దూసుకెళ్తున్న కియా సోనెట్ బుకింగ్స్; పెరగనున్న వెయిటింగ్ పీరియడ్!?

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ కేంద్రంగా పనిచేస్తున్న కియా మోటార్స్ ఇండియా, ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అమ్మకాల పరంగా దూసుకుపోతోంది. ఈ మోడల్ కోసం ఇప్పటికే 50,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ అందుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.

దూసుకెళ్తున్న కియా సోనెట్ బుకింగ్స్; పెరగనున్న వెయిటింగ్ పీరియడ్!?

కియా సోనెట్ కోసం ఆగస్టు 20వ తేదీ నుండే అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ కొత్త మైలురాయిని సాధించినట్లు కంపెనీ తెలిపింది. కియా మోటార్స్ గత రెండు నెలల్లో ప్రతి మూడు నిమిషాలకు సగటున రెండు బుకింగ్‌లు అందుకున్నట్లు పేర్కొంది. ఈ మోడల్ మార్కెట్లో 12 రోజుల్లోనే, సెప్టెంబర్ 2020 నెలలో మొత్తం 9,266 యూనిట్ల సోనెట్ వాహనాలను డెలివరీ చేసి మరో కొత్త రికార్డును సాధించింది.

దూసుకెళ్తున్న కియా సోనెట్ బుకింగ్స్; పెరగనున్న వెయిటింగ్ పీరియడ్!?

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కియా సోనెట్ కోసం ఇప్పటి వరకూ అందుకున్న మొత్తం బుకింగ్స్‌లో 1.0-లీటర్ మరియు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు 60 శాతం ఉన్నట్లు తెలిపింది. అంటే దాదాపు 30,000 మందికి పైగా సోనెట్ కస్టమర్లు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను ఎంచుకున్నారు. మిగిలిన కస్టమర్లు 1.5 సిఆర్‌డి డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ను ఎంచుకున్నారు.

MOST READ:కర్ణాటకలో కొత్త హెల్మెట్ రూల్.. అదేంటో తెలుసా ?

దూసుకెళ్తున్న కియా సోనెట్ బుకింగ్స్; పెరగనున్న వెయిటింగ్ పీరియడ్!?

"దేశంలో కోవిడ్-19 వలన ఏర్పడిన అంతరాయాలు, ఆ తర్వాతి పరిణామాలు సవాలుగా మారినప్పటికీ, కియా మోటార్స్ ఇండియా వాగ్దానం చేసిన కాలపరిమితి ప్రకారం సోనెట్‌ను పంపిణీ చేయడమే కాకుండా, భారీ కస్టమర్ డిమాండ్‌ను తీర్చడానికి తమ అనంతపురం ప్లాంట్‌లో ఈ వాహనాన్ని నిరంతరాయంగా ఉత్పత్తి చేస్తోందని" కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

దూసుకెళ్తున్న కియా సోనెట్ బుకింగ్స్; పెరగనున్న వెయిటింగ్ పీరియడ్!?

కియా సోనెట్ సెప్టెంబర్ 18, 2020వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేశారు. కంపెనీ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని రూ.6.71 లక్షల నుంచి రూ.12.89 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్, ఇండియా) విక్రయిస్తోంది. కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని డ్రైవ్‌స్పార్క్ బృందం టెస్ట్ డ్రైవ్ కూడా చేసింది. - ఈ బుజ్జి మోడల్‌పై మా అభిప్రాయాన్ని ఈ లింకుపై క్లిక్ చేసి తెలుసుకోండి.

MOST READ:కొంపముంచిన గూగుల్ మ్యాప్‌.. ఇంతకీ ఎం జరిగిందో తెలుసా ?

దూసుకెళ్తున్న కియా సోనెట్ బుకింగ్స్; పెరగనున్న వెయిటింగ్ పీరియడ్!?

కియా సోనెట్ కాంపాక్ట్-ఎస్‌యూవీలో ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్, ఎల్‌ఈడి ఫాగ్ లాంప్స్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మొదలైనవి ఉన్నాయి. ఇంకా ఇందులో, ప్రపంచంలోనే మొట్టమొదటి వైరస్ ప్రొటెక్షన్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, బోస్ ప్రీమియం ఆడియో సిస్టమ్ మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లతో సహా అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్‌లను కంపెనీ అందిస్తోంది.

దూసుకెళ్తున్న కియా సోనెట్ బుకింగ్స్; పెరగనున్న వెయిటింగ్ పీరియడ్!?

అంతేకాకుండా, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు కియా బ్రాండ్ యొక్క యువో కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన పెద్ద 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్స్ ఇలా మరెన్నో ఆసక్తికరమైన ఫీచర్లతో కియా సోనెట్ లభ్యం కానుంది.

MOST READ:యమహా క్యూటెస్ట్ స్కూటర్ 'వినోరా' గురించి మీకు తెలుసా?

దూసుకెళ్తున్న కియా సోనెట్ బుకింగ్స్; పెరగనున్న వెయిటింగ్ పీరియడ్!?

కియా సోనెట్ విభిన్న ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. అందులో ఒకటి 84 బిహెచ్‌పి పవర్, 115 ఎన్ఎమ్ టార్క్‌‌ని ఉత్పత్తి చేసే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. రెండవది 119 బిహెచ్‌పి పవర్, 172 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ లేదా 6-స్పీడ్ (ఐఎమ్‌టి) ఇంటెలిజెంట్ మాన్యువల్ గేర్‌బాక్స్‌‌తో లభిస్తుంది.

దూసుకెళ్తున్న కియా సోనెట్ బుకింగ్స్; పెరగనున్న వెయిటింగ్ పీరియడ్!?

ఇందులోని డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇవి రెండు వేర్వేరు ట్యూనింగ్స్‌లో లభిస్తాయి. అందులో మొదటిది 99 బిహెచ్‍‌పి పవర్, 240 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ వేస్ట్-గేట్ టర్బో (డబ్ల్యుజిటి). ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌‌తో లభిస్తుంది. ఇందులో రెండవది 114 బిహెచ్‌పి పవర్, 250 ఎన్ఎమ్ టార్క్‌‌ని ఉత్పత్తి చేసే 1.5 లీటర్ వేరియబుల్ జియోమెట్రీ టర్బో (విజిటి) ఇంజన్. ఇది సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌‌తో లభిస్తుంది.

MOST READ:ట్రాఫిక్ ఉల్లంఘనలపై విరుచుకుపడుతున్న పోలీసులు.. ఇప్పటికే 15000 మంది లిస్ట్ రెడీ

దూసుకెళ్తున్న కియా సోనెట్ బుకింగ్స్; పెరగనున్న వెయిటింగ్ పీరియడ్!?

కియా సోనెట్ బుకింగ్స్ మైల్‌స్టోన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు భారీ గిరాకీ ఏర్పడింది. ఈ విభాగంలో ఇప్పటికే అనేక కొత్త మోడళ్లు విడుదలయ్యాయి మరికొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ విభాగంలో లేటెస్ట్‌గా వచ్చిన కియా సోనెట్ దాని మోడ్రన్ డిజైన్, అడ్వాన్స్డ్ ఫీచర్లతో కస్టమర్లను మొదటి చూపులోనే కట్టిపడేస్తోంది.

Most Read Articles

English summary
Kia Motors India has announced that it has received over 50,000 bookings for the Sonet in the Indian market. The compact-SUV from the brand has achieved a new milestone mark within just two months since the commencement of its pre-launch bookings on August 20. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X