కియా సోనెట్ వీడియో ప్రకటన: ఇందులో హైలైట్ చేసిన ఫీచర్లేంటో తెలుసా?

కియా మోటార్స్ నుండి కొత్తగా మార్కెట్లోకి రానున్న మూడవ ఉత్పత్తి 'కియా సోనెట్' కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించి కంపెనీ కొత్తగా ఓ టెలివిజన్ కమర్షియల్‌ను విడుదల చేసింది. 'డిజైన్ బై వైల్డ్' అనే క్యాప్షన్‌తో రాత్రి సమయంలో షూట్ చేసిన ఈ టెలివిజన్ కమర్షియల్‌లో కంపెనీ తమ సోనెట్ ఎస్‌యూవీలోని కీలక ఫీచర్లను హైలైట్ చేసింది.

కియా సోనెట్ వీడియో ప్రకటన: ఇందులో హైలైట్ చేసిన ఫీచర్లేంటో తెలుసా?

ఈ ప్రకటనలో కియా సోనెట్‌లోని పవర్‌ఫుల్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రీమియం బోస్ ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్, బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, రిమోట్ ఇంజన్ స్టార్ట్ వంటి కొన్ని కీలక ఫీచర్లను హైలైట్ చేసింది.

కియా సోనెట్ వీడియో ప్రకటన: ఇందులో హైలైట్ చేసిన ఫీచర్లేంటో తెలుసా?

అంతేకాకుండా, లో వాటర్ క్రాసింగ్ మరియు ఆఫ్-రోడ్ టెర్రైన్ వంటి రోడ్లపై కూడా సోనెట్ పనితీరును వెల్లడించేలా ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆఫ్-రోడ్ సామర్థ్యాలను కూడా కంపెనీ ఈ వీడియోలో హైలైట్ చేసింది. మరి ఆ కమర్షియల్ వీడియోని మీరు కూడా చూసేయండి.

MOST READ: స్కొడా ఎన్యాక్ ఐవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇంటీరియర్ స్కెచెస్ విడుదల

ఇక కియా సోనెట్ విషయానికి వస్తే, భారత మార్కెట్లో కియా మోటార్స్‌కు ఇది మూడవ ఉత్పత్తి. కియా దీనిని ఎంట్రీ లెవల్ మోడల్‌గా ప్రవేశపెట్టింది. కియా సెల్టోస్ తరువాత కంపెనీకి ఇది రెండవ ‘మేడ్-ఇన్-ఇండియా' ఉత్పత్తి అవుతుంది.

కియా సోనెట్ వీడియో ప్రకటన: ఇందులో హైలైట్ చేసిన ఫీచర్లేంటో తెలుసా?

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కాంపాక్ట్ సైజ్, స్టైలిష్ డిజైన్, సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్స్, బెస్ట్ సేఫ్టీ, విభిన్న ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్స్, ఆకర్షనీయమైన ఇంటీరియర్స్, ఆకట్టుకు పెయింట్ స్కీమ్స్ వంటి అనేక విశిష్టమైన ఫీచర్లతో కస్టమర్ల ఇట్టే ఆకర్షిస్తోంది. ఈ మోడల్‌కు బుకింగ్స్ ప్రారంభమైన మొదటి రోజే 6500 యూనిట్లకు పైగా బుకింగ్స్ వచ్చాయంటే, మార్కెట్లో దీనిపై ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

MOST READ: మహీంద్రా మరాజో బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కియా సోనెట్ వీడియో ప్రకటన: ఇందులో హైలైట్ చేసిన ఫీచర్లేంటో తెలుసా?

మరికొద్ది రోజుల్లో కియా సోనెట్ కస్టమర్ల కోసం అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ నెలలోనే ఈ మోడల్ విడుదల మరియు డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కియా సోనెట్ వీడియో ప్రకటన: ఇందులో హైలైట్ చేసిన ఫీచర్లేంటో తెలుసా?

కియా సోనెట్ మొత్తం మూడు ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది, ఇందులో రెండు పెట్రోల్, ఒక డీజిల్ ఇంజన్ ఉన్నాయి. అవి: 1.2-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ మరియు 1.0-లీటర్ టి-జిడిఐ పెట్రోల్ ఇంజన్. వీటిలో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.2-లీటర్ ఎన్‌ఏ పెట్రోల్ ఇంజన్‌లను హ్యుందాయ్ వెన్యూ నుండి గ్రహించారు.

MOST READ: గుడ్‌న్యూస్.. డిసెంబర్ 31 వరకూ వాహన డాక్యుమెంట్స్ వ్యాలిడిటీ పొడగింపు

కియా సోనెట్ వీడియో ప్రకటన: ఇందులో హైలైట్ చేసిన ఫీచర్లేంటో తెలుసా?

ఇకపోతే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ను కియా సెల్టోస్ నుండి గ్రహించారు. సోనెట్‌లోని డీజిల్ ఇంజన్ రెండు విభిన్న ట్యూన్‌లలో లభ్యం కానుంది. అన్ని ఇంజన్‌లు విభిన్న గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభ్యం కానున్నాయి. వీటిలో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్, 7-స్పీడ్ డిసిటి మరియు 7-స్పీడ్ ఐఎమ్‌టి గేర్‌బాక్స్‌లు ఉన్నాయి.

కియా సోనెట్ వీడియో ప్రకటన: ఇందులో హైలైట్ చేసిన ఫీచర్లేంటో తెలుసా?

కియా సోనెట్‌లో అనేక ఫీచర్లు మరియు పరికరాలను జోడించారు. ఇందులో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడి ఫాగ్ ల్యాంప్స్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ: విడుదలై నెల కూడా కాలేదు, అప్పుడే రూ.46,000 పెరిగిన హెక్టర్ ప్లస్ ధర!

కియా సోనెట్ వీడియో ప్రకటన: ఇందులో హైలైట్ చేసిన ఫీచర్లేంటో తెలుసా?

కియా సోనెట్ టెలివిజన్ కమర్షియల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కియా తమ సెల్టోస్ మోడల్‌తో ఇప్పటికే మార్కెట్లో బలమైన బ్రాండ్ ఇమేజ్‌ను ఏర్పాటు చేసుకుంది. ఈ నేపథ్యంలో, కొత్తగా ఆవిష్కరించిన సోనెట్ కూడా కస్టమర్లను మొదటి చూపులోనే ఆకట్టుకుంటోంది. తాజాగా వైల్డ్ బై డిజైన్ అనే క్యాప్షన్‌తో సోనెట్ కారులోని కీలకమైన ఫీచర్లను హైలైట్ చేస్తూ కియా విడుదల చేసిన ఈ కమర్షియల్‌తో మరింత మంది ఆకట్టుకునే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Kia Motors has released a new TV commercial for its Sonet Compact SUV, highlighting its features. Take a look. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X