కియా సోనెట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. వచ్చేసింది

సౌత్ కొరియా బ్రాండ్ కియా మోటార్స్, సోనెట్ అనే సరికొత్త ఎస్‌యూవీని భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. కొత్త కియా సోనెట్ భారతదేశంలో కియా బ్రాండ్ యొక్క మొట్టమొదటి సబ్-4 మీటర్ కాంపాక్ట్-ఎస్‌యూవీ. అంతే కాకుండా ఇది మేడ్-ఇన్-ఇండియా ప్రొడక్ట్.

కియా సోనెట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. వచ్చేసింది

కియా సోనెట్ భారతీయ మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్పత్తి. ఇది 2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడింది. ప్రయోగ సమయంలో సోనెట్ అత్యంత పోటీతత్వ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఉంచబడింది. ఈ ఎస్‌యూవీ త్వరలో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. భారతదేశంలో అడుగుపెట్టనున్న కియా సోనెట్ ఫస్ట్ లుక్ రివ్యూ ఇక్కడ మీకోసం..

కియా సోనెట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. వచ్చేసింది

డిజైన్ & స్టైలింగ్ :

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ చాలా మంచి స్టైలిష్ డిజైన్‌తో వస్తుంది. అంతే కాకుండా ఇది బ్రాండ్ యొక్క సిగ్నేచర్ ఎలిమెంట్స్ కూడా కలిగి ఉంటుంది.

కియా సోనెట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. వచ్చేసింది

ఈ కొత్త కియా సోనెట్ డిజైన్ ముందు నుండి ప్రారంభించి బ్రాండ్ యొక్క సిగ్నేచర్ టైగర్-నోస్ గ్రిల్ అప్ ఫ్రంట్, మధ్యలో రెండు ఇండెంటేషన్లతో ఉంటుంది. ఈ గ్రిల్ త్రీ డైమెన్షనల్ మెష్ తో వస్తుంది. ఇది చాలా ప్రీమియం లుక్ ఇస్తుంది.

కియా సోనెట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. వచ్చేసింది

ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌ గ్రిల్ ఉంటుంది. కియా సోనెట్ బంపర్‌పై ఒక జత ఎల్‌ఇడి ఫాగ్ లాంప్స్ కూడా కలిగి ఉంటుంది. దీనిలో టర్బో షేప్ స్కిడ్ ప్లేట్లు కూడా ఉన్నాయి.

కియా సోనెట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. వచ్చేసింది

సైడ్ ప్రొఫైల్‌కు వెళుతున్నప్పుడు కియా సోనెట్ మినిమాలిక్ స్టైలింగ్ ఫీచర్స్ తో కూడిన డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఎస్‌యూవీలో స్క్వేరిష్ వీల్ ఆర్చ్‌లు ఉన్నాయి. ఇందులో చాలా స్టైలిష్ 16 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

సోనెట్ రెండు టోన్ పెయింట్ స్కీమ్‌తో బ్లాక్ అవుట్ పైకప్పుతో వస్తుంది. ఇది ప్రత్యేకంగా రూపొందించిన సి-పిల్లర్ తో ఫ్లోటింగ్-రూఫ్ రూపాన్ని ఇస్తుంది. పైకప్పు మరియు ఫీచర్ సిల్వర్ రైల్, సైడ్ నుండి బోల్డ్ స్టైలింగ్ కి జోడిస్తాయి.

కియా సోనెట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. వచ్చేసింది

చివరగా కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క వెనుక ప్రొఫైల్ ఒక ప్రత్యేకమైన రిఫ్లెక్టర్ స్ట్రిప్‌తో అనుసంధానించబడిన హార్ట్ బీట్ ఎల్‌ఈడీ టైల్లైట్ల సెట్ ఉంటుంది. బూట్ క్యాప్ శుభ్రంగా ఉండి, సోనెట్ బ్యాడ్జింగ్‌తో పాటు బ్రాండ్ లోగోను కలిగి ఉంటుంది. కియా సోనెట్ యొక్క జిటి-లైన్ ట్రిమ్‌లు డ్యూయల్ మఫ్లర్ డిజైన్‌తో పాటు వెనుక బంపర్‌పై వెనుక స్కిడ్ ప్లేట్‌లో స్పోర్టి డిఫ్యూజర్ ఫిన్‌లతో పాటు వస్తాయి.

