కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ డీటేల్స్ లీక్

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ గడచిన సంవత్సరం భారత మార్కెట్లో విడుదల చేసిన తమ మొట్టమొదటి ఉత్పత్తి 'కియా సెల్టోస్' మార్కెట్లో అనూహ్య స్పందనను సొంతం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసినదే. ఈ మోడల్ మార్కెట్లోకి ప్రవేశించి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా కంపెనీ ఇందులో ఓ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ డీటేల్స్ లీక్

మరోవైపు భారత్‌లో పండుగ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో, ఈ ఫెస్టివ్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు కియా మోటార్స్ తమ పాపులర్ సెల్టోస్‌లో ‘యానివర్స్‌రే ఎడిషన్'ను విడుదల చేయనుంది. తాజాగా, ఇందుకు సంబంధించి టీమ్-బిహెచ్‌పి కొన్ని చిత్రాలు మరియు వివరాలను లీక్ చేసింది.

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ డీటేల్స్ లీక్

లీకైన సమాచారం ప్రకారం, కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్‌ను స్టాండర్డ్ సెల్టోస్ 'హెచ్‌టిఎక్స్' మిడ్ వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసే అవకాశం ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్ ఎస్‌యూవీలో కొన్ని ప్రత్యేకమైన అప్‌డేట్స్ మరియు కాస్మెటిక్ మార్పులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షిస్తుందని కంపెనీ భావిస్తోంది.

MOST READ:ఫెస్టివల్ సీజన్లో హోండా సూపర్ 6 ఫెస్టివల్ ఆఫర్స్.. చూసారా

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ డీటేల్స్ లీక్

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. వీటిలో రెండు కలర్ ఆప్షన్లు ప్రత్యేకమైనవి. ఇందులో గ్రావిటీ గ్రే / అరోరా బ్లాక్ పెరల్ మరియు స్టీల్ సిల్వర్ / అరోరా బ్లాక్ పెరల్ ఉన్నాయి. అరోరా బ్లాక్ పెరల్ మరియు గ్లాసీయర్ వైట్ / అరోరా బ్లాక్ పెరల్ అనేవి స్టాండర్డ్ పెయింట్ స్కీమ్స్.

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ డీటేల్స్ లీక్

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ మోడల్స్‌లో ఎస్‌యూవీ చుట్టూ ‘టాన్జేరిన్ ఆరెంజ్' యాక్సెంట్స్ ఉంటాయి. ఇందులో ఫాగ్ లాంప్ హౌసింగ్, సెంటర్ వీల్ క్యాప్స్, సైడ్ సిల్స్, సెల్టోస్ బ్యాడ్జింగ్ మరియు ఫాక్స్ డ్యూయెల్ మఫ్లర్స్ ఉంటాయి.

MOST READ:ముంబై వీధుల్లో సైకిల్ పై కనిపించిన రణబీర్ కపూర్.. ఎందుకో తెలుసా?

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ డీటేల్స్ లీక్

ఈ స్పెషల్ ఎడిషన్ ఎస్‌యూవీలో కొత్తగా 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు ఫిన్స్‌తో కూడిన రియర్ స్కిడ్ ప్లేట్స్ ఉంటాయి, ఇవి రెండూ కొత్త ‘రావెన్ బ్లాక్' కలర్‌లో ఫినిష్ చేయబడి ఉంటాయి. కాగా, తాజాగా వచ్చిన నివేదికల ప్రకారం, కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ మోడల్ స్టాండర్డ్ మోడళ్ల కంటే 60 మి.మీ పొడవుగా ఉంటుందని సమాచారం. ఇందులో కొత్త ఫ్రంట్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్లను చేర్చడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ డీటేల్స్ లీక్

ఇంటీరియర్స్‌లో కూడా కొన్ని అప్‌డేట్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో లెథెరెట్ సీట్ అప్‌హోలెస్ట్రీ, డోర్ ప్యానెళ్లపై బ్లాక్ ట్రిమ్స్ మొదలైన మార్పులు ఉండనున్నాయి.

MOST READ:సెక్యూరిటీ గార్డు ప్రాణాలు తీసిన ఫెరారీ కార్.. ఎలాగో తెలుసా ?

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ డీటేల్స్ లీక్

కాగా, కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్‌లో చేయనున్న అన్ని మార్పలు కాస్మెటిక్‌గా మాత్రమే ఉండనున్నాయి, ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవు. ఈ ఎస్‌యూవీలో ఇదివరకు ఆఫర్ చేసిన ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఎంపికలే కొత్త యానివర్స్‌రే ఎడిషన్‌లోనూ కొనసాగుతాయి.

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ డీటేల్స్ లీక్

ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి, ఇవి రెండూ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్‌లోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షనల్ ఐవిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడా లభిస్తుంది.

MOST READ:జరభద్రం గురూ.. కారులో ఇలా చేసారంటే ప్రాణాలే పోవచ్చు.. కావాలంటే ఇది చూడండి

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ డీటేల్స్ లీక్

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కియా సెల్టోస్ భారత మార్కెట్లో అతి తక్కువ సమయంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీలలో ఒకటిగా నిలించింది. దేశీయ విపణిలో ఈ మోడల్ అమ్మకాలు ప్రతి నెలా స్థిరంగా కొనసాగుతున్నాయి మరియు ఇది దేశంలోని టాప్-10 కార్లలో ఒకటిగా ఉంది. కియా బ్రాండ్ అమ్మకాలను మరింత మెరుగుపరిచేందుకు, ఈ కొత్త యానివర్స్‌రే ఎడిషన్ సహకరిస్తుందనేది మా అభిప్రాయం.

Source:Team-BHP

Most Read Articles

English summary
Kia Motors entered the Indian market last year, with the Seltos being their maiden product. The mid-size SUV became an instant hit in the market, even going on to become one of the best-selling products in the segment. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X