కియా సోనెట్ డెలివరీస్ షురూ.. !

కియా సోనెట్ భారతదేశంలో లాంచ్ అయిన ఒక రోజు తర్వాత డెలివరీని ప్రారంభించింది. కియా మోటార్స్ ఈ కొత్త సోనెట్ ఎస్‌యూవీని వివిధ వేరియంట్లలో మార్కెట్లో ప్రవేశపెట్టింది. కియా సొనెట్ ఇప్పటికే 25,000 బుకింగ్స్ అందుకుంది మరియు సంస్థ దేశంలోని అనేక ప్రాంతాలలో డెలివరీ ప్రారంభించింది.

కియా సోనెట్ డెలివరీస్ షురూ.. !

కియా సోనెట్ 6.71 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద ప్రవేశపెట్టబడింది, కంపెనీ తన టాప్ వేరియంట్ ధర రూ. 11.99 లక్షలు. సోనెట్ యొక్క జిటిఎక్స్ ప్లస్ వేరియంట్ సెప్టెంబర్ చివరిలో లాంచ్ అవుతుంది.

కియా సోనెట్ డెలివరీస్ షురూ.. !

కియా సొనెట్ ఆరు వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది, జిటి-లైన్ మరియు టెక్ లైన్ ట్రిమ్ కింద ఉన్నాయి. జిటి లైన్ ట్రిమ్‌లో హెచ్‌టిఇ, హెచ్‌టికె, హెచ్‌టికె ప్లస్, హెచ్‌టిఎక్స్, హెచ్‌టిఎక్స్ ప్లస్ మరియు జిటిఎక్స్ ప్లస్ వేరియంట్లు ఉన్నాయి.

MOST READ:3 కి.మీ ఒక్కడే కాలువ తవ్విన అపర భగీరధునికి ట్రాక్టర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా.. ఇంతకీ ఎవరితను తెలుసా ?

కియా సోనెట్ డెలివరీస్ షురూ.. !

ఆగస్టు 20 నుండి సొనెట్ బుకింగ్ ప్రారంభమైంది, మొదటి రోజున 6500 కు పైగా బుకింగ్‌లు వచ్చాయి. రూ. 25 వేలు చెల్లించి కంపెనీ డీలర్‌షిప్ లేదా కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. కంపెనీ అప్పటికే సొనెట్‌ను డీలర్‌షిప్‌లకు పంపడం ప్రారంభించింది. సొనెట్ డెలివరీ కోసం సన్నాహాలు ప్రారంభించింది. అయితే, కొత్త బుకింగ్‌లో 4 వారాల నుంచి 9 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని సమాచారం వెలువడింది.

కియా సోనెట్ డెలివరీస్ షురూ.. !

ఈ ఏడాది సొనెట్ భారతదేశంలో 1 లక్ష యూనిట్లు, అంతర్జాతీయ మార్కెట్లో 50,000 యూనిట్లు విక్రయిన్చాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం కంపెనీ ఈ ప్లాంటును సిద్ధం చేసింది, కంపెనీ అనంతపూర్ ప్లాంట్ లో సంవత్సరంలో 3 లక్ష యూనిట్లు ఉత్పత్తి చేయవచ్చు.

MOST READ:బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 18 క్రూయిజర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

కియా సోనెట్ డెలివరీస్ షురూ.. !

భారతదేశంలో ఒకసారి లాంచ్ అయిన తర్వాత, వినియోగదారులకు విస్తృత శ్రేణి కలర్ ఎంపికలలో ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. ఇందులో ఎనిమిది మోనో-టోన్ కలర్ ఎంపికలు ఉన్నాయి. అవి ఇంటెన్స్ రెడ్, బీజ్ గోల్డ్, అరోరా బ్లాక్ పెర్ల్, గ్రావిటీ గ్రే, స్టీల్ సిల్వర్, ఇంటెలిజెన్సీ బ్లూ, గ్లాసియర్ వైట్ పెర్ల్ మరియు క్లియర్ వైట్.

కియా సోనెట్ డెలివరీస్ షురూ.. !

మూడు డ్యూయల్-టోన్ కలర్ ఎంపికలు కూడా ఉన్నాయి. ఇంటెన్స్ రెడ్ / అరోరా బ్లాక్ పెర్ల్, బీజ్ గోల్డ్ / అరోరా బ్లాక్ పెర్ల్ మరియు గ్లాసియర్ వైట్ పెర్ల్ / అరోరా బ్లాక్ పెర్ల్. అంటే కియా సోనెట్ మొత్తం 11 కలర్ అప్సన్లలో లభిస్తుంది.

MOST READ:నమ్మండి.. ఇది నిజంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్బర్డ్ 350 బైక్

కియా సోనెట్ డెలివరీస్ షురూ.. !

కియా సోనెట్ లోపల 4.25 ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు యువిఓ కనెక్ట్ టెక్నాలజీ ఉన్నాయి. ఇది ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్, వైర్‌లెస్ ఛార్జింగ్, డి-కట్ స్టీరింగ్ వీల్, అనేక కంట్రోల్ బటన్లు, వెనుక ఎసి వెంట్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ సహా అనేక ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Kia Sonet Delivery Started. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X