Just In
- 16 min ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 1 hr ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 3 hrs ago హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- 5 hrs ago బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
Don't Miss
- News ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!
- Movies Adivi Sesh: "అకీరాతో స్నేహం అలా కుదిరింది.. కచ్చితంగా అతడితో సినిమా చేస్తా"
- Technology X ప్లాట్‌ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్‌కు భయపడి ఆ బౌలర్‌పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కైనెటిక్ సఫర్ జంబో ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు
పూణేకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ , భారతదేశంలో ఒన్ టన్ ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్‌ను సఫర్ జంబోని పరిచయం చేసింది. కొత్త కైనెటిక్ సఫర్ జంబో ఎలక్ట్రిక్ కార్గో త్రీ వీలర్ ధర రూ. 2.50 లక్షలు, ఎక్స్-షోరూమ్ (పూణే). ఈ కొత్త కైనెటిక్ సఫర్ జంబో ఎలక్ట్రిక్ కార్గో త్రీ వీలర్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..!
ఈ కైనెటిక్ సఫర్ జంబో ఎలక్ట్రిక్ కార్గో త్రీ వీలర్ పలు వాణిజ్య ప్రయోజనాలను పరిష్కరించడానికి ప్రవేశపెట్టబడింది. కైనెటిక్ సఫర్ జంబో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ను ఎల్‌పిజి సిలిండర్ల షార్ట్ డిస్టెన్స్ డెలివరీలకు కూడా ఉపయోగించవచ్చు. వ్యర్థ పదార్థాల నిర్వహణ మరియు ఫుడ్ ట్రక్ లాగా కూడా ఇది ఉపయోగపడుతుంది.
కైనెటిక్ గ్రీన్ సఫర్ జంబో ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్ దేశంలోని కంపెనీ ఆర్ అండ్ డి సౌకర్యం వద్ద గ్రౌండ్ అప్ నుండి రూపొందించబడింది. ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ 100% దేశీయ భాగాలను ఉపయోగించి నిర్మించబడినది అని కంపెనీ పేర్కొంది.
MOST READ:బాలీవుడ్ నటి చేసిన పనికి ఆనందంలో మునిగిపోయిన ఉద్యోగి.. ఇంతకీ ఎం చేసిందో తెలుసా?
ఈ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఎల్ 5 కమర్షియల్ వెహికల్ కేటగిరీ పరిధిలోకి వస్తుంది. ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్ 500 కిలోల పేలోడ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. సరుకులను తీసుకెళ్లడానికి, కైనెటిక్ సఫర్ జంబో ప్రత్యేకంగా రూపొందించిన 150 క్యూబిక్ అడుగుల స్థలాన్ని కలిగి ఉంటుంది.
కైనెటిక్ సఫర్ జంబో యొక్క భద్రత కోసం స్టీల్ బాడీని ఉపయోగించి నిర్మించబడింది. ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో శక్తినిస్తుంది, ఇది ఒకే ఛార్జీలో గరిష్టంగా 120 కిలోమీటర్లు ప్రయాణించగలదు. కార్గో త్రీ-వీలర్‌లోని ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ కూడా గంటకు 55 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
MOST READ:ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కొత్త ట్రాఫిక్ సిగ్నెల్ సిస్టం ఏర్పాటు.. ఎక్కడో తెలుసా?
త్రీ-వీలర్‌లోని బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జ్ కోసం 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. కంపెనీ సఫర్ జంబోను అప్సనల్ ఫాస్ట్ ఛార్జర్‌ను రూ. 20,000 కు ఆఫర్ చేస్తుంది. ఇది ఛార్జింగ్ సమయాన్ని 2 గంటలలోపు తగ్గిస్తుంది. ఈ ఛార్జర్ ద్వారా చాలా ఫాస్ట్ గా ఛార్జింగ్ చేసుకోవచ్చు.
సఫర్ జంబో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ధరలో గవర్నమెంట్ ఫేమ్ II సబ్సిడీ కింద రూ. 60,000 ఇన్సెంటివ్స్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. సంస్థ సఫర్ జంబోకు ప్రామాణిక మూడేళ్ల వారంటీతో పాటు అందించనుంది.
MOST READ:నీటిపై ల్యాండ్ అయ్యే విమానం మీరు ఎప్పుడైనా చూసారా.. అయితే ఇది చూడండి
ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్‌లోని ఇతర అంశాలు ఇండిపెండెంట్ సస్పెన్షన్ మరియు అప్‌గ్రేడ్ చేసిన హైడ్రాలిక్ బ్రేక్‌లు ఉంటాయి. సఫర్ జంబోలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంటరాక్టివ్ కైనెటిక్ కనెక్ట్ యాప్, డైనమిక్ ఎస్ఓసి, క్యాన్-బేస్డ్ కంట్రోలర్ మరియు 'మ్యాజిక్ గేర్' ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
కైనెటిక్ సఫర్ జంబో ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్ లాస్ట్ మైల్ డెలివరీలకు మరియు ఇంట్రా-సిటీ వాణిజ్య వినియోగానికి అనువైనది. ఇది ఎలక్ట్రిక్ అయినందున, ప్రామాణిక డీజిల్-శక్తితో కూడిన ప్రత్యర్థులతో పోలిస్తే, త్రీ-వీలర్ యాజమాన్యంలో ఖర్చులను తగ్గించగలదు. ఇది వినియోగదారులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వెహికల్ కి గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ కూడా లభిస్తాయి.
MOST READ:దీపావళి ఆఫర్: ఒకినావా ఇవి స్కూటర్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్స్