ఆటో ఎక్స్‌పో 2020: కియా సోనెట్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ రిలీజ్

ఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2020 ఈవెంట్లో కియా సోనెట్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని రివీల్ చేశారు. కియా మోటార్స్ ఇండియా విభాగం సరికొత్త కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. కియా సెల్టోస్, కార్నివాల్ ఎంపీవీ తర్వాత ఇండియన్ మార్కెట్లోకి తీసుకొస్తున్న మూడవ మోడల్ కియా సోనెట్.

ఆటో ఎక్స్‌పో 2020: కియా సోనెట్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ రిలీజ్

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని పాపులర్ హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీ ఆధారంగా డెవలప్ చేశారు. గతంలో క్యూవైఐ కోడ్ పేరుతో పలుమార్లు రహస్యంగా పరీక్షించిన కియా మోటార్స్ తాజాగ సోనెట్ కాన్సెప్ట్ వెర్షన్ మన ముందుకు తీసుకొచ్చింది. 2020 చివరినాటికల్లా దేశీయ మార్కెట్లోకి పూర్తి స్థాయిలో లాంచ్ చేయనున్నారు.

ఆటో ఎక్స్‌పో 2020: కియా సోనెట్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ రిలీజ్

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పూర్తి స్థాయిలో విడుదలైతే, విపణిలో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, మహీంద్రా ఎక్స్‌యూవీ300, ఫోర్డ్ ఇకోస్పోర్ట్, టాటా నెక్సాన్ మరియు హ్యుందాయ్ వెన్యూ మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

ఆటో ఎక్స్‌పో 2020: కియా సోనెట్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ రిలీజ్

కియా సోనెట్ కాన్సెప్ట్ వెర్షన్ అత్యంత ఆకర్షణీయమైన డిజైన్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులోని టైగర్-నోస్ ఫ్రంట్ గ్రిల్, రెడ్ కలర్ హైలెట్స్, పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్ల జోడింపు గల ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, కండలు తిరిగిన శరీరాకృతి, రియర్ డిజైన్‌లో డిక్కీ డోర్ చుట్టూ ఉన్న సింగల్ ఎల్ఈడీ లైట్ స్ట్రిప్ వంటివి ఎంతో స్టైలిష్‌గా ఉన్నాయి.

ఆటో ఎక్స్‌పో 2020: కియా సోనెట్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ రిలీజ్

కొరియన్ ప్యాసింజర్ కార్ల దిగ్గజ కియా మోటార్స్ కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో హ్యుందాయ్ వెన్యూలో ఉన్నటువంటి అవే ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లను అందివ్వనుంది.

ఆటో ఎక్స్‌పో 2020: కియా సోనెట్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ రిలీజ్

సాంకేతికంగా కియా సోనెట్ ఎస్‌యూవీ 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టుర్భో పెట్రోల్ మరియు 1.4-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. వీటిని మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు టాప్ ఎండ్ వేరియంట్లను ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

ఆటో ఎక్స్‌పో 2020: కియా సోనెట్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ రిలీజ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ భారీ విజయాన్ని అందుకుంది. ఈ విభాగంలో ఉన్న డిమాండ్ మరియు అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కియా సోనెట్ ఎస్‌యూవీని సిద్దం చేస్తున్నారు.

కియా సెల్టోస్ మరియు అతి త్వరలో విడుదల కానున్న కియా కార్నివాల్ ఎంపీలు మంచి సక్సెస్ అందుకున్నాయి. పోటీదారులకు ధీటైన పోటీనిస్తూనే, కస్టమర్లను ఆకట్టుకోవడానికి సుమారు రూ. 8 లక్షల నుండి 12 లక్షల ధర శ్రేణిలో దీనిని విడుదల చేసే అకాశం ఉంది.

కియా సోనెట్ ఎస్‌యూవీ గురించి మీ అభిప్రాయం క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాకు చెప్పండి, ఆటో ఎక్స్‌పో 2020లో కియా మోటార్స్ ఇంకా ఎన్నో మోడళ్లను ఆవిష్కరిస్తోంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగు చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Auto Expo 2020: Kia Sonet Concept Unveiled - Expected Launch Date, Prices, Specs & Images. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X