దేశీయ మార్కెట్లో కియా సెల్టోస్ వెయిటింగ్ పీరియడ్ ; వివరాలు

కియా మోటార్స్ యొక్క కియా సెల్టోస్ ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఈ ఎస్‌యూవీ యొక్క వెయిటింగ్ పీరియడ్ రోజు రోజుకి పెరుగుతోంది. కియా సెల్టోస్ దాని బేస్ వేరియంట్ నుండి టాప్ వేరియంట్ వరకు, ఇప్పుడు దాదాపు 1 నెల నుండి 4 నెలల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇటీవల కంపెనీ వెల్లడించిన ఫొటోలో ఈ విషయం వెల్లడైంది.

దేశీయ మార్కెట్లో కియా సెల్టోస్ వెయిటింగ్ పీరియడ్ ; వివరాలు

కియా సెల్టోస్ ప్రస్తుతం హ్యుందాయ్ క్రెటా తరువాత దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడైన రెండవ ఎస్‌యూవీ. ఇటీవల సెల్టోస్ యానివెర్సరీ ఎడిషన్ దాని ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రారంభించబడింది. ఇది చాలా నవీకరణలు పొందటమే కాకుండా ఆకర్షణీయమైన రూపాన్ని కూడా కలిగి ఉంది. ఈ ఎస్‌యూవీకి ఒక సంవత్సరం పూర్తయినప్పటికీ డిమాండ్ ఇంకా తగ్గలేదు.

దేశీయ మార్కెట్లో కియా సెల్టోస్ వెయిటింగ్ పీరియడ్ ; వివరాలు

కియా సెల్టోస్ యొక్క జిటిఎక్స్ ట్రిమ్‌ వేరియంట్ కోసం ఇప్పుడు 3 నుంచి 4 వారాలు, జిటిఎక్స్ ప్లస్ కోసం 14 నుంచి 15 వారాలు మరియు జిటిఎక్స్ ప్లస్ 7 డిసిటి కోసం 10 నుంచి 11 వారాలు వేచి ఉండాల్సి ఉంటుంది. అదే సమయంలో పెట్రోల్ ఇంజిన్ యొక్క అన్ని వేరియంట్ల కోసం 14 నుంచి 15 వారాల వెయిటింగ్ ఉంటుంది.

MOST READ:ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం.. అదేంటో తెలుసా ?

దేశీయ మార్కెట్లో కియా సెల్టోస్ వెయిటింగ్ పీరియడ్ ; వివరాలు

డీజిల్ వేరియంట్ యొక్క అన్ని వేరియంట్లలో 15 నుంచి 16 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సాధారణంగా ఏదైనా ఒక మోడల్ మార్కెట్లో ఒక సంవత్సరం పాటు ఉంటుంది. కానీ కియా సెల్టోస్ వెయిటింగ్ పీరియడ్‌ ఇప్పుడు ప్రశ్నర్థకంగా మారింది. అయితే కియా మోటార్స్ దీని గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

దేశీయ మార్కెట్లో కియా సెల్టోస్ వెయిటింగ్ పీరియడ్ ; వివరాలు

ప్రస్తుతం కంపెనీ దేశీయ మార్కెట్లో మూడు మోడళ్లను విక్రయిస్తోంది. ఈ మూడు మోడళ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కంపెనీ ప్రస్తుత మూడింటిని ఒకే ప్లాంట్ లో ఉత్పత్తి చేస్తోంది. సెల్టోస్ ఎస్‌యూవీ కోసం ఎక్కువ కలం వేచి ఉండాల్సి వస్తోంది. కియా సెల్టోస్ దేశీయ మార్కెట్లో విడుదలైన కేవలం 14 నెలల్లో దాదాపు 1.25 లక్షల యూనిట్లకు విక్రయించి మార్కెట్లో తనకున్న డిమాండ్ ను ఋజువుచేసుకుంది.

MOST READ:బ్రేకింగ్.. 6 సీటర్ థార్ ఎస్‌యూవీని నిలిపివేయనున్న మహీంద్రా.. ఎందుకో తెలుసా !

దేశీయ మార్కెట్లో కియా సెల్టోస్ వెయిటింగ్ పీరియడ్ ; వివరాలు

కియా మోటార్స్ భారతదేశంలో అడుగుపెట్టినప్పటినుంచి వినియోగదారుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ ఎస్‌యూవీ కేవలం ఒక సంవత్సరంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీలలో ఒకటిగా నిలిచింది. కియా సెల్టోస్ యొక్క ఎంట్రీ లెవల్ మోడల్ ధర రూ . 9.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్ మోడల్ ధర రూ. 17.34 లక్షలు (ఎక్స్-షోరూమ్).

దేశీయ మార్కెట్లో కియా సెల్టోస్ వెయిటింగ్ పీరియడ్ ; వివరాలు

కియా సెల్టోస్ అనేక కొత్త ఫీచర్లు మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, పుష్ స్టార్ట్ / స్టాప్ బటన్, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సీటుతో వెంటిలేటెడ్ సీట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఏది ఏమైనా భారతదేశంలో మంచి అమ్మకాలతో కియా సెల్టోస్ పరుగులు పెడుతూ మంచి ఆదరణను పొందుతోంది.

MOST READ:టైటానికి షిప్‌ను తలపిస్తున్న ఫెర్రీ షిప్ : పూర్తి వివరాలు

Most Read Articles

English summary
Kia Seltos Waiting Period Upto 4 Months. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X