ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన కియా సోనెట్ ఎస్‌యూవీ : ధర & ఇతర వివరాలు

దక్షిణ కొరియా కార్ బ్రాండ్ కియా మోటార్స్ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నతమ సోనెట్ ఎస్‌యూవీని ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదల చేసింది. సరికొత్త కియా సోనెట్ దేశంలో బ్రాండ్ యొక్క మూడవ మోడల్ మరియు ఇది సరికొత్త ఎంట్రీ లెవల్ ఆఫర్. కియా సోనెట్ ఇప్పుడు భారతదేశంలో రూ. 6.71 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ప్రారంభ ధరతో అమ్మకానికి ఉంది.

కియా సోనెట్ టెక్-లైన్ మరియు జిటి-లైన్ ట్రిమ్స్ కింద మొత్తం ఆరు వేరియంట్లలో అందించబడుతుంది. టెక్-లైన్ కింద HTE, HTK, HTK +, HTX మరియు HTX +, జిటి- లైన్ కేవలం రేంజ్-టాపింగ్ జిటిఎక్స్ ప్లస్ వేరియంట్‌ను అందుకుంటుంది. కియా సోనెట్ యొక్క టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 11.99 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా).

Smartstream G1.2 G1.0 T-GDI D1.5 CRDi WGT D1.5 CRDi VGT
HTE ₹6.71 Lakh (5MT) ₹8.05 Lakh (6MT)
HTK ₹7.59 Lakh (5MT) ₹8.99 Lakh (6MT)
HTK+ ₹8.45 Lakh (5MT) ₹9.49 Lakh (6iMT) / ₹10.49 Lakh (7DCT) ₹9.49 Lakh (6MT) ₹10.39 Lakh (6AT)
HTX ₹9.99 Lakh (6iMT) ₹9.99 Lakh (6MT)
HTX+ ₹11.65 Lakh (6iMT) ₹11.65 Lakh (6MT)
GTX+ ₹11.99 Lakh (6iMT) ₹11.99 Lakh (6MT)

కియా సోనెట్ మొట్టమొదట 2020 ఆటో ఎక్స్‌పోలో దాని కాన్సెప్ట్ వెర్షన్‌లో ప్రదర్శించబడింది. కియా మోటార్స్ సోనెట్ కోసం గత నెలలో అధికారికంగా బుకింగ్‌లను ప్రారంభించింది, దీనికి అధిక స్పందన లభించింది. కియా మోటార్స్ బుకింగ్స్ ప్రారంభించిన మొదటి 24 గంటల్లో 6500 బుకింగ్‌లను నమోదు చేసింది.

MOST READ:మీకు తెలుసా.. ఈ సైకిల్ ధర అక్షరాలా రూ. 13.2 లక్షలు.. ఎందుకంటే ?

కియా సోనెట్ కోసం బుకింగ్స్ ఆన్‌లైన్ ద్వారా లేదా భారతదేశం అంతటా ఏదైనా కంపెనీ డీలర్‌షిప్‌ల ద్వారా రూ. 25 వేలకు చేసుకోవచ్చు. ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీ యొక్క డెలివరీలు త్వరలో ప్రారంభంకానున్నాయి.

కియా సోనెట్ బ్రాండ్ యొక్క కొత్త ఎంట్రీ లెవల్ సమర్పణ మరియు సెల్టోస్ తరువాత రెండవ 'మేడ్-ఇన్-ఇండియా' మోడల్. సోనెట్ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో తయారు చేయబడుతుంది. ఇది భవిష్యత్తులో ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు ప్రధాన ఎగుమతి కేంద్రంగా కూడా ఉంటుంది.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొన్న మహిళా పోలీస్.. బైక్ కొనడానికి కారణం అడిగితే ఏం చెప్పిందో తెలుసా ?

కియా సోనెట్ చాలా స్టైలిష్ డిజైన్ కలిగి ఉటుంది. ఇందులో అనేక కొత్త ఫీచర్స్ ఉన్నాయి. సోనెట్ కాంపాక్ట్-ఎస్‌యూవీలో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఫాగ్ లాంప్స్, సిగ్నేచర్ 'టైగర్-నోస్' ఫ్రంట్ గ్రిల్, 16-ఇంచ్ క్రిస్టల్-కట్ అల్లాయ్ వీల్స్, రిఫ్లెక్టర్ స్ట్రిప్ ద్వారా కనెక్ట్ చేయబడిన ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు మరియు దిగువన ఫాక్స్ డిఫ్యూజర్‌లు ఉన్నాయి.

