Just In
- 12 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 15 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 16 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 16 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
రఘురామ మళ్లీ కౌంటర్.. సీఎం జగన్ కూడా భాగస్వాములే.. హాట్ కామెంట్స్..
- Movies
చరిత్ర సృష్టించిన సుడిగాలి సుధీర్: వాళ్లందరిపై ఆధిపత్యం చూపిస్తూ.. ఊహించని రికార్డు సొంతం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జనవరి 1 నుండి భారీగా పెరగనున్న కియా సోనెట్, సెల్టోస్ ధరలు
కియా మోటార్స్ అందిస్తున్న సోనెట్ మరియు సెల్టోస్ కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుండి ఈ కార్ల ధరలు పెరుగుతాయని కంపెనీ ప్రకటించింది. అయితే, ఎంత మేర వీటి ధరలు పెరుగుతాయనే విషయాన్ని మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ఈ మేరకు కియా మోటార్స్ తమ డీలర్ భాగస్వాములకు ఓ లేఖను కూడా పంపింది. ఆ లేఖ ప్రకారం, జనవరి 1, 2021వ తేదీ నుండి సొనెట్ మరియు సెల్టోస్ మోడళ్లు ధరలు పెరుగుతాయని కియా మోటార్స్ పేర్కొంది. ఇందులో కార్నివాల్ మోడల్ గురించి కంపెనీ ప్రస్తావించలేదు.

ఈ నేపథ్యంలో, కంపెనీ అందిస్తున్న ప్రీమియం ఎమ్‌పివి కియా కార్నివాల్ ధరలు మాత్రం పెరగబోవని తెలుస్తోంది. కియా మోటార్స్ పంపిన లేఖలో ఈ రెండు మోడళ్ల ధరల్లో 'గణనీయమైన' పెరుగుదల ఉంటుందని కంపెనీ తమ డీలర్లకు తెలిపింది. దీన్నిబట్టి చూస్తుంటే ఈ రెండు మోడళ్ల ధరలు భారీగా పెరగవచ్చని తెలుస్తోంది.
MOST READ:ఒకే వారంలో రెండుసార్లు జరిమానా చెల్లించిన డిప్యూటీ మేయర్.. ఎవరో తెలుసా ?

కాగా, డిసెంబర్ 31, 2020 నాటికి డెలివరీ తీసుకునే వారందరికీ ప్రస్తుత రేట్లే వర్తిస్తాయని, ఆ తర్వాతి కాలంలో డెలివరీ తీసుకునే కస్టమర్లు మాత్రం కొత్త ధరను చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది.
కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని సెప్టెంబర్ 18, 2020వ తేదీన అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేశారు. అప్పటి నుండి ఈ మోడల్‌ను ప్రారంభ పరిచయ ధరతోనే విక్రయిస్తున్నాయి. వచ్చే జనవరి నుండి ఈ మోడల్ ధరలు పెరుగుతాయి.

అలాగే, కంపెనీ అందిస్తున్న కియా సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్యూవీ ధరలను చివరిసారిగా ఈ ఏడాది జనవరిలో పెంచారు. ఆ తర్వాత ఈ మోడల్ ధరలను పెంచలేదు. కియా మోటార్స్ ఇప్పటి వరకూ భారత మార్కెట్లో 1 లక్ష యూనిట్లకు పైగా సెల్టోస్ కార్లను విక్రయించింది.
MOST READ:అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్, అతడు నడిపే కార్లు

పెరుగుతున్న ముడి పదార్థాల ధరలు, రవాణా ఖర్చులు ఫలితంగా పెరుగుతున్న ఉత్పాదక వ్యయాలను దృష్టిలో ఉంచుకొని దేశంలోని దాదాపు అన్ని కార్ కంపెనీలు కూడా కొత్త సంవత్సరంలో తమ వాహనాల ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే నిస్సాన్, ఫోర్డ్, మారుతి సుజుకి వంటి కంపెనీలు తమ వాహనాలను ధరలను జనవరి 2021లో పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే.

ఇక కియా సోనెట్ విషయానికి వస్తే, ఈ మోడల్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. దేశంలో ఈ మోడల్‌కు ఊహించని డిమాండ్ రావటంతో దీని వెయిటింగ్ పీరియడ్ కూడా అమాంతం పెరిగిపోయింది. వేరియంట్‌ను బట్టి ఈ కాంపాక్ట్ ఎస్యూవీ కోసం 5 నెలల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.
MOST READ:యజమాని డ్రైవింగ్ సమయంలో రివర్స్ పార్కింగ్ కెమెరాలాగ పనిచేస్తున్న పెంపుడు కుక్క [వీడియో]

కియా సోనెట్ పెట్రోల్ మాన్యువల్ మోడల్ యొక్క అన్ని వేరియంట్లు 18 - 19 వారాల పాటు వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉండగా, టర్బో డిసిటి హెచ్టికె ప్లస్ మరియు హెచ్టిఎక్స్ ప్లస్ వేరియంట్ల కోసం, సుమారు 6 - 7 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది.

ఈ మోడల్ మార్కెట్లో విడుదలైన కేవలం రెండు నెలల్లోనే దీని కోసం 50,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చాయి. అయితే, డిసెంబర్ 31 లోపు డెలివరీలు తీసుకునే కస్టమర్లు మాత్రం ఎటువంటి ఆందోళన చెందాల్సిన లేదు. ఈ డెలివరీలకు సంబంధించి డీలర్‌షిప్‌లు ఫోన్ ద్వారా కానీ లేదా ఇమెయిల్ ద్వారా తెలియడం జరుగుతుంది.
MOST READ:కిడ్నీ తరలించడానికి లంబోర్ఘిని కారు ఉపయోగించిన పోలీసులు.. ఎక్కడో తెలుసా?

కియా సోనెట్‌లో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి టెయిల్ లైట్స్, ఎల్ఈడి డిఆర్ఎల్, ఎల్ఈడి ఫాగ్ లాంప్స్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మొదలైనవి ఉన్నాయి. ఇంకా ఇందులో, ప్రపంచంలోనే మొట్టమొదటి వైరస్ ప్రొటెక్షన్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, బోస్ ప్రీమియం ఆడియో సిస్టమ్ మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లతో సహా అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లు లభిస్తాయి.

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు కియా బ్రాండ్ యొక్క లేటెస్ట్ యువో కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన పెద్ద 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇంకా ఉందులో వైర్లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్స్ వంటి మరెన్నో ఆసక్తికరమైన ఫీచర్లు కూడా లభిస్తాయి.