కియా సోనెట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. వచ్చేసింది

మొత్తంమీద కొత్త కియా సోనెట్ చాలా ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది. ఇది 10 కలర్ అప్సన్లలో వస్తుంది. ఇందులో ఏడు సింగిల్-టోన్ ఎంపికలు, అవి గ్లాసియర్ పెర్ల్ వైట్, స్టీల్ సిల్వర్, గ్రావిటీ గ్రే, ఇంటెన్స్ రెడ్, అరోరా బ్లాక్ పెర్ల్, ఇంటెలిజెన్సీ బ్లూ & బీయింగ్ గోల్డ్. మిగిలిన మూడు డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్స్. అవి రెడ్ / బ్లాక్, బీయింగ్ గోల్డ్ / బ్లాక్ మరియు వైట్ / బ్లాక్.

కియా సోనెట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. వచ్చేసింది

కాక్‌పిట్ & ఇంటీరియర్స్ :

కియా సోనెట్ కాంపాక్ట్-ఎస్‌యూవీ యొక్క క్యాబిన్ బోల్డ్, స్టైలిష్ మరియు ప్రీమియం డిజైన్ థీమ్‌ కలిగి ఉంటుంది. సోనెట్ యొక్క ఇంటీరియర్స్ చాలా ప్రీమియంగా కనిపిస్తాయి మరియు సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్స్ మరియు ఎక్విప్మెంట్స్ సమూహాన్ని అందిస్తాయి.

కియా సోనెట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. వచ్చేసింది

కియా సోనెట్ స్టైలిష్ లెదర్ తో చుట్టబడిన త్రి స్పోక్ వీల్ (జిటి-లైన్‌లో డి-కట్) ను కలిగి ఉంది. ఇది ఆడియో మరియు ఇతర ఫంక్షనాలిటీస్ కోసం నంబర్ అఫ్ మౌంట్ కంట్రోల్ కలిగి ఉంటుంది.

స్టీరింగ్ వీల్ వెనుక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. దీనిలో అనలాగ్ టాకోమీటర్ మరియు ఫ్యూయల్ గేజ్ చుట్టూ 4.2-ఇంచెస్ డిజిటల్ డిస్ప్లే ఉంటుంది. సెంట్రల్ డిస్ప్లే టర్న్-బై-టర్న్ నావిగేషన్, టిపిఎంఎస్ వంటివి కూడా ఇందులో ఉంటాయి.

కియా సోనెట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. వచ్చేసింది

డాష్‌బోర్డ్ యొక్క సెంట్రల్ కన్సోల్‌లో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో కూడిన 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది. డిస్ప్లే బ్రాండ్ యొక్క యువిఓ కనెక్ట్ చేసిన టెక్నాలజీతో పాటు నావిగేషన్‌తో వస్తుంది. ఈ యువిఓ కనెక్ట్ టెక్నాలజీ దానితో పాటు అదనపు ఫీచర్లు కలిగి ఉంటుంది.

కియా సోనెట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. వచ్చేసింది

డాష్‌బోర్డ్‌లోనే ప్రీమియం సాఫ్ట్ టచ్ మెటీరియల్‌లు ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ క్రింద, కియా సోనెట్ నిలువు ఎసి వెంట్లను కూడా కలిగి ఉంది, ఫిజికల్ క్లైమేట్ కంట్రోల్ కోసం సెంటర్ లో స్విచ్‌లు ఉంటాయి. వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్‌కు కూడా ఇందులో స్థలం ఉంది.

కియా సోనెట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. వచ్చేసింది

సెంట్రల్ కన్సోల్ గేర్ లివర్ చుట్టూ సిల్వర్ అక్సెంట్స్ కూడా వస్తుంది. ఈ సిల్వర్ అక్సెంట్స్ స్టీరింగ్ వీల్‌పై ఎసి వెంట్ల చుట్టూ కూడా చూడవచ్చు.

క్యాబిన్ ఒక విశాలమైన అనుభూతిని అందిస్తుంది, నలుగురు ప్రయాణీకులకు సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. టాప్-స్పెక్‌లోని సీట్లు లెదర్ తో చుట్టబడి ఉంటాయి. అంతే కాకుండా దీని ముందు సీట్లు వెంటిలేటెడ్ ఫంక్షన్‌తో వస్తాయి. వెనుక సీట్లు దీనికి మంచి మద్దతును అందిస్తాయి.