సోనెట్ ఎస్‌యూవీ యొక్క లోపలి భాగంలో లెథరెట్ అప్హోల్‌స్టరీ, మౌంటెడ్ కంట్రోల్స్‌తో త్రీ-స్పోక్ డి-కట్ స్టీరింగ్ వీల్, ఎంఐడి స్క్రీన్‌తో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్ప్లేతో పెద్ద 10.25-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ది బ్రాండ్ యొక్క యువిఓ కనెక్ట్ టెక్నాలజీ, వైర్‌లెస్ ఛార్జింగ్, సౌండ్ & మూడ్ లైటింగ్, 7-స్పీకర్ బోస్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మరెన్నో వున్నాయి.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బిఎస్6 ధర పెంపు: కొత్త ప్రైస్ లిస్ట్

కియా సోనెట్ మూడు ఇంజన్ ఎంపికలతో వస్తుంది. ఇందులో రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజిన్ ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్ 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్ రూపంలో 83 బిహెచ్‌పి మరియు 115 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. ఇవి స్టాండర్డ్ ఐదు-స్పీడ్ మాన్యువల్‌తో జతచేయబడతాయి. రెండవ పెట్రోల్ ఇంజిన్ 1.0-లీటర్ త్రీ సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ రూపంలో 120 బిహెచ్‌పి మరియు 172 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ iMT (ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) లేదా 7-స్పీడ్ డిసిటి (డ్యూయల్-క్లచ్ ట్రాన్స్మిషన్) తో జతచేయబడుతుంది.

ఇందులో 1.5 లీటర్ సిఆర్‌డి డీజిల్ ఇంజన్ కూడా ఆఫర్‌లో ఉంది. ఈ ఇంజన్ టు స్టేట్ ఆఫ్ ట్యూన్స్‌లో వస్తుంది. లోయర్ స్టేట్ 100 బిహెచ్‌పి మరియు 240 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్‌తో జతచేయబడుతుంది. అదేవిధంగా హైయర్ స్టేట్ అఫ్ ట్యూన్ 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి 115 బిహెచ్‌పి మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Smartstream G1.2 G1.0 T-GDI D1.5 CRDi WGT D1.5 CRDi VGT
18.4 kmpl 18.2 kmpl 24.1 kmpl 19.0 kmpl

MOST READ:కొత్త ఫీచర్లతో విడుదల కానున్న హమ్మర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (టీజర్ వీడియో)

కియా సోనెట్ 11 కలర్ అప్సన్లలో అందించబడుతుంది. ఇందులో 8 సింగిల్-టోన్ కలర్స్ మరియు 3 డ్యూయల్-టోన్ కలర్స్ ఉన్నాయి. సింగిల్-టోన్ కలర్స్ లో ఇంటెన్స్ రెడ్, బీజ్ గోల్డ్, అరోరా బ్లాక్ పెర్ల్, గ్రావిటీ గ్రే, స్టీల్ సిల్వర్, ఇంటెలిజెన్సీ బ్లూ, గ్లాసియర్ వైట్ పెర్ల్ మరియు క్లియర్ వైట్ ఉన్నాయి.

అదేవిధంగా మూడు డ్యూయల్-టోన్ కలర్స్ లో ఇంటెన్స్ రెడ్ / అరోరా బ్లాక్ పెర్ల్, గ్లాసియర్ వైట్ పెర్ల్ / అరోరా బ్లాక్ పెర్ల్ మరియు బీజ్ గోల్డ్ / అరోరా బ్లాక్ పెర్ల్ ఉన్నాయి.

మేము ఇటీవల కియా సోనెట్ కాంపాక్ట్-ఎస్‌యూవీ ఫస్ట్ డ్రైవ్ ప్రారంభించాము. ఇది వాహనదారునికి చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అంతే కాకుండా కియా సోనెట్ చాలా మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది మరియు చాలా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. వాహనదారునికి చాలా అనుకూలమైన డ్రైవింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుంది. కియా సోనెట్ కాంపాక్ట్-ఎస్‌యూవీ యొక్క ఫస్ట్ డ్రైవ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారత మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంపాక్ట్-ఎస్‌యూవీ విభాగంలో ఒకటి కియా సోనెట్. ఇది 2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడినప్పటి నుంచి చాలామంది వాహనప్రియులు దీనికోసం ఎదురుచూస్తున్నారు. కియా సోనెట్, మారుతి సుజుకి వితారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టాటా నెక్సాన్‌తో పాటు నిస్సాన్ మాగ్నైట్, టయోటా అర్బన్ క్రూయిజర్ మరియు రెనాల్ట్ కిగర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Kia Sonet Compact-SUV Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X