దేశంలోనే ఎక్కువగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ఏదో తెలుసా?

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన తమ లేటెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కియా సోనెట్, ఈ విభాగంలో అమ్మకాల పరంగా దూసుకుపోతోంది. గడచిన నవంబర్ నెలలో కియా సోనెట్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడుపోయిన కాంపాక్ట్ ఎస్‌యూవీగా నిలిచింది.

దేశంలోనే ఎక్కువగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ఏదో తెలుసా?

కియా మోటార్స్ ప్రకటించిన తమ నవంబర్ కార్ సేల్స్ రిపోర్ట్ ప్రకారం, కంపెనీ తమ వార్షిక అమ్మకాలలో 50 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపింది. గడచిన నెలలో కియా మోటార్స్ మొత్తం 21,022 యూనిట్లను విక్రయించినట్లు పేర్కొంది.

దేశంలోనే ఎక్కువగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ఏదో తెలుసా?

నవంబర్ 2020లో కియా మోటార్స్ మొత్తం 11,417 సోనెట్ కార్లను విక్రయించింది. అంటే, కియా మోటార్స్ మొత్తం నవంబర్ అమ్మకాల్లో సగానికి పైగా అమ్మకాలు సోనెట్ ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విభాగంలో కియా సోనెట్ ఇప్పుడు అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్-ఎస్‌యూవీగా మారినట్లు కంపెనీ తెలిపింది.

MOST READ:ఒకే కారుని 77 సంవత్సరాలు ఉపయోగించాడు.. ఇంతకీ అతడెవరో తెలుసా ?

దేశంలోనే ఎక్కువగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ఏదో తెలుసా?

ఇప్పటి వరకూ ఈ విభాగంలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మోడల్‌దే అగ్రస్థానం కాగా, గడచిన నవంబర్ నెలలో కియా సోనెట్ ఈ మోడల్‌ను వెనక్కునెట్టి ‘బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్-ఎస్‌యూవీ' టైటిల్‌ను దక్కించుకుంది.

దేశంలోనే ఎక్కువగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ఏదో తెలుసా?

నవంబర్ 2020 నెలలో కియా మోటార్స్ మొత్తం అమ్మకాల్లో మోడల్ వారీ అమ్మకాలను గమనిస్తే, ఈ నెలలో కంపెనీ అత్యధికంగా 11,417 యూనిట్ల సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలను విక్రయించగా, 9,205 యూనిట్ల సెల్టోస్ మిడ్ సైజ్ ఎస్‌యూవీలను మరియు 400 యూనిట్ల కార్నివాల్ ఎమ్‌పివిలను విక్రయించింది.

MOST READ:రూ. 1.26 కోట్ల రూపాలకు అమ్ముడైన 118 సంవత్సరాల పాత వెహికల్ నెంబర్.. ఎందుకో తెలుసా

దేశంలోనే ఎక్కువగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ఏదో తెలుసా?

నవంబర్ 2020 నెల సేల్స్ గురించి కియా మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూఖ్యూన్ షిమ్ మాట్లాడుతూ, దేశీయ మార్కెట్లో తమ వాహనాలకు లభిస్తున్న ఆదరణ పట్ల సంతోషంగా ఉందని, ఇటీవల ప్రవేశపెట్టిన సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ మంచి అమ్మకాలను కనబరిచిందని అన్నారు. రానున్న రోజుల్లో కూడా అమ్మకాలు ఇంతే ప్రోత్సాహకరంగా ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశంలోనే ఎక్కువగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ఏదో తెలుసా?

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి క్లుప్తంగా..

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, కంపెనీ సెప్టెంబర్ 18, 2020వ తేదీన అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేశారు. విడుదల సమయం నుండే ఈ మోడల్ దేశీయ మార్కెట్లో అమ్మకాల పరంగా ముందంజలో ఉంది. ఇందుకు ప్రధాన కారణంగా దీని స్టైలింగ్ మరియు బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్స్.

MOST READ:మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

దేశంలోనే ఎక్కువగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ఏదో తెలుసా?

కియా సోనెట్‌లో ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్, ఎల్‌ఈడి ఫాగ్ లాంప్స్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మొదలైనవి ఉన్నాయి. ఇంకా ఇందులో, ప్రపంచంలోనే మొట్టమొదటి వైరస్ ప్రొటెక్షన్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, బోస్ ప్రీమియం ఆడియో సిస్టమ్ మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లతో సహా అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్‌లు లభిస్తాయి.

దేశంలోనే ఎక్కువగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ఏదో తెలుసా?

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు కియా బ్రాండ్ యొక్క లేటెస్ట్ యువో కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన పెద్ద 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇంకా ఉందులో వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్స్ వంటి మరెన్నో ఆసక్తికరమైన ఫీచర్లు కూడా లభిస్తాయి.

MOST READ:అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్, అతడు నడిపే కార్లు

దేశంలోనే ఎక్కువగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ఏదో తెలుసా?

కియా మోటార్స్ నవంబర్ 2020 కార్ సేల్స్ రిపోర్ట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కియా మోటార్స్ తాజాగా ప్రవేశపెట్టిన సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో అనూహ్యమైన విజయం సాధించడంతో కంపెనీ గడచిన నవంబర్ 2020 నెలలో భారత మార్కెట్లో అమ్మకాల పరంగా 50 శాతం వృద్ధిని నమోదు చేయగలిగింది. కియా సోనెట్ ఈ విభాగంలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, నిస్సాన్ మాగ్నైట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Kia Motors have announced that they have registered a 50 per cent growth in yearly sales, registering 21,022 units in the previous month. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X