కియా సోనెట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. వచ్చేసింది

ఫీచర్స్ :

కియా సోనెట్ కాంపాక్ట్-ఎస్‌యూవీ సరికొత్త ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది ఈ విభాగంలో చాలా ఆకర్షణీయమైన సమర్పణగా నిలిచింది. కియా సోనెట్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్స్ గమనిస్తే, ఇందులో

 • ఎల్‌ఈడీ లైటింగ్ ఆల్‌రౌండ్
 • 16 ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్
 • ఎలక్ట్రిక్ సన్‌రూఫ్
 • 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
 • 4.25 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లై
 • వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు
 • వైర్‌లెస్ ఛార్జింగ్
 • ఎల్ఇడి మూడ్ లైటింగ్
 • సబ్ వూఫర్‌తో BOSE 7-స్పీకర్ సిస్టమ్
 • స్మార్ట్-ఎయిర్ ప్యూరిఫైయర్
 • మల్టీ-డ్రైవ్ మోడ్‌లు

ఉంటాయి. జిటి-లైన్ ట్రిమ్‌లు అనేక అదనపు స్టైలింగ్ ఎలిమెంట్స్‌తో పాటు ఇతర ఫీచర్‌లను కూడా అందిస్తాయి.

కియా సోనెట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. వచ్చేసింది

సేఫ్టీ ఎక్విప్మెంట్ :

కియా సోనెట్ లో ఉన్న లగ్జరీ ఫీచర్లతో పాటు మంచి సేఫ్టీ ఎక్విప్మెంట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సేఫ్టీ ఎక్విప్మెంట్ అన్ని వేరియంట్లు మరియు ట్రిమ్‌లలో ప్రామాణికమైనవిగా ఉంటాయి. ఇందులో ఉన్న సేఫ్టీ ఎక్విప్మెంట్ గమనించినట్లయితే, ఇందులో

 • 6 ఎయిర్‌బ్యాగులు
 • ట్రాక్షన్ కంట్రోల్
 • ఈబిడి విత్ ఏబిఎస్
 • టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టిపిఎంఎస్)
 • ESC, హెచ్ఏసి, VSM మరియు బ్రేక్ అసిస్ట్
 • ప్రొజెక్టర్ ఫాగ్ లాంప్స్
 • ఐస్ఓఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్-యాంకర్స్
కియా సోనెట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. వచ్చేసింది

ఇంజిన్ & ట్రాన్స్మిషన్ ఆప్సన్స్ :

కియా సోనెట్ కాంపాక్ట్-ఎస్‌యూవీ అదే మూడు ఇంజన్ ఎంపికలను కలిగి ఉంటుంది. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టి-జిడి పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికలు ఉన్నాయి. ఈ మూడు ఇంజిన్ లు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడ్డాయి. ఇది హ్యుందాయ్ వెన్యూలో ఉన్న పవర్ మరియు టార్క్ ఫిగర్స్ ఉత్పత్తి చేస్తాయని భావిస్తున్నారు.

కియా సోనెట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. వచ్చేసింది

1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్ గా వస్తాయి. పెట్రోల్ కోసం 5-స్పీడ్ మాన్యువల్ మరియు డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగి ఉంటుంది. 1.5-లీటర్ సిఆర్‌డి యూనిట్ కూడా అప్సనల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌ను అందుకుంటుంది.

కియా సోనెట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. వచ్చేసింది

మరోవైపు 1.0 లీటర్ టి-జిడిఐ పెట్రోల్ యూనిట్ 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ లేదా సరికొత్త సిక్స్-స్పీడ్ ఐఎమ్‌టి గేర్‌బాక్స్ ఎంపికను అందుకుంటుంది. ఇది ఇటీవల హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యువిలో ప్రారంభమైంది.

కియా సోనెట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. వచ్చేసింది

కియా సోనెట్ ప్రత్యర్థులు :

ఈ నెల చివర్లో లేదా సెప్టెంబర్ ఆరంభంలో సోనెట్ ఎస్‌యూవీ భారతదేశంలో విక్రయించబడుతుందని భావిస్తున్నారు. భారతదేశంలో లాంచ్ అయిన తర్వాత హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యువి 300 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

కియా సోనెట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. వచ్చేసింది

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన కియా మోటార్స్ ఇప్పుడు సరికొత్త కియా సోనెట్ ఎస్‌యూవీని ప్రారంభించనుంది. కియా బ్రాండ్ యొక్క మునుపటి ఉత్పత్తులు కూడా ఇప్పటికే గొప్ప విజయాన్ని సాధించాయి. సెల్టోస్ ఎస్‌యూవీ కూడా దేశీయ మార్కెట్లో గొప్ప విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Kia Sonet SUV Review (First Look). Read in Telugu.
Story first published: Friday, August 7, 2020, 15:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X