ, అత్యాధునిక ఫీచర్లు మరియు సేఫ్టీ టెక్నాలజీ వంటివి ఇందులో ప్రత్యేకం. ఏదేమైనప్పటికీ, సోల్ ఎలక్ట్రిక్ తరహాలో నిరో ఎలక్ట్రిక్ కూడా ఇప్పట్లో ఇండియన్ మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ లేదు.

ఆటో ఎక్స్‌పోలో ఒకేసారి 5 కార్లను రిలీజ్ చేసిన కియా మోటార్స్!

కియా సెల్టోస్ ఎక్స్-లైన్

ఇండియన్ మార్కెట్లో లభించే కియా సెల్టోస్ స్టాండర్డ్ వెర్షన్ యొక్క స్టైలిష్ మరియు స్పోర్టివ్ వెర్షన్ కియా సెల్టోస్ ఎక్స్-లైన్. కియా సెల్టోస్ టాప్ ఎండ్ వేరియంట్ GTX+ ఆధారంగా సెల్టోస్ ఎక్స్-లైన్ వేరియంట్ తీసుకొచ్చారు. ఇందులో 1.4-లీటర్ టుర్బో-పెట్రోల్ ఇంజన్ కలదు. 7-స్పీడ్ డైరక్ట్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇంజన్ గరిష్టంగా 140బిహెచ్‌పి పవర్ మరియు 242ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఆటో ఎక్స్‌పోలో ఒకేసారి 5 కార్లను రిలీజ్ చేసిన కియా మోటార్స్!

కియా సెల్టోస్ ఎక్స్-లైన్ వేరియంట్‌ను ప్రస్తుతానికి కాన్సెప్ట్ వెర్షన్‌లో మాత్రమే ఆవిష్కరించారు. సెల్టోస్ సాధారణ వేరియంట్‌తో పోల్చుకుంటే ఇందులో ఎన్నో రకాల బాడీ యాక్ససరీస్ వచ్చాయి. బ్లాక్ ఫినిషింగ్ గల ఫ్రంట్ గ్రిల్, అల్లాయ్ వీల్స్, ఫాగ్ ల్యాంప్స్ మెరిసే సొబగులు, రియర్ ఢిఫ్యూజర్ మరియు సరికొత్త పెయింట్ స్కీమ్ వంటివి ఉన్నాయి.

ఆటో ఎక్స్‌పోలో ఒకేసారి 5 కార్లను రిలీజ్ చేసిన కియా మోటార్స్!

కియా సోనెట్ కాన్సెప్ట్

కియా సోనెట్.. కియా మోటార్స్ ఇండియన్ మార్కెట్ కోసం తీసుకొస్తున్న తొలి కాంపాక్ట్ ఎస్‍యూవీ. అతి త్వరలో విడుదల కానున్న కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని క్యూవైఐ కోడు పేరుతో ఇప్పటికే పలుమార్లు దశల వారీగా పరీక్షించారు. హ్యుందాయ్ వెన్యూ ఆధారంగా డెవలప్ చేసిన కియా సోనెట్ కారును 2021 ప్రారంభం నాటికల్లా లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

ఆటో ఎక్స్‌పోలో ఒకేసారి 5 కార్లను రిలీజ్ చేసిన కియా మోటార్స్!

ఇంజన్ విషయానికి వస్తే, కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, హ్యుందాయ్ వెన్యూలోని బీఎస్6 పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లతో రానుంది. కియా సోనెట్ పూర్తి స్థాయిలో లాంచ్ అయితే, మారుతి సుజుకి వితారా బ్రిజా, టాటా నెక్సాన్, ఫోర్డ్ ఇకోస్పోర్ట్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ300 వంటి ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది.

ఆటో ఎక్స్‌పోలో ఒకేసారి 5 కార్లను రిలీజ్ చేసిన కియా మోటార్స్!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఢిల్లీ వేదికగా జరుగుతున్న 2020 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో కియా మోటార్స్ ఆవిష్కరించిన కొత్త కార్లు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అన్ని మోడళ్లకు చూపరుల నుండి ఊహించని ఆదరణ లభించింది. కియా ప్రదర్శించిన అన్ని మోడళ్లలోకెల్లా కియా సోనెట్ కారును వీలైనంత త్వరగా లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Most Read Articles

English summary
Kia Cars At Auto Expo 2020: Sonet Concept, Seltos X-Line, Carnival, Soul EV & More. Read in Telugu.
Story first published: Sunday, February 9, 2020, 10:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X